twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Intinti Gruhalakshmi Today Episode: నిజం తెలుసుకున్న తులసి.. వాళ్లతో కలిసి అద్భుతమైన ప్లాన్

    |

    భారతదేశంలో ఉన్న మిగిలిన భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!
    Photos Courtesy: Star మా and Disney+Hotstar

    గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసికి అంకిత షూరిటీ సంతకం చేసిందన్న విషయాన్ని లాస్య, భాగ్య వచ్చి గాయత్రికి చెబుతారు. దీంతో ఆమె కోపంగా ఆ ఇంటికి వెళ్తుంది. అక్కడ తులసిపై ఎన్నో నిందలు వేస్తూ మాట్లాడుతుంది. దీంతో ఆమె దివ్యపై ప్రమాణం చేయడానికి సిద్ధ పడుతుంది. అప్పుడు అంకిత షూరిటీ సంతకం విషయాన్ని తులసికి చెబుతుంది. దీంతో ఆమె బాధ పడుతుంది. తన డబ్బులు తానే కట్టుకుంటానని, లేకుంటే అంకితను పంపిచేస్తానని గాయత్రికి మాటిస్తుంది. ఇక, అంకిత.. బ్యాంక్ ఏజెంట్ రంజిత్ కాల్ లిస్ట్ తీసి తులసికి చూపిస్తుంది.

    శృతి మించిన యాంకర్ స్రవంతి హాట్ షో: బ్లేజర్ విప్పేసి మరీ దారుణంగా!శృతి మించిన యాంకర్ స్రవంతి హాట్ షో: బ్లేజర్ విప్పేసి మరీ దారుణంగా!

    తులసికి తిట్లు.. లాస్యపై ప్రశంసలు

    తులసికి తిట్లు.. లాస్యపై ప్రశంసలు

    లాస్య మీద అనుమానంతో తులసి ఆమెకు ఫోన్ చేస్తుంది. అప్పుడు వాళ్లు పార్టీలో ఉంటారు. అలా ఫోన్ లిఫ్ట్ చేసి పక్కన పెడుతుంది లాస్య. అప్పుడు నందూ ఫుల్లుగా మందు తాగి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు. ‘తులసి ఒక ఇడియట్. ఇంత మంచి మూడ్‌లో దాని గురించి మాట్లాడడం ఎందుకు' అని చెబుతాడు. అప్పుడు ఆయన ఫ్రెండ్ మరి మంచి వ్యక్తి ఎవరు అని అడుగుతాడు. దీనికి నందూ ‘నా బెటర్ హాఫ్.. నా బంగారం లాస్య. ఒట్టేసి చెబుతున్నా లాస్య.. ఇది నా మనసులో మాట. ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఉంటానికి కారణం లాస్య' అంటాడు.

    20 లక్షల గురించి చెప్పగానే డౌట్

    20 లక్షల గురించి చెప్పగానే డౌట్

    తులసిని తిట్టడంతో అస్సలు ఆపని నందూ ‘నేల మీద కూలబడిన నన్ను మళ్లీ ఆకాశమంత ఎత్తున నిలబెట్టింది లాస్య' అంటాడు. దీంతో ఆమె ఊరుకోండి.. నేనేం చేశాను అంటుంది. అప్పుడు నందూ ‘మళ్లీ నేను బిజినెస్ స్టార్ట్ చేశానంటే దానికి కారణం లాస్యే. ఇలా మాట ఇచ్చింది.. అలా 20 లక్షలు తీసుకొచ్చి నా ముందు పోసింది. గ్రేట్ పర్సనాలిటీ అంది. నందూ.. ఈ డబ్బు నీది ఏం చేసుకుంటావో చేసుకో అంది. తొడకొట్టి చెబుతున్నా లాస్య కంటే మంచి భార్యను ఎవరైనా చూపించండి అంటూ చాలెంజ్ చేస్తున్నా' అంటూ వీర లెవెల్‌లో మాట్లాడతాడు.

