Intinti Gruhalakshmi July 20th Episode: తులసి విషయంలో నందూ యూటర్న్.. గిరిధర్ ఎంట్రీతో కథలో ట్విస్ట్

చాలా ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోండి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. శృతిని ఇబ్బంది పెట్టేందుకు అంకిత ఎన్నో ప్లాన్లు వేస్తుంది. ఆఫీసులోని డబ్బులు వాడుకున్నందుకు లాస్యను నందూ తిడతాడు. అనంతరం రామచంద్ర తులసికి ఫోన్ చేసి ఫ్యాక్టరీ బాధ్యతలు అప్పగిస్తానని చెబుతాడు. దానికి ఆమె సమయం అడుగుతుంది. అప్పుడు నందూ, లాస్య.. తులసిని అవమానించేలా మాట్లాడుతూ నిరుత్సాహపరుస్తారు.

తులసికి కూడా ఎప్పుడూ ఇవ్వలేదు

తులసికి కూడా ఎప్పుడూ ఇవ్వలేదు


నందూ, లాస్య తులసిని తిట్టినట్లు చూపించినా.. అది ఆమె ఊహే అని అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత లాస్యకు నందూ క్షమాపణలు చెబుతాడు. ఈ క్రమంలోనే 'నీకు నేనెంతో ఫ్రీడమ్ ఇచ్చాను. తులసిని కూడా ఎప్పుడూ ఇలా చూసుకోలేదు' అని అంటాడు. అప్పుడు లాస్య 'నువ్వు ఫ్రీడమ్ ఇచ్చావు. కాకపోతే ఈ లెక్కలు అడిగి నన్ను అవమానించనని మాటివ్వు' అని అడుగుతుంది.

ఇంట్లో వాళ్లతో తులసి చర్చ.. చప్పట్లు

ఇంట్లో వాళ్లతో తులసి చర్చ.. చప్పట్లు


రామచంద్ర ఇచ్చిన ఆఫర్‌ గురించి తులసి ఇంకా ఆలోచించుకుంటుంది. ఆ సమయంలోనే ఇంట్లో వాళ్లందరినీ కూర్చోబెట్టి సంప్రదింపులు జరుపుతుంది. అప్పుడంతా ఏమైంది? ఎందుకు అందరినీ ఇక్కడికి పిలిచావు? అంటూ అడుగుతారు. అప్పుడు తులసి రామచంద్ర ఫ్యాక్టరీ తన చేతిలో పెడతానన్న విషయం చెప్పగానే.. అభి, ప్రేమ్, దివ్య, శృతిలు చప్పట్లు కొట్టి ఆమెను యంకరేజ్ చేస్తారు.

 తులసిని నిరుత్సాహపరిచిన వాళ్లిద్దరు

తులసిని నిరుత్సాహపరిచిన వాళ్లిద్దరు


తులసి చెప్పిన మాటలకు పిల్లలు ప్రోత్సహించగా.. అంకిత, అనసూయ మాత్రం నిరుత్సాహ పరుస్తారు. 'చాలా రిస్కుతో కూడుకున్న పని.. ఆలోచించి నిర్ణయం తీసుకోండి' అని అంకిత తులసిని హెచ్చరిస్తుంది. అదే సమయంలో ప్రేమ్‌కు ఆమెకు మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఇక, ఎప్పటి లాగే అనసూయ.. తులసిని చదువులేదు.. చేతకాదు అంటూ నిరుత్సాహ పరిచేలా మాట్లాడుతుంది.

ఫ్యాక్టరీ వద్దన్న తులసి.. చెప్పడానికెళ్లి

ఫ్యాక్టరీ వద్దన్న తులసి.. చెప్పడానికెళ్లి


ఇంట్లో వాళ్లలో కొందరు ప్రోత్సహించినా.. మరికొందరు నిరుత్సాహ పరచడంతో తులసి డైలామాలో పడిపోతోంది. ఏం చేయాలో దిక్కుతోచక మిన్నకుండిపోతుంది. ఇలాంటి సమయంలోనే తాను ఆ ఫ్యాక్టరీని తీసుకోకూడదని నిర్ణయించుకుంటుంది. ఈ విషయం రామచంద్రకు ఫోన్‌లో కాకుండా.. నేరుగా వెళ్లి చెప్పాలని డిసైడ్ అవుతుంది. అందుకు అనుగుణంగానే అక్కడకు వెళ్తుంది.

తులసికి నందూ ప్రోత్సాహం... వాళ్లిలా

తులసికి నందూ ప్రోత్సాహం... వాళ్లిలా


తులసికి రామచంద్ర ఇచ్చిన ఆఫర్ గురించి అనసూయ వచ్చి నందూ, లాస్యకు చెబుతుంది. అప్పుడు లాస్య, అనసూయ ఆమెను నిరుత్సాహ పరిచేలా మాట్లాడతారు. దీంతో నందూ వాళ్లపై కోప్పడతాడు. 'తులసి నాశనం అవ్వాలని ఎప్పుడూ కోరుకోలేదు. తను బాగుంటే నా పిల్లలు బాగుంటారు' అని అంటాడు. కానీ, లాస్య, అనసూయ మాత్రం ఆమెను పడేయాలని ప్లాన్ చేస్తారు.

గిరిధర్ ఎంట్రీ.. అతడికి తులసి వార్నింగ్

గిరిధర్ ఎంట్రీ.. అతడికి తులసి వార్నింగ్


ఫ్యాక్టరీలో ఉన్న రామచంద్రను బెదిరించేందుకు గిరిధర్ వస్తాడు. అతడిని చంపుతానని పీక నొక్కబోతాడు. అంతలో తులసి అక్కడకు వచ్చి అతడికి అడ్డు పడుతుంది. అంతేకాదు, ఫ్యాక్టరీ బాధ్యతలు తీసుకుంటున్నానని, దమ్ముంటే ఒక్క నూలుపోగైనా తీసుకెళ్లమని వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు గిరిధర్ ఆమెను చంపుతానన్న అస్సలు భయపడకుండా ముందుకు వెళ్తానంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X