For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi July 19th Episode: లాస్య నందూ మధ్య యుద్ధం.. రామచంద్ర చెప్పిన మాటతో తులసి షాక్

  |

  మిగిలిన భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే


  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. లాస్య ఇచ్చిన మామిడికాయలు తిని టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల అనసూయ షుగర్ లెవెల్స్ పడిపోతాయి. ఆ తర్వాత చావు బతుకుల మధ్య తులసి ఇంటికి వస్తే ఆమెను కాపాడతారు. అయినా తులసి ఎన్నో మాటలు అంటుంది. ఇక, నందూ ఆఫీస్‌లో జీతాలు ఇవ్వట్లేదని ఉద్యోగులు మాట్లాడతారు. ఆ తర్వాత లాస్య అవి వాడుకున్నట్లు తెలుస్తుంది.

  శృతికి చెక్ పెట్టేందుకు అంకిత ప్లాన్స్

  శృతికి చెక్ పెట్టేందుకు అంకిత ప్లాన్స్


  పుట్టింటి నుంచి అత్తింటికి వచ్చిన అంకిత.. శృతిని ఎలాగైనా దెబ్బకొట్టాలని ప్లాన్ చేస్తుంది. అందుకు అనుగుణంగానే తులసితో ‘ఆంటీ అబార్షన్ అయిన తర్వాత మీరు నాతో సరిగా ఉండడం లేదు. అందుకే నాకేమీ పని చెప్పడం లేదు. ఎప్పుడూ శృతికే ప్రాధాన్యత ఇస్తారు' అని అంటుంది. దీనికి తులసి ‘అదేం లేదమ్మా. నువ్వు పెద్ద కోడలివి. నీ ప్రాధాన్యం నీకుంటుంది' అని బదులిస్తుంది.

  లాస్యపై ఓ రేంజ్‌లో కోప్పడిన నందూ

  లాస్యపై ఓ రేంజ్‌లో కోప్పడిన నందూ


  ఆఫీస్‌లో డబ్బులు మొత్తం లాస్య వాడుకుందని తెలుసుకున్న నందూ.. కోపంగా ఇంటికి వస్తాడు. అప్పుడే లాస్య.. అనసూయకు నగలు కొని తెస్తుంది. ఆ సమయంలో ‘ఆఫీస్‌లో డబ్బులన్నీ ఎందుకు వాడుకున్నావ్ లాస్య' అని గట్టిగా ప్రశ్నిస్తాడు. దీనికి లాస్య ఏడుస్తూ పెద్ద సీన్ క్రియేట్ చేస్తుంది. ‘పెళ్లి కాకముందే పరిమితులు పెడుతున్నావా' అంటూ అతడిపై ఫైర్ అవుతుంది.

  తులసికి రామచంద్ర కీలక బాధ్యతలు

  తులసికి రామచంద్ర కీలక బాధ్యతలు


  రామచంద్ర ఫోన్ చేయడంతో తులసి ఆయన దగ్గరకు వస్తుంది. అప్పుడాయన ఎందుకు పిలిచానో తెలుసా అని అంటాడు. అప్పుడామె ‘మీ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇస్తానికి పిలిచుంటారు. కానీ దానికి నేను ఒప్పుకోను. ఎందుకంటే నా కింద కొంత మంది పని చేస్తున్నారు. వాళ్లను రోడ్డున పడేయలేను' అంటుంది. అప్పుడు రామచంద్ర ‘ఉద్యోగం కాదమ్మ.. ఓనర్‌ను చేయడానికి పిలిచా' అంటాడు.

  శృతిని అవమానించిన అంకిత పనులు

  శృతిని అవమానించిన అంకిత పనులు


  శృతిని ఇబ్బంది పెట్టాలని భావిస్తోన్న అంకిత.. టబ్ నిండా బట్టలు తీసుకుని వస్తుంది. అప్పుడు ‘నేను ఏం చెప్పినా చేస్తానన్నావు కదా. వాషింగ్ మెషీన్ పాడైంది. ఈ బట్టలు ఉతకండం నాకు రాదు. కొంచెం ఉతుకుతావా? ఏంటి ఆలోచిస్తున్నావ్? నువ్వేమీ నాలాగ కోటీశ్వరుల బిడ్డవు కాదుగా' అంటుంది. దీంతో అవి ఉతకడానికి రెడీ అవగా తాత వచ్చి ఆ పని చేయొద్దు అంటాడు.

  తులసిపై నందూ, లాస్య మాటల దాడి

  తులసిపై నందూ, లాస్య మాటల దాడి


  రామచంద్ర ఇచ్చిన ఆఫర్‌ గురించి ఇంటికి వచ్చి ఆలోచిస్తుండగా.. లాస్య, నందూ అక్కడకు వస్తారు. వచ్చి రావడమే లాస్య ‘ఏం తులసి.. ఆ ఫ్యాక్టరీకి ఓనర్ అవుదామని అనుకుంటున్నావా? అసలు నీకు ఏ అర్హత ఉంది? నువ్వేమైన డిగ్రీలు చదువుకున్నావా? అసలు నీకేం తెలుసు' అని అంటుంది. అప్పుడు తులసి కూడా ఆమెకు ధీటుగా బదులిస్తూ ఆవేశంగా మాట్లాడుతుంది.

  నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని

  నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని


  ఆ తర్వాత నందూ మాట్లాడుతూ.. ‘ఇది పది రూపాయలు పెట్టుబడి పెట్టేది కాదు. చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇంట్లో వాళ్లందరినీ రిస్క్‌లో పెట్టొద్దు. నీ మంచి కోరే చెబుతున్నా. ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి డబ్బులు అడిగినా.. ఒక్క రూపాయి కూడా ఇవ్వను' అని చెబుతాడు. దీంతో తులసి ఆగ్రహంతో మీరు ఆపండి అంటూ గట్టిగా అరుస్తుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 376: Nandu Fired on Lasya for Misusing Office Money. Then Ramachandra Gave a Offer to Tulasi. After That Nandu and Lasya Discouraged Tulasi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X