    Pakka Commercial Twitter Review: గోపీచంద్ మూవీకి అలాంటి టాక్.. ప్లస్ మైనస్ ఇవే.. ఫైనల్ రిపోర్ట్ ఇలాPakka Commercial Twitter Review: గోపీచంద్ మూవీకి అలాంటి టాక్.. ప్లస్ మైనస్ ఇవే.. ఫైనల్ రిపోర్ట్ ఇలా

    తులసి మాటతో లాస్య సందేహం

    తులసి మాటతో లాస్య సందేహం

    నందూ ఓవర్ యాక్షన్ అంతా తులసి ఫోన్‌లో వింటుంది. అప్పుడు భాగ్య కూడా లాస్యతో నీ మొగుడేంటి తాగి ఇలా మాట్లాడుతున్నాడు అని అంటుంది. దీంతో లాస్య నువ్వు ఏదో ఒకటి వాగకు అని ఫోన్ తీసుకొని బయటికి వచ్చి తులసితో మాట్లాడుతుంది. అప్పుడు తులసి ‘నువ్వు ఏం పొరపాటు చేశావో నీ అంతరాత్మకు తెలుసు లాస్య' అంటుంది. దీనికి లాస్య ‘నీతో తీరిగ్గా మాట్లాడటానికి నాకు టైమ్ లేదు. ఇంట్లో గెస్టులు ఉన్నారు' అంటుంది. అప్పుడు తులసి ‘ఎందుకు అంతలా ఫోన్ కట్ చేసేందుకు ఆరాటపడుతున్నావు. నువ్వు తప్పు చేశావని నాకు తెలిసిపోయిందని భయపడుతున్నావా' అంటుంది. దీంతో విషయం ఏంటో సూటిగా చెప్పుమంటుంది. దీనికి తులసి నువ్వు భయపడుతున్నావన్న నీ మాటల్లోనే తెలిసిపోతోంది అంటుంది.

    జనాలకు తెలిసే రోజు వస్తుందని

    జనాలకు తెలిసే రోజు వస్తుందని

    తులసితో ఫోన్ మాట్లాడుతుండగా నందూ నా లాస్య ఎక్కడ అంటూ ఆమె దగ్గరికి వస్తాడు. అప్పుడు ‘ఏంది లాస్య ఇది.. సంతోషంలో పార్టీ చేసుకుంటుంటే ఇలా వదిలేసి ఫోన్ మాట్లాడుతున్నావేంటి.. టూమచ్ గెస్టులు వెయిట్ చేస్తున్నారు' అంటాడు. అప్పుడు లాస్య ఇంపార్టెంట్ ఫోన్ కాల్ మాట్లాడుతున్నా. వస్తా నువ్వు వెళ్లు అంటుంది. అప్పటికీ తులసి ఫోన్‌లో లైన్‌లోనే ఉంటుంది. ఆ తర్వాత ‘నువ్వు చాలా అదృష్టవంతురాలివి. అడగ్గానే నీకు 20 లక్షలు ఇచ్చారు' అంటుంది. దీనికి లాస్య నీ ప్రాబ్లమ్ ఏంటి అని అడుగుతుంది. దీంతో తులసి ‘నేనేమీ చేతులు ముడుచుకొని కూర్చోను. జనాలకు కూడా తెలిసే రోజు త్వరలోనే వస్తుంది' అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది.

    హీరోయిన్ దారుణమైన ఫొటో వదిలిన వర్మ: ఆమె బాడీలో ఏ పార్ట్ బాలేదు అంటూ!హీరోయిన్ దారుణమైన ఫొటో వదిలిన వర్మ: ఆమె బాడీలో ఏ పార్ట్ బాలేదు అంటూ!

