Intinti Gruhalakshmi: నందూ, తులసికి అవమానం.. ట్విస్ట్ ఇచ్చిన రాజ్యలక్ష్మి.. విక్రమ్ ఆ మాట అనడంతో!

జనరేషన్లు చేంజ్ అవుతున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. కెఫే ఓపెన్ చేయగానే నెలరోజుల పాటు గిరాకీ తగులుతుంది. దీంతో నందూ, తులసి ఎంతో సంతోషంగా ఉంటారు. అంతా మంచిగా ఉండడంతో దివ్య కాపురం చక్కగా నడవాలని ఆమెతో బోనం ఎత్తించాలని తులసి అనుకుంటుంది. అందుకోసం ఆమెను పిలవడానికి వెళ్లాలని ప్లాన్ చేస్తారు. అయితే, దివ్య ఇంట్లో మాత్రం లాస్య టాపిక్ నడుస్తుంది. ఆమెను జాబ్‌లోకి తీసుకోకపోతే ఆస్పత్రి నష్టాలపాలు అవుతుందని విక్రమ్‌ను అందరూ నమ్మిస్తారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అతడు కూడా ఒప్పుకుంటాడు.

Intinti Gruhalakshmi:

లాస్యకు ఉద్యోగం వద్దన్న దివ్య:
గదిలోకి వెళ్లిన తర్వాత విక్రమ్‌తో దివ్య 'లాస్య గురించి నాకు బాగా తెలుసు.. మనిద్దరి మధ్య లేని గొడవల్ని సృష్టిస్తుంది' అని చెబుతుంది. దీనికి విక్రమ్ 'నేనేం చిన్నపిల్లాడిని కాదు దివ్యా.. మంచి చెడు నాకు తెలుసు. ఏది నమ్మాలో ఏది నమ్మ కూడదో కూడా నాకు తెలుసు' అంటాడు. దీంతో దివ్య 'నీ ఇష్టం విక్రమ్.. నా మాటకి విలువ ఉండదని తెలుసు.. అయినా అడగమన్నావు కాబట్టి అడిగాను.. నీకు దివ్య కంటే లాస్యే ఎక్కువనుకుంటే నీ నిర్ణయానికి అడ్డుపడను' అంటుంది. దీనికతడు 'ఎందుకలా మాట్లాడుతున్నావు? తన అవసరం మనకి ఉంది' అని అంటాడు.

ఆమె ఉద్యోగి మాత్రమే అంటూ: ఎంత చెప్పినా వినకపోవడంతో దివ్య 'కనీసం నీ నిర్ణయాన్ని ఓ రెండు రోజులు వాయిదా వేయగలవా? రేపు మా అమ్మ నాన్న మన ఇంటికి వస్తున్నారు. బోనాలు పండుగ కోసం మనల్ని పిలవడానికి వస్తున్నారు. ఆ టైంలో లాస్య ఆంటీ మన ఇంట్లో కనిపిస్తే బావుండదు' అంటుంది. దీంతో విక్రమ్ 'ఆవిడ ఉద్యోగం ఆవిడది. దాంట్లో మీ నాన్న గారికి ఏం సంబంధం? లాస్యతో మీ నాన్న తెగతెంపులు చేసుకున్నారు కదా. ఆ ఇంటి గొడవల్ని ఈ ఇంటికి తీసుకుని రావద్దు. లాస్య జీతానికి పనిచేసే ఉద్యోగి మాత్రమే. అంతకు మించి విలువ ఇవ్వను' అంటాడు.

Intinti Gruhalakshmi:

దివ్య కోపంగా.. వాళ్లు వచ్చారు: ఆ తర్వాత విక్రమ్ 'లాస్యపై అమ్మకి నమ్మకం ఉంది. అందుకే జాబ్‌లోకి తీసుకున్నాను' అని చెప్తాడు. దీంతో దివ్య 'సరే విక్రమ్.. నీ బిజినెస్ నీది. జోక్యం చేసుకునే హక్కు నాకు లేదు. ఏదేమైనా నా బాధని ఓపిగ్గా విన్నావు. చాలా సంతోషం. ఏదో రోజు నా బాధ నీకు అర్ధం అవుతుంది. ఆ రోజు కోసం ఎదురుచూస్తుంటా' అని కోపంగా వెళ్లిపోతుంది. ఆ తర్వాత నందూ, తులసిలు దివ్య ఇంటికి వస్తారు. వాళ్లు రాగానే రాజ్యలక్ష్మి 'పెళ్లి చేసి మీ అమ్మాయిని అలా వదిలేశారేంటి? తనని చూడ్డానికి కూడా రాలేదు' అని తనదైన రీతిలో డైలాగ్ వదులుతుంది.

