Intinti Gruhalakshmi Today Episode: ప్రేమ్‌కు అడ్డంగా దొరికిన శృతి.. తులసి వల్ల ప్రాణాపాయంలో హనీ
దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా చూసేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసికి క్షమాపణ చెప్పేందుకు హనీ వాళ్ల ఇంటికి వస్తుంది. ఆ సమయంలో ఒంటరిగా ఎప్పుడూ రావొద్దని ఆ చిన్నారికి తులసి సలహాలు ఇస్తుంది. ఇక, హనీ వెళ్లిపోయే సమయంలో తన గోల్డ్ చైన్‌ను తులసి ఇంట్లోని గార్డెన్‌లో పడేసుకుంటుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్లగానే ఆ చైన్ కనిపించకపోవడంతో సామ్రాట్‌కు కోపం వస్తుంది. ఆ వెంటనే తులసి ఇంటికి వచ్చి నానా రభస చేస్తాడు. తన పని వాళ్లతో ఆ ఇల్లంతా వెతికిస్తాడు. కానీ, చైన్ మాత్రం దొరకదు. దీంతో ఆ చైన్ తీసుకొచ్చి ఇవ్వాలని తులసికి సామ్రాట్ వార్నింగ్ ఇస్తాడు.

తులసికి సలహా ఇచ్చిన కుటుంబం
దివ్యకు గార్డెన్ ఏరియాలో హనీ చైన్ దొరుకుతుంది. దీన్ని తీసుకెళ్లి తులసికి ఇస్తుంది. దీంతో ఆమె ఆ చైన్‌ను సామ్రాట్‌కు ఇవ్వాలని అనుకుంటుంది. అప్పుడు దివ్య 'ఒక్క నిమిషం మామ్. ఇప్పుడు నువ్వు వెళ్లి ఆ చైన్ ఇస్తే.. ఆ సామ్రాట్ అనుకున్నదే నిజం అనుకుంటాడు' అంటుంది. అంకిత కూడా 'అనుమానంతో నిండిన మనుషులకు అనుమానించడం తప్ప ఏమీ రాదని మీరేగా చెప్పారు. ఇప్పుడు సామ్రాట్ కూడా అలాగే ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి ఆంటీ' అంటుంది. అయినప్పటికీ తులసి మాత్రం అస్సలు వినకుండా వెళ్లాలని అనుకుంటుంది.

సామ్రాట్‌కు చైన్ ఇచ్చేసిన తులసి
ఆ తర్వాత చైన్ పట్టుకుని తులసి.. సామ్రాట్ ఇంటికి వస్తుంది. సామ్రాట్ ఆమెను చూసి షాక్ అవుతాడు. బయట వాచ్‌మన్‌తో ఆమెను లోపలికి పంపించు అంటాడు. దీంతో ఆమె ఇంటి లోపలికి వస్తుంది. అప్పుడు సామ్రాట్ నాకు కావాల్సింది నువ్వు రావడం కాదు. హనీ గొలుసు తెచ్చివ్వడం అంటాడు. దీంతో తన బ్యాగ్‌లో నుంచి గొలుసు తీసి సామ్రాట్‌కు ఇస్తుంది. అప్పుడు అతడు అది భయం అంటే అలా ఉండాలి అంటాడు. దీనికి తులసి 'నేను భయపడి నీకు గొలుసు ఇవ్వడానికి రాలేదు. నాకు దొరికింది కాబట్టి తెచ్చి ఇచ్చాను అంతే' అంటూ సమాధానం చెబుతుంది.

రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటానంటూ
తులసి చెప్పిన సమాధానాన్ని నమ్మని సామ్రాట్ 'నీకు చైన్ ఎక్కడ దొరికింది.. గార్డెన్‌లో దొరికింది అంటావా' అంటూ వెటకారంగా మాట్లాడతాడు. దీంతో తులసికి కోపం వచ్చి 'అదే నిజం. నువ్వు మనుషులను బొత్తిగా నమ్మవు కావచ్చు. నాకు నిజంగా దొంగ బుద్ధే ఉంటే ఆ గొలుసు తెచ్చి ఇచ్చేదాన్నే కాదు. ఇప్పటికైనా మారండి. మనిషిలా ఉండండి' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో సామ్రాట్ 'తెలివిగా మాట్లాడి తప్పించుకుందామని అనుకుంటున్నావేమో.. ఈసారి రెడ్ హ్యాండెడ్‌గా నిన్ను పట్టుకుంటా' అంటూ తులసికి సమాధానం చెబుతాడు.

