For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi July17 Episode: ప్రాణాలతో చచ్చి బతుకుతూ.. అనసూయ ఆరోగ్యంపై ఆందోళన.. నందుకు తులసి షాక్

  |

  మామిడి పండ్లు ఎక్కువగా తిన్నాననే ఉద్దేశంతో అనసూయ నాలుగు షుగర్ ట్యాబ్లెట్స్ వేసుకోవడంతో అర్ధరాత్రి ఆమె ఆరోగ్యం తిరగదోడింది. నందు, లాస్యను ఎంత పిలిచినా రాత్రి లేవకపోవడంతో ఆమె మెట్లు దిగి అభి ఇంటికి వెళ్లి వారి ఇంట్లో పడిపోయింది. అనసూయ ఆరోగ్యం విషయంలో తులసి, నందు, లాస్య మధ్య కొంత వాగ్వాదం జరిగింది. తాజా ఎపిసోడ్ 374లో ఏం జరిగిందంటే..

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  షుగర్ లెవెల్స్ పడిపోవడంతో

  షుగర్ లెవెల్స్ పడిపోవడంతో

  అత్తయ్య అనసూయ కింద పడిపోవడంతో కోడలు తులసి పెట్టిన అరుపులకు అందరూ దిగివచ్చారు. ఆమె షుగర్ లెవెల్స్ పడిపోవడంతో వెంటనే షుగర్ తెచ్చి నోట్లో వేశారు. ఆ తర్వాత రెస్ట్ తీసుకోవడంతో ఆరోగ్యం కుదుటపడింది. తులసి లేకపోవడంతో నాన్నమ్మను చూసే వాళ్లు ఎవరు లేరు. దాంతోనే ఇదంతా జరిగింది అంటూ అభికి తాతయ్య చెప్పారు.

  తులసి ఉంటే అన్ని చూసుకొనేది..

  తులసి ఉంటే అన్ని చూసుకొనేది..


  అనసూయ నానమ్మ ఉదయం బాగానే ఉంది కదా.. అంతలోనే ఏమైందని అభిని తాతయ్య అడిగితే.. ఆమె తినే ఫుడ్‌లో ఏదైనా తేడా జరగవచ్చు. లేదా ఆమె వేసుకొనే ట్యాబ్లెట్స్‌లో ఏదో జరిగి ఉంటుంది. అందుకే షుగర్ లెవెల్స్ క్షీణించాయి అని అభిచెప్పడంతో ఇంతకు ముందు మీ అమ్మ తులసి ఉంటే ఆమె ఆరోగ్యం గురించి పట్టించుకొనేది. ఇప్పుడు లాస్య ఏది పడితే అది పెట్టేసి.. మీ నాన్నమ్మను పట్టించుకోవడం లేదేమో అని తాతయ్య అన్నారు. దాంతో చెప్పడంతో ఇంటి సభ్యులందరూ కంగారు పడిపోయారు. తన భార్య గురించి తీవ్రంగా ఆందోళనలో పడిపోయారు.

  ఏది పడితే అది తిని ఉంటుందని

  ఏది పడితే అది తిని ఉంటుందని

  అనసూయ ఆరోగ్యం క్షీణించడంతో తాతయ్య ఆందోళనలో పడిపోయాడు. ఇక్కడ ఉన్నప్పడు తులసి ఆమెను జాగ్రత్త తీసుకొనేది. శరీరానికి హాని చేసే పదార్థాలు దూరంగా పెట్టేది. ఎప్పటికప్పుడు టాబ్లెట్ ఇచ్చేది. కొత్త కోడలు అని అక్కడికి వెళ్లిన తర్వాత ఏది పడితే అది తిని ఉంటుంది. అందుకే అనసూయకు ఆరోగ్యం దెబ్బ తిన్నది. మీ నాన్నకు డబ్బు సంపాదించడమే తెలుసు కానీ.. ఇంట్లోపరిస్థితులు ఏమి తెలుసు. ఇంట్లో వారి ఆరోగ్యం గురించి పట్టించుకొన్నారా అంటూ కామెంట్ చేశాడు. దాంతో అందుకే ఇలాంటివి జరుగుతాయి అని అభి చెప్పాడు. దాంతో ఆడవాళ్ల శ్రమ, త్యాగం తెలుసుకోవాలంటే జన్మ కూడా సరిపోదు అంటూ తాతయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

