Intinti Gruhalakshmi: దివ్య, విక్రమ్ రొమాన్స్.. దొంగను పట్టుకున్న లాస్య.. తులసికి ఎస్సై గుడ్ న్యూస్
ఈ మధ్య కాలంలో కొత్త కొత్త షోలు వస్తున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి.
అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి తాళిని దొంగ లాక్కెళ్లిపోయిన తర్వాత విక్రమ్ అత్తమామల దగ్గరకు వెళ్తాడు. అప్పటికే నిజం తెలుసుకుని బాధ పడుతున్న అతడు వాళ్ల కాళ్లపై క్షమించమని అడుగుతాడు. అనంతరం ఇంటికి వచ్చి లక్ష రూపాయలు దొంగతనం ఎవరు చేశారో తనకు తెలియాలని అంటాడు.
కానీ, ఎవరూ మాట్లాడరు. అప్పుడు అందరి ముందే దివ్య తప్పు చేయలేదని ఆమెకు సారీ చెప్తాడు. కానీ, ఆమె మాత్రం తనకు సారీ వద్దని వెళ్లిపోతుంది. ఇక, తులసి.. విక్రమ్‌లో వచ్చిన మార్పును చూసి నందూ ముందర సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది.

దివ్యకు నిజం చెప్పిన రాములమ్మ: దివ్యకు ఫోన్ చేసిన రాములమ్మ 'కథ సుఖాంతం అయిపోయిందమ్మా. విక్రమ్ బాబు మీకు చెప్పలేదా? ఇక బాధపడకండి. విక్రమ్ బాబు తప్పు తెలుసుకుని మన ఇంటికి వచ్చి సారీ చెప్పారు. ఇంకెప్పుడూ అలా జరగకుండా చూసుకుంటానని మాట ఇచ్చారు' అని చెప్తుంది.
దీంతో దివ్య ఎంతగానో సంతోషిస్తుంది. దీంతో దివ్య మరి అమ్మ నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు అనగా.. 'ఏమోనమ్మా.. అది మీరూ మీరూ చూసుకోండి. నేను మీకు ఫోన్ చేయలేదు. నాకేం తెలియదు' అని ఫోన్ పెట్టేస్తుంది. దీంతో విక్రమ్‌ను వెతుక్కుంటూ దివ్య పరుగున వెళ్తుంది.

విక్రమ్‌ను హగ్ చేసుకుని థ్యాంక్స్: విక్రమ్ కనిపించగానే దివ్య వెనుక నుంచి హగ్ చేసుకుని సంతోషిస్తుంది. అప్పుడతను ఎందుకంత ప్రేమ అని అడుగుతాడు. దీనికామె 'ఎదురు చూసిన మంచి రోజులు వచ్చాయనే సంతోషం. దీన్ని మాటల్లో చెప్పలేను' అంటుంది. దీంతో విక్రమ్ అయితే చేతల్లో చూపించు అని ఆమెను ఒక్కసారిగా మీదికి లాక్కుంటాడు.
తర్వాత దివ్య 'ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది విక్రమ్. మా అమ్మ నాన్నలకు నిజం చెప్పావు. పొరపాటును చేయడం సహజం. దాన్ని ఒప్పుకున్నందుకు నచ్చావు. నువ్వు సారీ చెప్పాక వాళ్లకు గుండెలపై భారం తగ్గిపోయింది. ప్రాణ త్యాగం చేయడం కంటే నింద మోయడం చాలా కష్టం. ఆ బాధ నాకు తెలుసు. మంచి పని చేశావు థాంక్స్' అని అంటుంది.

సరసాలు.. ముద్దులు అడుగుతూ: దివ్య మాటలకు విక్రమ్ 'నీ థాంక్స్ నీ దగ్గరే పెట్టుకో.. ఇందాక అందరి ముందు సారీ చెప్తే పట్టించుకోకుండా వెళ్లిపోయావు' అని అలుగుతాడు. దీంతో దివ్య 'అబ్బో అబ్బాయి గారికి కోపం వచ్చిందే. కోపం తగ్గాలంటే ఏం చేయాలో. నా థాంక్స్ నా దగ్గరే పెట్టుకో అన్నావు కదా.. నీ పెదాలపై పెట్టకూడదా' అని ఉడికిస్తుంది. దీంతో విక్రమ్ ఆ పెట్టు పెట్టు అని దివ్యని మీదికి లాక్కుంటాడు. కానీ, దివ్య ఆశ పెట్టి వెళ్లిపోతుండగా విక్రమ్ మీదికి లాక్కుని 'ఆశ పెట్టి మోసం చేయకూడదు ఇచ్చెయ్' అని అంటాడు. అంతలో తాతయ్య పిలవడంతో దివ్య పారిపోతుంది.

