Intinti Gruhalakshmi Today Episode: యాక్సిడెంట్ చేసిన నందూ.. బుక్కైన తులసి.. కథలో కొత్త ట్విస్ట్

చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా చూసేయండి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నిద్ర మాత్రలు కలిపినా తులసి మాత్రం స్థిరంగానే ఉంటుంది. దీంతో భాగ్యకు డౌట్ వస్తుంది. ఆ సమయంలోనే తులసి జొరుగుతూ ఉంటుంది. దీంతో అనసూయ, వసుధార ఆమెకు ధైర్యం చెప్పి బోనం సమర్పింపజేస్తారు.

ఆ తర్వాత జోగిని తులసి జీవితంలోకి కొత్త మనిషి రాబోతున్నాడని, తనను నమ్ముకోమని చెబుతుంది. దీంతో అందరూ తెల్లముఖం వేస్తారు. ఇక, మత్తు మాత్రలు కలిపిన విషయాన్ని చెప్పిన వసుధార.. లాస్య, భాగ్యకు వార్నింగ్ ఇస్తుంది. చివర్లో హనీ, సామ్రాట్ (ఇంద్రనీల్) కొత్త క్యారెక్టర్లుగా పరిచయం అవుతారు.

హనీని ఢీకొట్టిన నందూ, లాస్య కారు

హనీని ఢీకొట్టిన నందూ, లాస్య కారు

కొత్తగా పరిచయం అయిన హనీ.. వద్దని చెప్పినా వినకుండా సైకిల్‌ను తొక్కుకుంటూ రోడ్డు మీదకు వెళ్లిపోతుంది. దీంతో అక్కడే ఉన్న పనిమనిషి ఆ పాపను వెతుకుతూ ఉంటాడు. ఆ తర్వాత వాచ్‌మన్ సహాయంతో గాలిస్తుంటాడు. ఆ సమయంలోనే అటుగా వస్తున్న లాస్య, నందూ కారు.. హనీ సైకిల్‌ను ఢీకొడుతుంది. దీంతో ఆ చిన్నారి రోడ్డు మీద పడిపోతుంది. అప్పుడా పాపకు రక్తం కారుతూ ఉంటుంది. నందూ కారు ఆపి పాపను చూడబోతుండగా లాస్య మాత్రం వద్దని అతడిని వెళ్లిపోదాం అంటుంది. దీంతో నందూ కారును పోనిచ్చేయడంతో హనీ రోడ్డుపైనే ఉంటుంది.

హనీని ఆస్పత్రికి తీసుకెళ్లిన తులసి

హనీని ఆస్పత్రికి తీసుకెళ్లిన తులసి

హనీకి యాక్సిడెంట్ అయిన సమయంలో తులసి అటుగా ఆటోలో వెళ్తుంటుంది. అప్పుడు రోడ్డుపై పడి ఉన్న ఆ పాపను చూస్తుంది. వెంటనే ఆటో డ్రైవర్‌కు క్లాస్ పీకి పాపను తీసుకుని ఆస్పత్రిలోకి తీసుకు వెళ్తుంది. అప్పుడు నందూ 'పాపం మనం యాక్సిడెంట్ చేస్తే.. తులసి తనను తీసుకెళ్తుంది. లేనిపోని కష్టాల్లో ఇరుక్కుంటుందేమో' అని అంటాడు. దీంతో లాస్య నోరెళ్లబెట్టి చూస్తుంది. అనంతరం వాళ్లను పట్టించుకోవద్దని అతడి మనసును మార్చే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత నందూ మనసు ఒప్పుకోకపోవడంతో హనీని తీసుకెళ్లిన ఆస్పత్రికి వెళ్తాడు.

నందూ పాపానికి తులసికి పడ్డ శిక్ష

నందూ పాపానికి తులసికి పడ్డ శిక్ష

ఆస్పత్రిలోకి వెళ్లగానే అక్కడి డాక్టర్లు పాపకు ఏమైందని అడుగుతారు. దీంతో రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందని చెబుతుంది. అప్పుడు పాప మీకు ఏమవుతుంది అని ప్రశ్నిస్తారు. దీనికామె పాప ఎవరో తెలియదు అంటే ట్రీట్‌మెంట్ చేయరేమో అనుకొని.. అమ్మను అవుతాను అని చెబుతుంది. దీంతో వెంటనే రిసెప్షన్ దగ్గరికి వెళ్లి మీరు ఫార్మాలిటీస్ పూర్తి చేయండి అని డాక్టర్ చెబుతుంది.

