Intinti Gruhalakshmi: నిజం చెప్పిన రాజ్యలక్ష్మి.. దివ్య పాలలో నిద్ర మాత్రలు.. లాస్య మరో కుట్రతో షాక్

ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు ముప్పై ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

Intinti Gruhalakshmi Serial Today Episode July 12th 2023

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. విక్రమ్ వచ్చిన వెళ్లిన తర్వాత వెంటనే తులసి దివ్యకు ఫోన్ చేస్తుంది. అంతేకాదు, తమ పరువు తీసినందుకు కూతురిని చెడామడా తిట్టేస్తుంది. అలాగే, తమ గురించి ఆలోచించవద్దని, ఇంకెప్పుడూ ఫోన్ కూడా చేయొద్దని వార్నింగ్ ఇస్తుంది.

దీంతో విక్రమ్ వచ్చిన వెంటనే దివ్య పెద్ద గొడవ చేస్తుంది. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా రాజ్యలక్ష్మి వాళ్లు నటిస్తూ ఆమెను విక్రమ్‌కు ఇంకా విలన్‌ను చేస్తారు. దీని తర్వాత నందూ బిజినెస్‌కు పెట్టుబడి కోసం తులసి తాళిబొట్టును తీసి అతడికి ఇస్తుంది. ఈ సీన్ అంతా ఎంతో ఎమోషనల్‌గా సాగింది.

Intinti Gruhalakshmi Serial Today Episode July 12th 2023

కొత్త అర్థాలను వెతకవద్దు అని: తాళి తీసేయడానికి సిద్ధపడిన తులసిని అనసూయ 'నేను మా ఆయనతో కలిసి గదిలో పడుకుంటున్నా.. నువ్వు, నీ మాజీ భర్తతో కలిసి ఇంట్లో ఉంటున్నావు. నీకు నాకు తేడా ఏంటి' అని ప్రశ్నిస్తుంది. దీనికి తులసి 'తేడా ఏంటో మీ మనసుకే తెలుసు. మీరిద్దరి జీవితాలు ఒకటే. మేం అలా కాదు. ఎవరి జీవితాలు వాళ్లవి. కేవలం అవసరాల కోసం ఒకే గూట్లో తలదాచుకుంటున్నాం. దయచేసి ఆ బ్రతుకుల వెనుక అర్ధాలు వెతకొద్దు. లేని అర్ధాలు ఊహించుకోకండి' అని చెప్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode July 12th 2023

ఎగతాళి చేసే సంస్కారం కాదు: ఆ తర్వాత తులసి 'నేను సతీ అనసూయను, సతీ సావిత్రిని అని చెప్పుకోవడం లేదు. వివాహ వ్యవస్థపై నమ్మకం ఉన్న ఓ సగటు ఆడదాన్ని. నాకుగా నేను ఓ లక్ష్మణ రేఖ గీసుకుని గుట్టుగా బతుకుతున్నాను. నా భర్త నన్ను ఎగతాళి చేసి నన్ను వదిలేసినా.. ఆయన కట్టిన తాళిని ఎగతాళి చేసి వదిలేసేటంత సంస్కారం లేని దాన్ని కాదు. అందుకే ఇన్నాళ్లూ ఈ మంగళసూత్రం ఉంచుకున్నా. ఇక ముందూ ఉంచుకుంటాను' అంటుంది. ఆ తర్వాత మెడలో నుంచి మంగళసూత్రాన్ని ఎంతో బాధగా తీసేస్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode July 12th 2023

నందూకు తాళి ఇచ్చేసిందిగా: మంగళసూత్రాన్ని తీసుకుళ్లిన తులసి నేరుగా నందూ చేతిలో పెడుతుంది. కానీ, అతడు అది తీసుకోడానికి ఇబ్బంది పడతాడు. దీంతో తులసి అతడికి కొన్ని మాటలు చెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. తర్వాత తల్లిదండ్రులు కూడా నందూకు చెప్తారు. అప్పుడు తులసి 'ఈ కేఫ్ లేకపోతే మీకు జీవితమే లేదు. కుటుంబాన్ని పోషించలేకపోతున్నాని జీవితాంతం బాధపడటం తప్ప చేయగలిగింది ఏదీ లేదు. ఇది మీకు ఓకే అంటే ఆ తాళి తిరిగి నా చేతిలో పెట్టండి' అని అంటుంది. దీంతో ఇష్టం లేకపోయినా తులసి తాళిని తీసుకుంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode July 12th 2023

