For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi July 14th Episode: తులసి విలువ తెలిసి వచ్చిన అత్త.. లాస్య, నందూకు కొత్త కష్టం

  |

  దేశం మొత్తం మీద తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. లాస్య తెప్పించిన పిజ్జా తిన్న అనసూయ విరేచనాల బారిన పడుతుంది. అనంతరం అభి తన భార్య అంకితతో గొడవ పడగా.. తులసి వచ్చి అతడికి సర్ధి చెబుతుంది. ఆ తర్వాత శృతి తులసి ఇంట్లోని వాళ్లందరినీ ఇంప్రెస్ చేస్తుంది. కారు కొనమని లాస్య నందూను కోరుతుంది. అనసూయ.. లాస్య వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేస్తుంది.

  తులసి విలువ తెలుసుకున్న అనసూయ

  తులసి విలువ తెలుసుకున్న అనసూయ

  నందూ ఇంటికి వచ్చి అనసూయ.. పూజ చేయడానికి అన్నీ సర్ధుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటుంది. ‘తులసి అయితే ఇంట్లో పూజకు కావాల్సినవన్నీ ముందురోజే సర్ధి పెట్టి ఉంచేది. దీంతో నా పూజ పెంటనే అయిపోయేది. కానీ, లాస్య మాత్రం ఇంకా నిద్ర లేవలేదు. ఈ పనులు చేయలేక చచ్చిపోతున్నాను' అంటూ బాధ పడుతుంది. తద్వారా తులసి విలువను తెలుసుకుంటుంది.

   అంకితపై తులసి.. విని సంతోషించిన అభి

  అంకితపై తులసి.. విని సంతోషించిన అభి

  ఇంట్లోని అందరి బాగోగులు చూస్తున్న శృతిని చూసి తాతగారు ‘అంకిత కూడా ఇలా అందరితో మంచిగా ఉంటే బాగుండు' అని అంటాడు. దీంతో తులసి ‘అంకితకు ఏమైంది మామయ్య? తను కూడా ఇప్పుడు అందరితో మంచిగా ఉంటుంది. అన్నీ అర్థం చేసుకుంటుంది' అని అంటుంది. ఈ మాటలను అభి పక్కనుంచి వింటాడు. తల్లి తన భార్యను పొగుడుతుంటే అతడు చాలా సంతోషిస్తాడు.

  అనసూయకు ఆకలి కష్టం.. లాస్య చిరాకు

  అనసూయకు ఆకలి కష్టం.. లాస్య చిరాకు

  పూజా చేస్తున్న సమయంలోనే అనసూయకు ఆకలి వేస్తుంది. దీంతో లాస్య ఎప్పుడు నిద్ర లేస్తుందా అని ఎదురు చూస్తుంది. కానీ, ఆమె మాత్రం ఎంతకూ లేవదు. దీంతో టీవీ సౌండ్‌ను ఎక్కువగా పెట్టి దేవుడి పాటలు ప్లే చేస్తుంది. దీంతో నిద్ర లేచిన లాస్య.. మంచం మీద ఉన్నప్పుడే అనసూయపై చిరాకు పడుతుంది. కిందకు వెళ్తే టిఫిన్ తయారు చేయమంటుందని అక్కడే ఉండిపోతుంది.

   ప్రేమ్ ప్రేమను బయట పెట్టిన రాములమ్మ

  ప్రేమ్ ప్రేమను బయట పెట్టిన రాములమ్మ

  వంటగదిలో ఉన్న శృతితో ‘నేను గార్మెంట్ కంపెనీకి వెళ్లొస్తాను. నువ్వు అందరికీ టిఫిన్స్ పెట్టమ్మా' అని చెబుతుంది. అప్పుడే అత్తగారి గురించి ఆలోచిస్తుంది. అప్పుడు రాములమ్మ అనసూయ గురించి వెటకారంగా మాట్లాడుతుంది. దీంతో తులసి ఆమెపై కోప్పడుతుంది. ఆ తర్వాత ప్రేమ్ ప్రేమను శృతి ముందు బయటపెడుతుంది రాములమ్మ. దీంతో ఆమె ఎంతగానో సిగ్గు పడిపోతుంది.

  అనసూయ పరిస్థితి తెలుసుకున్న తులసి

  అనసూయ పరిస్థితి తెలుసుకున్న తులసి

  ఆకలికి తట్టుకోలేకపోయిన అనసూయ.. తులసి ఇంటికి వచ్చేస్తుంది. అప్పుడు ఆమె భర్త ఊరించుకుంటూ ఫుల్లుగా తింటుంటాడు. దీంతో ఆమెకు మరింతగా నోరూరుతుంది. తులసి వచ్చి టిఫిన్ తినమనగా.. తినేసి వచ్చానని అంటుంది. అప్పుడు తులసి వెళ్లిపోతూ.. లాస్య ఉదయాన్నే లేవదని ఆలోచించి అత్త పరిస్థితిని గ్రహిస్తుంది. ఆ తర్వాత స్వయంగా టిఫిన్ వడ్డిస్తే ఫుల్లుగా లాగిస్తుంది.

  Chakra : Telugu Audience Are Always Says Actor Vishal
  నందూ ఇంటికొచ్చి గొడవ చేసిన దివాకర్

  నందూ ఇంటికొచ్చి గొడవ చేసిన దివాకర్

  నిద్ర పోతోన్న నందూకు దివాకర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. కానీ, అతడు దాన్ని లిఫ్ట్ చేయకుండా హాల్‌లో కూర్చుంటాడు. అప్పుడు లాస్య కూడా వచ్చి ఏమైందని అడుగుతుంది. దీనికి ‘దివాకర్ ఫోన్ చేస్తున్నాడు. ఏం సమాధానం చెప్పాలో తెలియక లిఫ్ట్ చేయట్లేదు' అని అంటాడు. అప్పుడు లాస్య కూడా తిడుతుంది. అంతలో దివాకర్ ఇంటికి వచ్చి నందూపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతాడు.

  English summary
  Intinti Gruhalakshmi Episode 371: Anasuya Suffering For Hungry. But Lasya Did Not Wake Up. Then Anasuya Came to Tulasi's House For Eating Tiffin. After That Diwakar Came to Nandu House.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X