Intinti Gruhalakshmi: రాజ్యలక్ష్మికి షాకిచ్చిన పంతులు.. తులసి, నందూ హ్యాపీ.. అత్తకు దివ్య బంపర్ ఆఫర్
ఇండియాలోని చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి.
అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. దివ్యకు ఫోన్ చేసిన రాములమ్మ.. విక్రమ్ నిజం తెలుసుకున్నాడని, మారిపోయాడని అంటుంది. దీంతో ఆమె వెళ్లి భర్తను హగ్ చేసుకుని థ్యాంక్స్ చెబుతుంది. తర్వాత ఇద్దరూ సరసాలు ఆడుకుంటారు.
ఇక, తమ దొంగతనం బయట పడకుండా ఉండడం కోసం ఇంట్లో పని చేసే వ్యక్తిని లాస్య బుక్ చేస్తుంది. దీంతో అతడే దొంగ అని విక్రమ్ ముందర నిరూపిస్తుంది. మరోవైపు, తులసి మంగళసూత్రం దొరికిందని ఎస్సై ఫోన్ చేసి చెప్తాడు. దీంతో నందూతో కలిసి ఆమె బైక్‌పై వెళ్తుంది. ఆ సమయంలో నందూ చాలా ఇబ్బంది పడుతుంటాడు.

వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాడు: పనిమనిషే దొంగ అని లాస్య నిరూపించడంతో విక్రమ్ పోలీసులకు అప్పగిస్తానంటాడు. దీంతో రాజ్యలక్ష్మి 'పదేళ్ల పాటు మన ఇంట్లో విశ్వాసంగా పని చేశాడు. కూతురు చదువు కోసం అంటున్నాడు కదా వదిలెయ్ విక్రమ్' అని అంటుంది. దీంతో విక్రమ్ చూశావారా మా అమ్మ మంచితనం అని అంటాడు.
అప్పుడు లాస్య 'ఇలాంటి వాళ్లను ఇంట్లో పెట్టుకోకూడదు. పనిలో నుంచి తీసెయ్ విక్రమ్' అంటుంది. దీనికతడు 'మా అమ్మ చెప్పింది కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి పని చేస్తే చంపేస్తా' అని వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాడు.

ఎంట్రీ ఇచ్చిన పంతులు: ఆ గొడవ అలా జరుగుతూ ఉండగానే పంతులు వస్తాడు. అప్పుడు రాజ్యలక్ష్మి 'మీరు వచ్చారేంటి పంతులు గారూ.. దారిన పోతూ మజ్జిగ తాగి వెళ్దాం అనా' అని అడుగుతుంది. దీనికి దివ్య 'పంతులు గారు మజ్జిగ కోసం కక్కుర్తి పడే రకం కాదు. మన గురించి ఆలోచించే మంచి మనిషి. మన ఇంట్లో పూజలన్నీ అత్తయ్య గారు చెప్పినట్టుగా ఆయనే జరిపించారు కదా' అంటుంది. దీనికి రాజ్యలక్ష్మి 'నేను చెప్పినట్టు ఏంటీ.. ఆయన చెప్పినట్టే పూజలు చేయించాం' అంటుంది. దీంతో దివ్య 'అదే అత్తయ్య గారూ తడబడ్డాను.. మీరు విషయం చెప్పండి' అంటుంది.
కాశీ వెళ్లి మరీ చర్చించా: దివ్య అడగ్గానే పంతులు 'విక్రమ్, దివ్య మొదటి రాత్రి ముహూర్తం కోసం వచ్చాను' అని అంటాడు. దీంతో రాజ్యలక్ష్మి.. 'అదేంటి పంతులు గారూ.. ఆర్నెళ్ల వరకూ మూహూర్తం లేదని చెప్పారు కదా' అని అడగ్గా.. 'అవునమ్మా.. అప్పట్లో చెప్పాను కానీ ఈ ఇంట్లో ఏ సమస్య వచ్చినా నా సమస్యే అనుకున్నాను. అందుకే కాశీ వెళ్లి మా గురువు గారితో ఈ సమస్య గురించి చర్చించాను. మా గురువు గారు.. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపుతారు. ఆయనతో ప్రత్యేకంగా ముహూర్తం పెట్టించాను. అది చెప్పడానికే మీ దగ్గరకు హడావిడిగా వచ్చేశాను' అని అంటాడు.