  కంగారు పడిన నందు, లాస్య

  కంగారు పడిన నందు, లాస్య


  ఆ తర్వాత ఇంటిలో అనసూయ లేకపోవడంతో నందు, లాస్య కంగారు పడిపోయారు. ఇంట్లోనే ఉండి ఉంటుంది. సరిగా చూడు అని నందు అంటే లేదు లేచేసరికి తలుపులు తీసి ఉన్నాయి అని లాస్య చెప్పింది. దాంతో ఆ ఇంటికి వెళ్లి ఉంటుంది. నేను అభికి ఫోన్ చేసి కనుక్కొంటాను అని కాల్ చేశాడు. నాన్నమ్మ చావు బతుకుల మధ్య ఇంటికి వచ్చింది. నాన్నమ్మకు బీపీ, షుగర్ ఉందనే విషయం తెలుసు కదా.. అర్ధరాత్రి ఆరోగ్యం క్షీణించడంతో మీకు చెప్పలేక మా వద్దకు వచ్చింది. దాంతో నానమ్మ ఆరోగ్యం క్షీణించిందని చెప్పడంతో నందు, లాస్య ఆ ఇంటికి పరుగులు పెట్టారు.

  ఇంకా బతికే ఉంది.. చావలేదంటూ

  ఇంకా బతికే ఉంది.. చావలేదంటూ


  తల్లి ఆరోగ్యం క్షీణించడంతో ఇంటికి వచ్చిన నందు, లాస్య తండ్రి ఎదురుపడటంతో నాన్న.. అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది అని అడగానే.. ఇంకా చావలేదు. బతికే ఉంది అంటూ ఘాటుగా సమాధానం చెప్పారు. దాంతో నాన్న అలా ఎందుకు అంటారు అని అంటే.. అలా అనక ఎలా అనమంటారు. రాత్రి ఆమె పరిస్థితి చూస్తే మీకే తెలిసేది. తల్లి మీ వద్దకు వస్తానంటే.. ఆపే హక్కు నాకు లేదు. కానీ మీరు మాత్రం ఆవిడను, ఆవిడ ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు అని తులసి ఘాటుగా స్పందించింది. దాంతో ఎవరు కావాలని ఏది చేయలేదు అని నందు సమాధానం ఇచ్చారు.

  నందు, లాస్యను వెనుకేసుకొచ్చిన అనసూయ

  నందు, లాస్యను వెనుకేసుకొచ్చిన అనసూయ

  అయితే షుగర్ పేషంట్‌ను ఎలా చూసుకోవాలో మీకు తెలీదా.. ఏది పడితే అది తినిపిస్తే ప్రాణాలు పోయేవి అంటే.. ఏదో ఒక్కరోజు అలా జరిగింది. అంత దానికి ఇలా అనడం బాగాలేదు అని నందు చెప్పాడు. అయితే అప్పటికే అక్కడికి అనసూయ.. తన కొడుకు నందు, లాస్యను వెనుకేసుకొచ్చింది. అయితే అనసూయ మాటలను ఇంటి సభ్యులందరూ తప్పుపట్టారు. ఏదైనా జరిగి ప్రాణం పోతే పరిస్థితి ఏంటి అంటే.. ప్రాణాలు పోతాయి పోతాయి అని అనకే .. ఇప్పుడే నా ప్రాణాలు పోయేటట్టు ఉన్నాయని తులసి మాటలను అనసూయ తప్పుపట్టింది. ఆలా ఎమోషనల్‌గా తాజా ఎపిసోడ్ సాగిపోయింది.

  Read more about: intinti gruhalakshmi
  English summary
  Intinti Gruhalakshmi Episode 374: Divya, Abhi and Prem Supported Tulasi. Then Shashikala Warned to Nandu In Front of Lasya.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X