Intinti Gruhalakshmi: తులసి వైపు తిరిగిన డ్రైవర్.. దివ్య, విక్రమ్ ఫస్ట్ నైట్.. ఆఖర్లో లాస్య ట్విస్ట్

ఇండియన్ టెలివిజన్ రంగంలో తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. దివ్య తన ఫస్ట్ నైట్‌ గురించి తులసికి ఫోన్ చేసి చెప్తుంది. అంతేకాదు, శోభనానికి ముందు వచ్చి రెడీ చేయాలని చెబుతుంది. దీంతో నందూ కూడా సంతోషిస్తాడు. లాస్య ఫస్ట్ నైట్ కోసం బెడ్ రెడీ చేస్తుంటే రాజ్యలక్ష్మికి కోపం వస్తుంది. అప్పుడు లాస్య.. నందూ, తులసికి యాక్సిడెంట్ చేయించబోతున్నానని, అనుమానం రాకుండా ఫస్ట్ నైట్ ప్లాన్ చేసినట్లు చెప్తుంది. తర్వాత తులసి వాళ్లకు యాక్సిడెంట్ చేయమని ఓ వ్యాన్ డ్రైవర్‌కు ఫోన్ చేస్తుంది. ఇక, దివ్య తన తల్లి వచ్చి రెడీ చేసే వరకూ ఫస్ట్ నైట్ చేసుకోనని తేల్చి చెప్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode July 19th 2023

జరిగింది చెప్పి షాకిచ్చిన డ్రైవర్:తులసి, నందూతో కలిసి వచ్చిన డ్రైవర్‌ను పక్కకు పిలిచిన లాస్య 'రేయ్ నిన్ను చేయమన్నది ఏంటి? నువ్వు చేసింది ఏంటి? నీ తలకి ఆ కట్టు ఏంటి? అసలు ఏం జరిగింది' అని ప్రశ్నిస్తుంది. దీంతో ఆ డ్రైవర్ జరిగింది మొత్తం వాళ్లకు వివరిస్తాడు. అందులో తులసి, నందులు నడిచి వెళ్తుండగా.. వాళ్లను వ్యాన్‌తో ఢీకొట్టేందుకు వేగంగా వెళ్తుంటాడు. అప్పుడు వ్యాన్ ఓ రాయిపై ఎక్కి అదుపు తప్పుతుంది. అంతేకాదు, పక్కనే ఉన్న స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోతుంది. అప్పుడు అతడి తలకు బలమైన గాయం కావడంతో.. తులసి, నందూలు వచ్చి అతడిని రక్షిస్తారు.

ప్లాన్ మొత్తం నాశనం చేశావంటూ:నందూ, తులసి సహాయం చేయడంతో ఆ డ్రైవర్ మనసు మారిపోతుంది. దీంతో ఆ వెంటనే 'మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి. మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తాను. ఇలా అయినా నా రుణం తీర్చుకోనీయండి. ఎక్కండి మేడమ్ ఎక్కండి' అని బ్రతిమాలుతాడు. వాళ్లు చెప్పిన దాని ప్రకారం నేరుగా దివ్య ఇంటికి తీసుకుని వస్తాడు. ఇలా జరిగింది మొత్తం తెలుసుకున్న లాస్య 'ఛీఛీ.. నీకు యాక్సిడెంట్ కూడా చేయడం రాదా? మరెందుకు డీల్ ఒప్పుకున్నావు? మా ప్లాన్ మొత్తం నాశనం చేశావు కదా' అని తిడుతుంది. దీంతో ఆ డ్రైవర్ 'అంతమంచి మనుషుల్ని యాక్సిడెంట్ చేయించడానికి మీకు మనసు ఎలా వచ్చింది మేడమ్' అని అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode July 19th 2023

మాట జారాను.. క్షమించు అమ్మా:రాజ్యలక్ష్మి ఇంటికి వచ్చిన తులసి తన కూతురు దివ్య పట్టుకుని ఏడుస్తుంది. అంతేకాదు, 'నిన్ను ఇబ్బంది పెట్టాను. కావాలని కాదు' అంటూ తన మనసులోని బాధను మొత్తం వివరిస్తుంది. దీనికి దివ్య 'నాకు తెలుసమ్మా.. నా మనసులోని బాధను కంట్రోల్ చేసుకోలేక మాట జారాను. క్షమించమ్మా' అని అంటుంది. తర్వాత దివ్య 'నిన్ను సంతోషపెట్టాలనే నా ఫస్ట్ నైట్ నేనే ప్లాన్ చేసి అత్తయ్య గారిని సాధించాను. నువ్వు నా పక్కన ఉంటే బాగుండనిపించింది. ఇన్నేం ఇబ్బంది పెట్టలేదు కదా' అని అడగ్గా.. ఇబ్బంది ఏమీ లేదమ్మా అని చెబుతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode July 19th 2023