దీంతో సరే అని వెళ్లి డబ్బులు కట్టి వస్తుంది. ఇంతలో నందూ, లాస్య ఇద్దరూ ఆసుపత్రికి వస్తారు. అక్కడ తులసిని చూస్తారు. అప్పుడు నందూ 'నేను చేసిన తప్పుకు పాపం తులసి శిక్ష అనుభవిస్తోంది' అంటాడు. అప్పుడు లాస్య 'నందూ ఇక వెళ్దాం పదా. సామ్రాట్ ఇచ్చిన టైమ్ అయిపోతుంది' అని అక్కడి నుంచి తీసుకెళ్తుంది.

 సామ్రాట్‌కు విషయం చెప్పడంతో

సామ్రాట్‌కు విషయం చెప్పడంతో

ఆస్పత్రిలో పాపకు ట్రీట్‌మెంట్ చేస్తుంటారు. కానీ, ఆమె స్పృహలోకి రాలేదు అంటారు. మరోవైపు నందూ, లాస్య.. సామ్రాట్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే అతడు కూడా ఆఫీసుకు వస్తాడు. అప్పుడు గతంలో ఎవరో అబద్ధం చెప్పారని జాబ్‌లో నుంచి తీసేస్తాడు. అతడు మళ్లీ ఆఫీసులో కనిపిస్తాడు. దీంతో మేనేజర్‌ను పిలిచి 'తను ఎందుకు వచ్చాడు. తప్పు చేసినా సహిస్తాను కానీ.. అబద్ధం చెబితే అస్సలు సహించను' అని వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు, పాప కోసం వెతుకుతూ ఆమె సైకిల్‌ను చూస్తారు. కానీ, పాప కనిపించదు. దీంతో వెంటనే సామ్రాట్‌కు ఫోన్ చేసి పాప కనిపించడం లేదని చెబుతారు. అప్పుడతను షాక్ అవుతాడు. వెంటనే ఇంటికి వెళ్తాడు.

కోలుకున్న హనీ.. సామ్రాట్ కేసు

కోలుకున్న హనీ.. సామ్రాట్ కేసు

హనీకి వైద్యం చేసిన తర్వాత బయటకు వచ్చిన డాక్టర్లు.. తనకు ఎలాంటి ప్రమాదం లేదని చెబుతారు. దీంతో అక్కడే ఉన్న తులసి ఊపిరి పీల్చుకుంటుంది. అంతేకాదు, ఆ తర్వాత డాక్టర్ హనీ గురించి చెబుతూ 'అంతా నార్మల్. ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు' అంటుంది. మరోవైపు, హనీ ఎంత వెతికినా కనిపించకపోవడంతో తన పాపను ఎవరో కిడ్నాప్ చేశారని సామ్రాట్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు కేసు పెడతాడు. అంతేకాదు, 'నా పాప గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్లకు ఒక కోటి ఇస్తా. 24 గంటల్లో నా పాప నా దగ్గర ఉండేలా చేయండి' అని చెప్తాడు.

హనీని తీసుకు వెళ్లిపోయిన తులసి

హనీని తీసుకు వెళ్లిపోయిన తులసి

చికిత్స తీసుకున్న తర్వాత హనీ స్పృహ లోకి వస్తుంది. దీంతో తులసి మీ పేరెంట్స్ నెంబర్ చెప్పు నేను మీ వాళ్లకు ఫోన్ చేస్తా అంటుంది. దీంతో ఆ చిన్నారి గుర్తు రావడం లేదు అంటుంది. ఆ తర్వాత తులసి పోనీ మీ ఇల్లు ఎక్కడ అని అడుగుతుంది. దీంతో తెలియనట్టు నటిస్తుంది. అంతేకాదు, మీతో పాటే తీసుకెళ్లండి ఇల్లు ఎక్కడుందో చూపిస్తాను అంటుంది. దీంతో ఆటోలో కూర్చోబెట్టుకొని హనీకి యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ దగ్గరికి తీసుకెళ్తుంది. కానీ.. హనీ అక్కడ తన ఇల్లు ఎక్కడుందో చెప్పలేదు. మరోవైపు సామ్రాట్ తన కూతురు కోసం అన్వేషిస్తూనే ఉంటాడు. కానీ, ఆమె ఆచూకీ మాత్రం లభ్యం కాదు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X