బసవయ్య వెటకారంతో కోపం: ఆ వెంటనే బసవయ్య 'అమ్మాయిని చూడ్డానికి రాలేదు. కనీసం వియ్యాల వారిని పలకరించడానికైనా రావాలి కదా. ఆ మాత్రం కూడా మర్యాద తెలియదా' అని అంటాడు. దీంతో దివ్యకు కోపం వస్తుంది. కానీ, కూల్ అవమని తులసి సైగలు చేస్తుంది. అప్పుడు తులసి 'రావాలనే అనుకున్నాం కానీ.. ఇంట్లో పరిస్థితులు అడ్డం పడ్డాయి' అని అంటుంది. దీనికతడు 'అంతేలెండి వినేవాళ్లు ఉంటే ఎన్ని కథలైనా చెప్తారు' అంటాడు. ఆ మాటతో దివ్య.. 'బాబాయ్ కాస్త మా అమ్మా నాన్నల్ని మాట్లాడనిస్తారా?' అని అంటుంది. అయినా అతడు వెటకారంగా మాట్లాడతాడు.

Intinti Gruhalakshmi:

లాస్యను చూసి వాళ్లు షాక్‌తో: అసలు ఇంటికి వచ్చిన విషయాన్ని తులసి చెప్పినా బసవయ్య, రాజ్యలక్ష్మి వెటకారంగానే మాట్లాడతారు. ఆ సమయంలోనే లాస్య అక్కడకు వచ్చి గుడ్ మార్నింగ్ అంటుంది. ఆమెను చూసి తులసి వాళ్లు షాక్ అవుతారు. తర్వాత నందూ కోపంగా వెళ్లి నువ్వెందుకు వచ్చావు అంటాడు. దీంతో రాజ్యలక్ష్మి 'హలో వియ్యాల వారూ.. ఇప్పుడు లాస్య మా హాస్పటల్‌లో ఫైనాన్సియల్ కన్సల్టెంట్. ఆఫర్ లెటర్ తీసుకోవడానికి వచ్చింది. ఇది చాలా ఇంకా చెప్పమంటారా అన్నయ్య గారూ' అని షాకిస్తుంది. దీంతో ఏం చేయాలో వాళ్లకు అర్థం కాదు.

లాస్యకు సపోర్టుగానే విక్రమ్: లాస్య, రాజ్యలక్ష్మిల మీదకు నందూ దూకుడుగా వెళ్లడంతో తులసి అతడిని కూల్ చేస్తుంది. అప్పుడు లాస్య 'కూర్చోండి సార్.. మీ మేడం గారు చెప్తున్నారు కదా.. మీరు ఆమె చెప్పినట్టే చేస్తారు కదా. ఆవిడ పక్కన కూర్చోమంటున్నారు కదా కూర్చోండి' అని అంటుంది. దీంతో తులసి 'నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు లాస్యా' అనడంతో లాస్య 'అతను మాట్లాడుతున్నది నా గురించి. నేను ఎందుకు ఇన్వాల్వ్ కాకూడదు. ఆవిడ నా బాస్. నా ముందు నా బాస్‌ను నిలదీస్తే ఎలా ఊరుకుంటాను' అని బదులిస్తుంది.

Intinti Gruhalakshmi:

విక్రమ్ హామీతో సంతోషంగా: తర్వాత విక్రమ్ 'లాస్య గారూ.. మా ఫ్యామిలీ విషయంలో కల్పించుకోవద్దు. మీకు మీకు ఏమైనా ఉంటే బయట తేల్చుకోండి. మామయ్య గారూ మా అమ్మతో అలా గొంతు పెంచి మాట్లాడటం పద్దతి కాదు. మా అమ్మను అవమానిస్తే నన్ను కూడా అవమానించినట్టే. మీ అల్లుడుగా నేనూ మీ కుటుంబ సభ్యుడ్నే నాకూ మీ సమస్యలు తెలుసు. తప్పనిసరి పరిస్థితుల్లో లాస్యను ఉద్యోగంలోకి తీసుకున్నాను. మిమ్మల్ని అవమానించాలని కాదు. నేను మీకు హామీ ఇస్తున్నా.. మీకు కంగారు పడాల్సిన పని లేదు' అని విక్రమ్ హామీ ఇవ్వడంతో నందూ వాళ్లు ఊపిరి పీల్చుకుంటారు.

రాజ్యలక్ష్మి ట్విస్ట్.. విడాకులు: విక్రమ్ హామీ ఇవ్వడంతో తులసి వాళ్లు వెళ్లాలని అనుకుంటారు. అప్పుడు రాజ్యలక్ష్మి 'మీ అమ్మాయిని పంపడం కుదరదు. మేము కూడా వస్తాము' అంటుంది. దీంతో తులసి సంతోషిస్తుంది. ఇక, వాళ్లు వెళ్లేటప్పుడు లాస్య అడ్డం వస్తుంది. అంతేకాదు, 'ఇక మాటలు లేవు నందగోపాల్ చేతలే. నీకు గుండెల్లో దడ పుట్టిస్తాను. నీకు నిద్ర లేకుండా చేస్తాను. నా నరనరాల్లో పగ ఉంది. అసలు నేను ఇక్కడికి వచ్చిందే దివ్య జీవితం నాశనం చేయడానికి. డైరెక్ట్‌గా రాజ్యలక్ష్మి‌తో చేతులు కలిపాను. విక్రమ్, దివ్యకు విడాకులు అయ్యేలా చేస్తాను' అంటుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X