Intinti Gruhalakshmi Today Episode: తులసి ఇంట్లో హనీ గోల్డ్ చైన్.. ఆమెకు డెడ్‌లైన్ పెట్టిన సామ్రాట్
టెలివిజన్ హిస్టరీలోనే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా చూసేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నిద్ర పోతోన్న హనీతో సామ్రాట్ నిన్ను కిడ్నాప్ చేసిన ఆ తులసిని వదిలి పెట్టను అని అంటాడు. ఆ తర్వాత హనీ వెళ్లి జరిగిన విషయాన్ని సామ్రాట్ బాబాయ్‌కు చెప్పేస్తుంది. దీంతో అతడు ఎస్సైకు ఫోన్ చేసి తులసిని వదిలేయమని చెప్తాడు. అనంతరం లాస్య, నందూ.. సామ్రాట్ కంపెనీకి వెళ్తారు. అప్పుడు ఎస్సై ఆయనకు ఫోన్ చేసి తులసిని వదిలేసిన విషయం చెప్తాడు. దీంతో నందూ, లాస్యకు నిజం తెలుస్తుంది. అనంతరం తులసి నేరుగా లాస్య ఇంటికి వెళ్తుంది. అక్కడ నందూపై ఆమె కోపంతో విరుచుకుపడుతుంది.

తులసిపై మేనేజ్‌మెంట్ కోపం
హనీ గొడవలో పడి తన సంగీతం క్లాస్‌ల గురించి మర్చిపోయిన తులసి.. దాని మీదనే దృష్టి సారించాలని అనుకుంటుంది. అప్పుడు ఇంట్లో వాళ్లతో 'నా సంగీతం క్లాస్‌లకు రూమ్ రెంట్‌కు ఇస్తారేమో అని కనుక్కోవడం కోసం నిన్న వెళ్లడం కుదరలేదు కదా. ఇవాళ వెళ్తా' అని అంటుంది. అప్పుడు టీచర్‌కు ఫోన్ చేస్తుంది. దీంతో ఆ టీచర్ 'మీరు నిన్ననే వస్తా అన్నారు కదా. ఎందుకు రాలేదు. ఒకవేళ మీకు కుదరకపోతే ఆ విషయాన్ని మీరు మాకు ఫోన్ చేసి అయినా చెప్పొచ్చు కదా. మీ ఆటిట్యూడ్ మా మేనేజ్‌మెంట్‌కు నచ్చలేదు' అంటూ కోప్పడుతుంది.

తులసి ఇంట్లో హనీ గోల్ట్ చైన్
ప్రిన్సిపల్‌తో ఫోన్ మాట్లాడుతున్న సమయంలోనే హనీ.. తులసి ఇంటికి వస్తుంది. అప్పుడు అనసూయ ఆ చిన్నారిని సూటిపోటి మాటలు అంటుంది. అప్పుడు తులసి అసలు ఎందుకు వచ్చావని అడుగుతుంది. దీనికి హనీ 'నా వల్ల తప్పు జరిగింది ఆంటి. మా నాన్న మిమ్మల్ని చాలా మాటలు అన్నాడు. పోలీస్ స్టేషన్‌లో పెట్టాడు. సారీ చెబుదామని వచ్చాను' అంటుంది. అప్పుడు తులసి ఇంట్లో చెప్పి వచ్చావా అని అడుగుతుంది. దీనికి మా తాతయ్య మీ అడ్రస్ ఇచ్చారు అంటుంది. అప్పుడు తులసి 'నువ్వు ఎప్పుడైనా రావచ్చు కానీ.. నువ్వు ఒక్కదానివి రాకు. మీ పెద్దవాళ్లతో రా. అర్థం అయిందా' అని అంటుంది. ఆ తర్వాత తులసి ఇంట్లో గులాబీ పువ్వు కోస్తుండగా హనీ బంగారు గొలుసు కింద పడిపోతుంది.

చైన్ గురించి సామ్రాట్ కోపం
సామ్రాట్.. తన బాబాయికి ఫోన్ చేసి తులసి మీద నీకు అంత సాఫ్ట్ కార్నర్ ఎందుకు అని అడుగుతాడు. దీంతో 'తులసి చాలా మంచిది. సరే.. నేను ముంబై నుంచి వచ్చాక అన్ని విషయాలు చెబుతాను' అని సామ్రాట్ మాటలు వినకుండా ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత హనీ ఇంటికి తిరిగి వస్తుంది. ఆమెను చూసి సామ్రాట్ సంతోషిస్తాడు. కానీ.. తన మెడలో మాత్రం గోల్డ్ చైన్ ఉండదు. దీంతో అతడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏమైందని అంతటా వెతుకుతాడు. కానీ, దొరకదు. దీంతో కారు డ్రైవర్‌ను పిలిచి సామ్రాట్ ప్రశ్నిస్తాడు. అప్పుడు అతడు స్కూల్‌కు వెళ్లేటప్పుడు బుక్స్ కోసం మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్లావు కదా అని హనీతో అంటాడు. ఆ ఫ్రెండ్ తులసే అని తెలుసుకుని సామ్రాట్ కోపంతో రగిలిపోతాడు.