    20 లక్షల గురించి చెప్పిన తులసి

    20 లక్షల గురించి చెప్పిన తులసి

    తులసి మాట్లాడిన తర్వాత లాస్య నేనే 20 లక్షలు తీసుకున్నట్టు తెలిసిపోయిందా ఏంటి అని భయపడుతుంది. దీంతో ఆమె ఏం చేయాలా అని ఆలోచిస్తుంది. మరోవైపు, అంకిత వచ్చి లాస్యకు ఫోన్ చేశారా అని అడుగుతుంది. దీనికామె ‘తనే తప్పు చేసినట్టు నాకు అనిపిస్తోంది. నా అకౌంట్‌లో 20 లక్షలు మాయం అవడం.. మరోవైపు నందు 20 లక్షలతో బిజినెస్ మొదలు పెట్టడం రెండూ ఒకేసారి స్టార్ట్ అయ్యాయి' అంటుంది. అప్పుడు దివ్య ‘నీ డబ్బులతో నీకు తెలియకుండా డాడ్ బిజినెస్ స్టార్ట్ చేయడం ఏంటి.. ఇప్పుడే డాడ్ ను అడుగుతాను' అంటుంది దివ్య.

    వాళ్లిద్దరితో కలిసి తులసి బిగ్ ప్లాన్

    వాళ్లిద్దరితో కలిసి తులసి బిగ్ ప్లాన్

    దివ్య మాటలకు తులసి ‘వద్దు ఆగమ్మా. అసలు ఆ 20 లక్షలు నావి అనే విషయం మీ డాడీకి తెలుసో లేదో' అంటుంది. అంతేకాదు, ‘మనం ప్రతి నిమిషాన్ని సరిగ్గా వాడుకొని లాస్య చుట్టు ఉచ్చు బిగిద్దాం' అని దివ్య, అంకితకు చెబుతుంది. ఆ తర్వాత నా దగ్గర ఒక ప్లాన్ ఉందని దాని గురించి వాళ్లకు వివరిస్తుంది. దీని ప్రకారం వాళ్లంతట వాళ్లే నిజం ఒప్పుకునేలా చేద్దామని వాళ్లు అనుకుంటారు. తులసి ప్లాన్‌కు అనుగుణంగానే దివ్య, అంకిత కూడా ముందుకు వస్తారు. మొత్తానికి లాస్యకు చుక్కలు చూపించాలని ముగ్గురూ డిసైడ్ అవుతూ చేతులు కలుపుతారు.

    హాట్ షోలో హద్దు దాటిన దీపికా పదుకొనె: ఆమెనిలా చూసి తట్టుకోవడం కష్టమే!హాట్ షోలో హద్దు దాటిన దీపికా పదుకొనె: ఆమెనిలా చూసి తట్టుకోవడం కష్టమే!

    Recommended Video

    పక్కా కమర్షియల్ పక్కా genuine రివ్యూ *Entertainment | Telugu OneIndia
    తులసి ఇంటికి భాగ్యను పంపించి

    తులసి ఇంటికి భాగ్యను పంపించి


    తులసికి నిజం తెలిసిందని భయపడుతోన్న లాస్య.. భాగ్యను ఉసిగొల్పి తులసి ఇంటికి పంపిస్తుంది. దీంతో ముందు ముసలోళ్లను పడేయాలని అనుకుంటుంది. అప్పుడు ‘అత్తయ్య గారు.. మామయ్య గారు నన్ను దీవించండి. అత్తింటి మీద కోడలికి ఎప్పటికీ హక్కు ఉంటుంది. రాకుండా ఎవ్వరూ ఆపలేరు' అంటుంది. దీనికి అనసూయ నువ్వు ఊరికే రావు.. అవసరం ఉంటేనే వస్తావు అంటుంది. దీంతో తులసి పాపం.. రాకరాక వచ్చింది. మీరు ఇలా నిలదీయడం ఏం బాగలేదు అంటుంది. దీనికి భాగ్య ‘థాంక్స్ తులసి అక్క. నువ్వు అయినా నా మనసును అర్థం చేసుకున్నావు' అంటుంది. తర్వాత ఎలాగైనా ఇక్కడే ఉండిపోవాలి అని అనుకుంటుంది. వీళ్లను ఎలా కాకపట్టాలి అని అనుకుంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

    English summary
    Intinti Gruhalakshmi Episode 673: Lasya Sends Bhagya to Tulasi Home with New Plan. After That Tulasi, Ankitha and Divya Join Hands and Targeted Lasya.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X