తులసి డ్రాయింగ్ వేసిన చిన్నారి
తులసితో గొడవ జరిగిన తర్వాత సామ్రాట్.. తన కూతురు హనీ ఉన్న రూమ్‌కు వెళ్తాడు. అప్పుడామె తులసి ముఖాన్ని తన దగ్గర ఉన్న బుక్ మీద డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి సామ్రాట్ వస్తాడు. దీంతో తన డ్రాయింగ్ ఆపేసి బుక్‌ను పక్కన పెట్టేస్తుంది. అది గమనించిన సామ్రాట్ 'నిన్ను పంజరంలో చిలకలా పెంచడానికి ఒక కారణం ఉంది' అంటూ ఏదో చెప్పబోతాడు. అంతలో అతడికి ఫోన్ కాల్ వస్తుంది. దీంతో ఆ ఫోన్ మాట్లాడుతూ అతడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో హనీ ఏం జరుగుతుందో అని అలానే చూస్తూ ఉండిపోతుంది.

తులసికి సహాయం చేసిన సంజన
సంజన పిల్లలకు సంగీతం నేర్పించేందుకు తులసి వాళ్ల ఇంటికి వెళ్తుంది. కానీ, పిల్లలు మాత్రం అక్కడ కనిపించరు. అప్పుడు సంజన 'పిల్లలు ఎక్స్‌కర్సన్ వెళ్లారు. అయినా ఈ మధ్య రావడం లేదేంటి' అని అడుగుతుంది. దీనికామె కొంచెం పని ఉండి రావడం లేదు అంటుంది. ఆ తర్వాత నీ మ్యూజిక్ స్కూల్ ఏమైంది అని అడుగుతుంది. దీంతో ఇంకా ఏ స్కూల్ దొరకలేదు అని అంటుంది. దీంతో సంజన 'నాకు తెలిసిన డ్యాన్స్ స్కూల్ ఒకటి ఉంది. నేను వాళ్లతో మాట్లాడుతా' అని వెంటనే ఫోన్ చేసి ప్రిన్సిపల్‌తో మాట్లాడుతుంది. దీంతో తులసి సంతోషిస్తుంది.

ప్రేమ్‌కు అడ్డంగా దొరికిన శృతి
ఇక, ప్రేమ్ మ్యూజిక్ డైరెక్టర్ మప్పీ లహరి ఇంటికి వస్తుంటాడు. అప్పుడే ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేపర్‌లో ప్రేమ్, శృతి కలిసి ఉన్న ఫోటోను చూస్తాడు. ఆ వెంటనే అతడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. అప్పుడు శృతితో ఆయన 'అంటే నువ్వు ప్రేమ్ భార్యవా' అని అడుగుతూ ఉంటాడు. ఇంతలో ప్రేమ్ అక్కడికి వచ్చి శృతిని చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత అతడికి శృతి అక్కడ పని చేస్తున్న విషయం తెలుస్తోంది. దీంతో అటు ప్రేమ్, ఇటు శృతి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ మప్పీ లహరి వాళ్లిద్దరి మీద కోపంతో పేపర్‌ను చింపేస్తాడు.

లిఫ్టులో చిక్కుకుపోయిన హనీ
సంజనతో కలిసి తులసి డ్యాన్స్ స్కూల్‌కు వస్తుంది. అక్కడే ఉన్న హనీ.. తులసిని చూసి హాయ్ తులసి ఆంటి అంటుంది. అప్పుడామె హనీ గొంతులా ఉందేంటి అని అనుకుంటుంది. ఆ తర్వాత ఆ చిన్నారిని అక్కడ చూసి షాక్ అవుతుంది. అప్పుడు తులసి పైకి రానా అని అంటుంది. దీంతో హనీ వద్దు వద్దు నేను వస్తున్నా. లిఫ్ట్ ఉంది అంటుంది. తర్వాత లిఫ్ట్ ఎక్కి కిందకు రావాలని అనుకుంటుంది. అంతలో ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో లిఫ్ట్ ఆగిపోతుంది. దీంతో హనీ అందులోనే ఇరుక్కుపోతుంది. దీంతో తులసి టెన్షన్ పడుతుంది. ఆ సమయంలోనే సామ్రాట్ కూడా అక్కడకు వస్తాడు. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