దివ్య ఏడుపు.. వాళ్లు సంతోషం: దివ్య తన పరిస్థితికి గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అంతేకాదు, 'అందరినీ అర్ధం చేసుకునే మా అమ్మ.. నన్ను ఎందుకు అర్ధం చేసుకోవడం లేదు. శాంతమూర్తైన మా అమ్మ.. నాపై ఎందుకు కోప్పడుతుంది? అమ్మ నాతో మాట్లాడకుండా ఉండగలిగినా నేను మాట్లాడకుండా ఉండలేను' అని అనుకుంటుంది. ఇదంతా రాజ్యలక్ష్మి, లాస్యలు చూసి సంతోషిస్తారు. అప్పుడు లాస్య 'ఈ కన్నీళ్లే కదా రాజ్యలక్ష్మీ నువ్వు చూడాలనుకున్నావు. చూడు నీ కోడలు ఎలా కుమిలికుమిలి ఏడుస్తుందో. ఆ తులసి, నందూ కూడా ఇలాగే ఏడవాలి' అని అంటుంది.

ఆస్తి కోసమే.. వాడేం కొడుకు?: విక్రమ్‌ను రాజ్యలక్ష్మి కొడుకు అని లాస్య అనడంతో ఆమె 'లాస్యా.. నువ్వు ప్రతిసారీ ఆ విక్రమ్ గాడిని నా కొడుకు.. నా కొడుకు అని అనొద్దు. నా కొడుకు సంజయ్. నా రక్తం పంచుకుని పుట్టింది వాడే. విక్రమ్ గాడి ఆస్తి సంజయ్ పేరు మీద మార్చేవరకే ఈ ప్రేమ. ఆ తరువాత వాడెవడో నేనెవరో' అని అంటుంది.

దీంతో లాస్య 'ఎంతైనా విక్రమ్ వల్ల కోట్ల ఆస్తి కలిసి వస్తుంది కదా. కొంచెమైనా జాలి , కరుణ లేదా' అనగా.. 'ప్రేమించి పెళ్లి చేసుకున్న నందునే ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించావు. ఆస్తిని లాక్కోవడానికి ప్రయత్నించావు. నువ్వా ప్రేమ, జాలి, కరుణ గురించి మాట్లాడేది. నేను కూడా నీ టైపే. నేను నా మొగుడ్ని పెళ్లి చేసుకున్నదే ఆస్తి కోసం. దాన్ని లాక్కుని విక్రమ్ గాడి పీడ వదిలించుకోవాలి' అని అంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode July 12th 2023

విక్రమ్‌ను బ్లాక్‌మెయిల్ చెయ్: దివ్య దగ్గరకు వెళ్లిన లాస్య.. 'నేను నీ పాలిట చిరుత పులిని. నన్ను చూసి పారిపోతున్నా నిన్ను వేటాడటం ఖాయం' అంటుంది. దీంతో దివ్య 'నీ గురించి గొప్పగా ఊహించుకోకు. కంపుకొట్టే చోట ఎవరూ ఉండాలని అనుకోరు. నీ మాటలు కూడా అంతే కదా.

బురదలో రాయి వేయడం ఎందుకని వెళ్లిపోతున్నా' అంటుంది. 'సర్లే నువ్వు ఎంత వెటకారం చేసినా.. నీపై కోపం రావడం లేదు దివ్యా.. నీ కష్టం చూస్తే జాలి వేస్తుంది.. బయటపడే మార్గం చెప్పనా? నువ్వు విక్రమ్‌ను ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చెయ్. నేనూ మీ నాన్నతో అలాగే చేశా' అని అంటుంది.

దివ్య సూసైడ్ చేసుకోవాలని: దివ్యకు ఎంత చెప్పినా ఆమె మాత్రం అస్సలు వినదు. పైగా లాస్యను తిట్టి వెళ్లిపోతుంది. ఇక, అక్కడి నుంచి వెళ్లిన లాస్య నేరుగా విక్రమ్ దగ్గరకు చేరుకుని దివ్య నిద్రమాత్రలు మింగి సూసైడ్ చేసుకోబోతుంది అని చెప్తుంది. దీంతో విక్రమ్ కంగారుగా వచ్చి ఆమె పాలు తాగబోతుంటే గ్లాస్‌ను విరిసేస్తాడు. అప్పుడు కోపంతో భర్తపై అరవగా అందరూ అక్కడకు వస్తారు. మొత్తానికి లాస్య చెప్పిందే నిజం అనుకుని నమ్మ.. దివ్య ఆత్మహత్య చేసుకోబోతుందని అనుకుంటారు. అప్పుడు దివ్య ఎంత చెప్పినా వినిపించుకోరు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X