రాజ్యలక్ష్మి వాళ్లకు లాస్య భరోసా: లక్ష దొంగిలించిన బసవయ్య ఎక్కడ దొరికిపోతానో అని భయపడుతూ ఉంటాడు. అప్పుడు లాస్య 'ప్లాన్ నాది దొరక్కుండా తప్పించే బాధ్యత నాది. మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పడొద్దు. నమ్ముకున్న వాళ్లని నట్టేట్లో ముంచేసే క్యారెక్టర్ కాదు నాది. చివరి వరకూ నిలబడతాను. నాకు కాస్త ఆలోచించే టైం ఇవ్వండి. ఈ దొంగతనం ఇష్యూ నుంచి మిమ్మల్ని బయటపడేస్తాను' అని భరోసా ఇస్తుంది. దీంతో రాజ్యలక్ష్మి 'విక్రమ్, దివ్య కలిసిపోయారు. ఈరోజు ఇద్దరయ్యారు. అలా వదిలేస్తే రేపు ముగ్గురవుతారు. టెన్షన్‌తో బుర్రపగిలిపోతుంది.. త్వరగా ఏదోటి చెయ్' అంటుంది.

లాస్యకు ఝలక్ ఇచ్చేసిన దివ్య: తన ప్లాన్ బెడిసి కొట్టిందని టెన్షన్ పడుతున్న లాస్య దగ్గరకు వచ్చిన దివ్య 'ఏంటి ఆంటీ.. ప్లాన్ రివర్స్ అయ్యేసరికి పిచ్చి పట్టిందా' అని అంటుంది. దీనికామె 'నాకు పిచ్చి ఎక్కడం కాదు.. నీకు పిచ్చెక్కిస్తా చూస్తూ ఉండు. నన్ను తక్కువ అంచనా వేయకు' అని అంటుంది. దీంతో దివ్య 'సర్లే కానీ.. ఆ లక్ష రూపాయలు ఎవరు నొక్కేశారు? ఇలాంటి పనులు నీకు తెలియకుండా జరగవు కదా. నీ అమాయకత్వం నా దగ్గర నటించకు.. విక్రమ్‌కు ఆల్రెడీ తెలిసిపోయింది.. నువ్వే చేయించావని' అని అంటుంది. దీంతో లాస్య మరింతగా టెన్షన్ పడుతూ ఉంటుంది.
దిక్కులేని దానివి నువ్వే జాగ్రత్త: లాస్య సాక్ష్యం అడగ్గానే దివ్య 'సాక్ష్యం లేకుండా జాగ్రత్త పడ్డావా? ఈ ఇంట్లో అందరూ నీలాంటి వాళ్లే ఉన్నారు. నువ్వు కాకుండా వేరే వాళ్లు ఎవరు చేసినా అది నీ నెత్తినే వేస్తారు. ఎందుకంటే ఈ ఇంట్లో బయటదానివి నువ్వే కాబట్టి. అంతా కలిసి నీ నెత్తిన వేస్తారు.
ఎందుకైనా మంచిది ఆ దొంగతనం నీపై పడకుండా చూసుకో. నా కాపురంలో వేలు పెట్టడం మానేసెయ్. అసలే మొగుడు వదిలేసిన ఆడదానివి. ఉద్యోగం పోతే రోడ్డున పడతావు. దిక్కులేకుండా పోతావు. ఆలోచించుకో' అని అంటుంది. దీంతో లాస్య దివ్య చెప్పింది నిజం అవ్వొచ్చేమో అని అనుకుంటుంది.
దొరికిన తాళి.. ఇద్దరూ కలిసి వెళ్లి: నందూ అన్నం తింటూ ఉండగా తులసి వచ్చి ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది. అంతలోనే ఆమెకు ఎస్సై కాల్ చేసి 'మేడం దొంగ దొరికేశాడు. వాడి దగ్గర దొరికిన వస్తువుల్లో ఓ తాళి కూడా ఉంది. అది మీదేనేమో వచ్చి చూసుకోండి' అని అంటాడు.
దీంతో ఆమె సంతోషంగా ఈ విషయాన్ని అందరికీ చెప్తుంది. తర్వాత నందూతో కలిసి స్టేషన్‌కు బయలుదేరుతుంది. కానీ, నందూతో కారులో వద్దు.. స్కూటీ మీద వెళ్దాం అంటుంది. అలా ఇద్దరూ ఏదేదో మాట్లాడుకుంటూ వెళ్తారు. వాళ్లను చూసి 'వీళ్లిద్దరూ మళ్లీ కలిస్తే బాగుండు. వీళ్లను ఎవరు కలుపుతారు' అని అనుకుంటుంది.
దొంగతనం అతడిపై నెట్టేశారు: దొంగతనం తన మీదకు వస్తుందని అనుకున్న లాస్య.. విక్రమ్ వాళ్ల ఇంట్లో పని చేసే వ్యక్తినే దొంగతనం చేసినట్లు ఒప్పుకోమని అంటుంది. ప్లాన్ ప్రకారం అతడిని అందరి ముందుకు తీసుకు వస్తుంది. అప్పుడు విక్రమ్ ప్రశ్నించగా తానే దొంగతనం చేశానని ఒప్పుకుంటాడతను. దీంతో పోలీసులకు అప్పగించాలని దివ్య, విక్రమ్ అనుకుంటారు. కానీ, రాజ్యలక్ష్మి మాత్రం వదిలేయమని అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