తులసి ఇంటికి వచ్చి గొడవ
తులసే బంగారు గొలుసును దొంగతనం చేసిందని భావించిన సామ్రాట్.. వెంటనే హనీని తీసుకొని తన పనివాళ్లతో కలిసి తులసి ఇంటికి వస్తాడు. వచ్చీ రావడమే 'జైలులో చిప్పకూడు తిన్నావు. అయినా బుద్ధి రాలేదా. నువ్వు దొంగతనం చేసిన మా పాప గోల్డ్ చైన్ స్పాట్‌లో తిరిగి ఇవ్వాలి' అని అంటాడు. దీంతో తులసి 'గోల్డ్ చైన్ ఏంటి.. నేను తిరిగి ఇవ్వడం ఏంటి' అని అంటుంది. అప్పుడు సామ్రాట్ 'ఈ యాక్టింగ్ చూసే మా బాబాయి నిన్ను అమాయకురాలు అని చెప్పి నిన్ను వదిలేశాడు. మార్నింగ్ హనీ మీ ఇంటికి వచ్చింది. తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఆ గోల్డ్ చైన్ లేదు. అంటే అర్థం ఏంటి' అంటూ ఆమెపై నిందలు వేస్తాడు.

సామ్రాట్‌తో తులసి వాగ్వాదం
ఆ తర్వాత సామ్రాట్ 'చైన్‌ను తులసే దొంగతనం చేసింది. పాపనే కిడ్నాప్ చేసిన వ్యక్తికి చైన్ కొట్టేయడం ఒక లెక్కా' అని అంటాడు. దీంతో ఆమె 'మీరు వంద సార్లు అడిగినా ఆ చైన్ గురించి నాకు తెలియదు' అంటుంది. అప్పుడు సామ్రాట్ పని వాళ్లను పిలిచి ఇల్లంతా వెతకండి అంటాడు. అప్పుడు తులసి 'ఏంటి సామ్రాట్ గారు ఇది. మీ ఆలోచన ధోరణి మారదా? అవే ఆలోచనలు.. అవే నిందలు.. మారరా' అని ప్రశ్నిస్తుంది. దీనికి సామ్రాట్ 'మారాల్సింది మీరు.. మేము కాదు. గడ్డి తినే మనుషులు' అంటాడు. దీంతో అంకిత 'దానికి డబ్బులు ఎంతవుతాయో చెప్పు మీ మొహాన కొడతాం' అంటుంది. దీంతో షటప్.. అది మామూలు గొలుసు కాదు. నా చెల్లెలు జ్ఞాపకం అంటాడు.

తులసికి సామ్రాట్ వార్నింగ్
తన పని వాళ్లతో చైన్ కోసం సామ్రాట్.. తులసి ఇంటిని మొత్తాన్ని వెతికిస్తాడు. కానీ, అది ఎక్కడా కనిపించదు. దీంతో వాళ్లంతా వచ్చి ఈ విషయాన్ని చెబుతారు. అప్పుడు తులసి 'మా సామాన్లు అన్నీ తిరిగి సర్ది వెళ్లమని చెప్పండి' అంటూ సామ్రాట్‌ను హెచ్చరిస్తుంది. దీంతో అతడు 'నువ్వు చాలా తెలివైన దొంగవు. ఇంకో గంటలో మా గోల్డ్ చైన్ మాకు తెచ్చివ్వు. లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు' అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. మరోవైపు సామ్రాట్ అంటే నందూ భయపడుతుంటాడు. దీంతో నువ్వు ఎందుకు భయపడుతున్నావు అంటూ లాస్య ధైర్యం చెప్తుంది.

తులసి ఇంట్లోనే హనీ చైన్
తులసి ఇంట్లోని గార్డెన్‌లో దివ్యకు చైన్ దొరుకుతుంది. ఆ చైన్ ఇదేనేమో అని అనుకొని వెంటనే దాన్ని తులసికి ఇస్తుంది. ఇదే హనీ చైన్ అయి ఉంటుంది. పాప చూసుకోలేదు ఏమో అని అంటుంది తులసి. వెంటనే వెళ్లి ఆ చైన్‌ను ఇచ్చేద్దామని అనుకుంటుంది. దీంతో దివ్య 'ఒక్క నిమిషం మామ్. ఇప్పుడు నువ్వు వెళ్లి ఆ చైన్ ఇస్తే.. ఆ సామ్రాట్ అనుకున్నదే నిజం అనుకుంటాడు' అంటుంది. అంకిత కూడా 'అనుమానంతో నిండిన మనుషులకు అనుమానించడం తప్ప ఏమీ రాదని మీరేగా చెప్పారు. ఇప్పుడు సామ్రాట్ కూడా అలాగే ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి ఆంటీ' అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











