For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi July 15 Episode: లాస్యకు నందూ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. తులసికి కూడా ఇవ్వడంతో గొడవ

  |

  మిగిలిన భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూ ఇంట్లో ఆకలితో అలమటించిన అనసూయ.. తులసి దగ్గరకు వచ్చేస్తుంది. అక్కడ అత్తగారికి ఆమె కొసరి కొసరి వడ్డిస్తుంది. ఆ తర్వాత ప్రేమ్ ప్రేమను రాములమ్మ బయట పెట్టడంతో శృతి సిగ్గు పడిపోతుంది. ఇక, అంకితతో అభి ఫోన్‌లో గొడవ పెట్టుకోగా.. అతడికి తులసి క్లాస్ పీకుతుంది. తర్వాత దివాకర్ డబ్బుల కోసం నందూ ఇంటికొచ్చాడు.

  దివాకర్‌తో గొడవ.. లాస్యపై నందూ ఫైర్

  దివాకర్‌తో గొడవ.. లాస్యపై నందూ ఫైర్

  డబ్బులు అడగడానికి వచ్చిన దివాకర్‌తో నందూ మాట్లాడుతుండగా.. లాస్య గొడవ పడుతుంది. అప్పుడు అతడు ‘డబ్బుల కోసం వస్తే ఆమెను ఉసిగొల్పుతావా? అవసరం ఉన్నప్పుడు బ్రతిమాలి.. ఇప్పుడు అవసరం తీరాక ఇలా మాట్లాడతావా' అంటూ ఫైర్ అయ్యాడు. అప్పుడు లాస్య అతడికి వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత అలా ఎందుకు మాట్లాడావని లాస్యపై నందూ కోప్పడతాడు.

  తులసికి తప్పిన ప్రమాదం.. కాపాడింది

  తులసికి తప్పిన ప్రమాదం.. కాపాడింది

  తులసి గార్మెంట్ కంపెనీకి వెళ్తుండగా రోడ్డుపై ఓ కారు అదుపు తప్పి వేగంగా ఆమె వైపు దూసుకొస్తుంది. ఆ సమయంలో ఆమె ప్రమాదం నుంచి బయట పడుతుంది. ఆ తర్వాత కారు నడిపిన వ్యక్తిపై గొడవకు వెళ్లగా.. అది రామచంద్ర అని తెలుసుకుంటుంది. దీంతో వెంటనే ఆయనను ఆస్పత్రిలో చేర్పిస్తుంది. బీపీ తక్కువ అవడం వల్లే ఆయన ఇలా అయ్యారని డాక్టర్ చెబుతుంది.

  మన ఇద్దరికీ ఏదో అనుబంధం ఉందమ్మా

  మన ఇద్దరికీ ఏదో అనుబంధం ఉందమ్మా

  స్పృహలోకి వచ్చిన తర్వాత రామచంద్ర.. తులసిని చూసి గుర్తు పట్టడు. అప్పుడు మిశ్రా కంపెనీలో కలిశామని ఆమె చెప్పడంతో గుర్తు తెచ్చుకుంటాడు. ఆ తర్వాత ఆయన ‘మనిద్దరికీ ఏదో అనుబంధం ఉందమ్మా. నువ్వు సామాన్యంగా కనిపించినా నీ ముఖంలో కూడా ఏదో వెలుగు కనిపిస్తుంది. నన్ను బాబాయ్ అని పిలువు' అంటాడు. దీంతో తులసి అలానే పిలిచి నెంబర్ ఇస్తుంది.

  దివ్యను నందూ దగ్గరకెళ్లమన్న నానమ్మ

  దివ్యను నందూ దగ్గరకెళ్లమన్న నానమ్మ

  ఇంట్లో వర్క్ చేసుకుంటున్న దివ్యతో అనసూయ ‘నువ్వు డాక్టర్ అవ్వాలంటే మీ అమ్మను నమ్ముకుంటే సరిపోదు. మీ నాన్న దగ్గరకు వెళ్లు. వాడి దగ్గర చాలా డబ్బులున్నాయి' అంటుంది. దీనికి దివ్య ఆమెకు సరైన ఆన్సర్ ఇస్తుంది. అంతలో ఎంట్రీ ఇచ్చిన తాత కూడా ఆమెకు సపోర్ట్ చేస్తూ అనసూయకు వార్నింగ్ ఇస్తాడు. అంతేకాదు, శాశ్వతంగా అక్కడకు పంపిస్తానని బెదిరిస్తాడు.

  లాస్యకు నందూ సర్‌ప్రైజ్.. తులసి చూసి

  లాస్యకు నందూ సర్‌ప్రైజ్.. తులసి చూసి

  ఇంట్లో రెడీ అవుతోన్న లాస్య దగ్గరకు వచ్చిన నందూ.. వెనుక నుంచి హత్తుకుని నీకో సర్‌ప్రైజ్ అంటాడు. అంతేకాదు, ఆమె కళ్లు మూసి ఇంటి ఆవరణలోకి తీసుకొస్తాడు. అప్పుడు కొన్న కొత్త కారును చూపిస్తాడు. దీంతో లాస్య ‘మనల్ని ధ్వేషించే వాళ్లు చూసి కుళ్లుకునేలా చేశావ్. వాళ్లు నోర్లు మూయించావ్' అని హగ్ చేసుకుంటుంది. ఇదంతా తులసి చూసి ఒకరకంగా బాధ పడుతుంది.

  కారును తులసికిచ్చిన నందూ.. వాగ్వాదం

  కారును తులసికిచ్చిన నందూ.. వాగ్వాదం

  కొత్త కారు కొన్న వెంటనే పాత కారును తులసి ముఖాన కొట్టమని నందూకు లాస్య సలహా ఇస్తుంది. ఆ వెంటనే అతడు కారును తీసుకెళ్లి తులసికి ఇస్తాడు. ఆ సమయంలో ‘దీనిని అడ్డు పెట్టుకునే కదా నా పిల్లల ముందు అవమానించావ్.. దీన్ని చూస్తే అదే గుర్తొస్తుంది. అందుకే నీకే ఇచ్చేస్తున్నా' అంటాడు. దానికి తులసి కూడా సరైన సమాధానం చెబుతుంది. అంతలో నందూ తండ్రి, ప్రేమ్ అక్కడకు వచ్చి తులసికి సపోర్ట్ చేస్తారు.

  English summary
  Intinti Gruhalakshmi Episode 372: Diwakar Asked his Money from Nandu. That Time Lasya Fired on him. Then Nandu Gave Surprise Gift to Lasya. Tulasi Saved Ramachandra in an Accident.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X