For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi July 13 Episode: లాస్య తీరుపై అనసూయకు కష్టం.. విడాకుల తర్వాత నందూకు దెబ్బ

  |

  మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. కొడుకును చూడాలన్న ఉద్దేశంతో అనసూయ.. నందూ ఇంటికి వెళ్లిపోతుంది. అప్పుడు లాస్య మనసులో తిట్టుకుంటూనే ఆమెకు స్వాగతం పలుకుతుంది. ఆర్థికంగా ఇబ్బంది పడుతోన్న నందూకు కాంట్రాక్టు తాలూకు మనీని పంపుతారు. ఇక, కాంట్రాక్టర్ సూచన మేరకు తులసి తన వ్యాపారాన్ని వృద్ధి చేయాలని భావిస్తూ దానిపై ఆలోచిస్తుంటుంది.

  లాస్య చేసిన పనితో అనసూయకు కష్టం

  లాస్య చేసిన పనితో అనసూయకు కష్టం

  వ్యాపారాన్ని వృద్ది చేయాలన్న ఉద్దేశంతో శృతితో తులసి మాట్లాడుతుండగా ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. ఆ వెంటనే అనసూయ పిజ్జాను తీసుకొచ్చి లాస్య ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చిందని చెబుతూ తింటుంది. మధ్యలో భర్తకు, అభికి ఇస్తానన్నా వాళ్లు మాత్రం తినరు. అలా దాన్ని మొత్తం లాగించేసిన ఆమెకు విరేచనాలు అవుతాయి. ఆమె కష్టం చూసి అంతా నవ్వుతారు.

  అంకితతో ఫోన్‌లో గొడవ పెట్టుకున్న అభి

  అంకితతో ఫోన్‌లో గొడవ పెట్టుకున్న అభి

  చాలా రోజులుగా అంకిత తన పుట్టింటిలోనే ఉంటుంది. దీంతో అభి ఆమెకు ఫోన్ చేస్తాడు. ‘మీ ఇంటికి వెళ్తే అస్సలు రావాలనిపించదా? ఎప్పుడు వస్తావ్ అంకిత' అని అడుగుతాడు. అప్పుడామె ‘మామ్‌కి ఒంట్లో బాగోలేదు కదా. ఆమెకు నయమైన తర్వాత వస్తాను' అంటుంది. దీంతో అభి ‘ఆమెను మీ డాడీ చూసుకుంటాడు కదా. అయినా నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో' అని కాల్ కట్ చేస్తాడు.

  అభికి క్లాస్ పీకిన తులసి.. తనకు సపోర్ట్

  అభికి క్లాస్ పీకిన తులసి.. తనకు సపోర్ట్

  అంకితతో అభి గొడవ పడుతుండగా తులసి అక్కడకు వస్తుంది. ‘ఎందుకురా అంకితపై కోప్పడుతున్నావ్? వాళ్ల అమ్మగారికి బాగోలేదనే కదా అక్కడికి వెళ్లింది. ఆమెకు బాగయ్యాక వస్తుందిలే. అయినా ప్రతి దానికి కోప్పడకూడదు. ప్రేమతో చెప్పాలి' అని క్లాస్ పీకుతుంది. అప్పుడు అభి ‘వాళ్లు తన మనసును మార్చేసే పనులు చేయిస్తారని భయంగా ఉందమ్మా' అంటూ బాధ పడతాడు.

  నందూను విలువైన కానుక కోరిన లాస్య

  నందూను విలువైన కానుక కోరిన లాస్య

  కాంట్రాక్టర్ దగ్గర నుంచి డబ్బులు రావడంతో నందూ ఇంట్లో సంతోషంగా ఉంటాడు. అంతలో లాస్య వచ్చి కార్లకు సంబంధించిన బ్రోచర్లను చూపిస్తుంది. దీంతో నందూ ఇవెందుకు చూపిస్తున్నావ్ లాస్య అని అడుగుతాడు. అప్పుడామె కారు కొందామని అంటుంది. దీనికి ఏవేవో కారణాలు చెప్పినా లాస్య మాత్రం ఊరుకోదు. పైగా నా సంతోషం కోసం కొనివ్వు అని అనడంతో ఒప్పుకుంటాడు.

  శృతి, ప్రేమ్ మధ్య రొమాంటిక్ సంభాషణ

  శృతి, ప్రేమ్ మధ్య రొమాంటిక్ సంభాషణ

  ఉదయాన్నే శృతి పూజలు చేస్తుంటుంది. ఇంటి బయట ఉన్న తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటుంది. ఇదంతా అక్కడే ఉన్న ప్రేమ్ చూస్తుంటాడు. ఆ తర్వాత ఇద్దరూ సైగలు చేసుకుంటూ మనుసులతో మాట్లాడుకుంటారు. అప్పుడు నీ చీర బాలేదని అతడు అనగా.. గుద్దుతా అని కొంటెగా అంటుంది. అప్పుడు ప్రేమ్.. శృతి దగ్గరగా వెళ్తాడు. దీంతో ఓ రొమాంటిక్ సాంగ్ ప్లే అవుతుంది.

  శృతికి ఫ్లాటైపోయిన తులసి కుటుంబం

  శృతికి ఫ్లాటైపోయిన తులసి కుటుంబం

  బయట పూజ చేసిన తర్వాత ఇంట్లోకి వచ్చిన శృతిని చూసి.. దేవుడి గదిలో పటాలను శుభ్రం చేస్తున్న తులసి ఎంతోగానో మురిసిపోతుంది. ఆ తర్వాత తాతగారితో ‘మీరు ఈరోజు ఉపవాశం ఉంటారు. మీకు ఇప్పుడు టిఫిన్, సాయంత్రం ఫలాలు ఇవ్వాలి. అంతేకదా తాతగారూ' అంటుంది శృతి. దీంతో ఆయన ‘అవునమ్మా. నువ్వు కూడా తులసిలా అందరి గురించి ఆలోచిస్తావ్' అంటాడు.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  లాస్యపై అనసూయ అసహనం.. కష్టంగా

  లాస్యపై అనసూయ అసహనం.. కష్టంగా

  ఇప్పటికే పిజ్జా తిని విరేచనాలతో ఇబ్బంది పడిన అనసూయ.. ‘తర్వాత రోజు ఉపవాసం చేస్తాను. కాబట్టి ఉదయాన్నే నాకు టిఫిన్ కావాలి' అని లాస్యకు చెబుతుంది. కానీ, ఎంత సమయం అయినప్పటికీ లాస్య మాత్రం నిద్ర లేవదు. దీంతో దేవుడికి పూలు పెట్టుకుంటూ ఉన్న అనసూయ ‘లాస్య ఏంటి టిఫిన్ కావాలని చెప్పినా ఇంకా నిద్ర లేవలేదు' అని అసహనం వ్యక్తం చేస్తుంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 370: Lasya Ordered Pizza for Anasuya. She Suffered with Motion after Eat Pizza. After That Shruthi Impress Every one In the Tulasi's House
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X