ఏం చేయాలో నేనే చెప్తా: పంతులుతో రాజ్యలక్ష్మి ముహూర్తం ఎప్పుడని అడగ్గా.. 'ఎప్పుడో అయితే నేనెందుకు ఇంత కంగారుగా వస్తానమ్మా? ఈరోజు రాత్రి 9.20కే ముహూర్తం' అంటాడు. అప్పుడు లాస్య ఏదో మాట్లాడబోతుండగా.. విక్రమ్ వాళ్ల తాతయ్య 'ఇంక మాట్లాడేది ఏం లేదు.. మీరు వెళ్లి గది రెడీ చేయండి' అని అందరికీ పనులు చెప్తాడు. తర్వాత విక్రమ్ సిగ్గపడడం చూసి 'ఏంట్రా సిగ్గుపడుతున్నావు? పెళ్లైన ఇన్నాళ్లకు ఫస్ట్ నైట్ అవుతున్నందుకు నిజంగానే సిగ్గుపడాలిరా' అని అంటాడు. తర్వాత దివ్య 'నువ్వేం పని చేయాలో నేను చెప్తానుగా' అని అంటుంది.

రాజీ పడలేనన్న తులసి: అనవసరంగా నందూ విషయంలో జోక్యం చేసుకుంటున్నానా అని తులసి అనుకుంటుంది. అంతలోనే అక్కడకు కస్టమర్లు వచ్చి వీళ్ల హెల్దీ ఫుడ్ రుచి చూసి మంచి రివ్యూ ఇస్తారు. తర్వాత అందరికీ మీ కెఫే గురించి చెప్తామని అంటారు. దీంతో నందూ, తులసి బాగా సంతోషిస్తారు. ఇక, కెఫే క్లోజ్ చేసే సమయంలో డబ్బులు సరిగా రావట్లేదని నందూ చెప్పగా.. అక్కడ పని చేసే వ్యక్తి వచ్చి క్వాలిటీ తగ్గిద్దాం అని అంటాడు. దీంతో తులసి 'ఆ విషయంలో అస్సలు రాజీ పడేదే లేదు. అలా చేస్తానంటే నేను కెఫేలో అడుగు కూడా పెట్టను' అని తేల్చి చెప్పేస్తుంది.
వాళ్లిద్దరికీ దివ్య చాలెంజ్: దొంగను పట్టుకునే పనిలో ఉండగా.. దివ్య శోభనానికి ముహూర్తం పెట్టించేసిందని లాస్య, రాజ్యలక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోనే అక్కడకు దివ్య వచ్చి 'తోడు దొంగలు ఏం చేస్తున్నారు' అంటుంది. దీంతో వాళ్లకు కోపం వస్తుంది.
అలా వీళ్లు పోటాపోటీగా మాట్లాడుకున్న తర్వాత శోభనం జరగకుండా చేస్తామని అంటారు. దీంతో దివ్య 'ఈసారి శోభనం ఆపడం మీ వల్ల కాదు. రేపటి నుంచి విక్రమ్ నా దగ్గరే పడుకుంటాడు. మేము బోలెడన్ని కబుర్లు చెప్పుకుంటాం. తర్వాత మీరు ఉన్నారనే అతడు మర్చిపోయేలా చేస్తాను' అంటూ చాలెంజ్ చేస్తుంది.
అత్తకు ఆఫరిచ్చిన దివ్య: ఆ తర్వాత దివ్య 'నేను కల కనడం లేదు. టైం నాది. ఇప్పుడు మీకు ఆఫర్ ఇస్తున్నా. నేను కాదు మీరు సరెండర్ అవ్వండి. మీకు గౌరవం మీకు దక్కేలా చేస్తాను. ప్రశాంతంగా ఉండేలా చేస్తాను. సంజయ్‌కు కూడా ఆస్తిలో వాటా ఇప్పిస్తాను. ఈ ఇంటి సింహాసనంపై మిమ్మల్నే కూర్చోబెడతా కాదు కూడదు అంటే మీ కర్మ' అని అంటుంది. దీంతో లాస్య.. 'దివ్యా నువ్వు రాసిపెట్టుకో.. నీ ఫస్ట్ నైట్ జరగదు. నీకు కన్నీళ్లే మిగులుతాయి' అని అంటుంది. దీంతో దివ్య 'అవును కన్నీళ్లే మిగులుతాయి నాకు కాదు మీకు' అని వెళ్లిపోతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