మా అమ్మ కాబట్టే నాకు ఇష్టంగా:కూతురి మాటలకు తులసి 'లేదమ్మా చాలా సంతోషంగా ఉంది. నా దివ్య తలుచుకుంటే.. ఒక్క ఫస్ట్ నైట్ ఏంటీ ఏదైనా సాధిస్తుంది. ఆ ధైర్యం కూడా ఉంది. ఆలస్యం అయితే మా అల్లుడు గారికి కోపం వస్తుంది. పద పదా రెడీ చేస్తాను' అని అంటుంది. దీంతో దివ్య 'అమ్మా నన్ను గంగిరెద్దులా తయారు చేయకు. సింపుల్‌గా ఉండాలి మా అమ్మలాగ' అని అంటుంది. దీనికి తులసి అబ్బా ప్రతిదానికి ఎందుకు మీ అమ్మతో పోల్చుకుంటావ్ అని అడగ్గా 'మా అమ్మ కాబట్టి.. నాకు ఇష్టం కాబట్టి' అంటూ బదులిస్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode July 19th 2023

విక్రమ్ సరసాలు.. తల్లికి కోపంగా:విక్రమ్, దివ్యను ఫస్ట్ నైట్ కోసం రెడీ చేసి తీసుకు వస్తారు. అందరూ కలిసి హాల్‌లో కూర్చునే వాళ్లతో కొన్ని ఆటలను ఆడిస్తారు. ముందుగా వీళ్లిద్దరితో పూలతో చేసిన బంతితో ఆట ఆడిస్తారు. అప్పుడు రాజ్యలక్ష్మి వాళ్లను చూసి రగిలిపోతూ 'వీడెంత అమ్మ కూచీ అయినా అక్కడికి వచ్చేసరికి మగాడు మగాడే. పక్కన నేనున్నానని తెలిసి కూడా చూడనట్టు తెగ సరసాలు ఆడేస్తున్నాడు. నా జాగ్రత్తలో నేను ఉండాలి' అని అనుకుంటుంది. ఇక, లాస్య అయితే విక్రమ్, దివ్య ఇద్దరూ సిగ్గు పడుతున్నట్లుగానే తులసి సిగ్గుపడటం చూసి తలబాదుకుంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode July 19th 2023

ఒకరిపై ఒకరు సెటైర్లు వేస్తూనే:దివ్య బంతాటలో గెలవడంతో లాస్య ఆమెపై సెటైర్లు వేస్తుంది. దానికి విక్రమ్ వాళ్ల తాతయ్య సెటైర్లు వేస్తాడు. ఆ తర్వాత వాళ్లతో స్వీట్ ఆటను ఆడిస్తారు. ముందుగా దివ్య నోటిలో ఉన్న స్వీటును విక్రమ్ తన నోటితో అందుకుంటాడు. ఆ తర్వాత దివ్య అలా చేస్తుంది. దీంతో ఈ ఆటలో ఇద్దరూ గెలుస్తారు. అప్పుడు ఆటల్లో ఇద్దరూ సమానమే అని తులసి అంటుంది. తర్వాత వాళ్లను శోభనం గదిలోకి పంపించే ఏర్పాట్లు చేస్తారు. ఆ హడావిడి చూసిన విక్రమ్ 'నేను గదిలోకి వెళ్తున్నట్లు లేదు.. స్వీట్ల షాపులోకి అడుగు పెడుతున్నట్లుగా ఉంది' అని అంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode July 19th 2023

శోభనం ఆపండి అంటూ లాస్య:అన్నీ మాట్లాడుకున్న తర్వాత తులసి అమ్మాయిని, అబ్బాయిని గదిలోకి పంపుదామా అని అంటుంది. అందరూ రెడీ అవుతూ ఉండగా లాస్య మాత్రం 'ఆగండి' అని అంటుంది. దీనికి విక్రమ్ తాత 'ఈ డైలాగ్ పెళ్లిళ్లలో అనుకున్నా.. ఫస్ట్ నైట్‌కి కూడా వాడతారా' అని అంటాడు. అప్పుడు నందూ 'మా కర్మ.. ఏం చేస్తాం ఇక్కడ కూడా మొదలెట్టారు. కానీ.. ఇంతకీ లాస్య ఎందుకు ఆగమంది' అంటాడు. దీంతో తులసి 'ఏవండీ మీరు ఆగండీ.. నేను ఉన్నా కదా' అంటూ.. ఏంటి లాస్యా.. నీ ప్రాబ్లమ్ అని తులసి అడగుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X