Intinti Gruhalakshmi: అనుకున్నది సాధించిన దివ్య.. ట్విస్ట్ ఇచ్చిన తులసి.. రుణం తీర్చుకోవాలని!

దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూ, తులసికి యాక్సిడెంట్ చేయమన్న డ్రైవర్.. అసలు ఏం జరిగిందో చెప్పడంతో లాస్య, రాజ్యలక్ష్మి షాక్ అవుతారు. దీంతో ప్లాన్ మొత్తం నాశనం చేశావంటూ అతడిపై లాస్య ఫైర్ అవుతుంది. ఇక, తులసి రావడంతో దివ్య సంతోషిస్తుంది. తర్వాత దివ్య, విక్రమ్ ఫస్ట్ నైట్‌కు ఏర్పాట్లు చేస్తారు. ఆ వెంటనే వాళ్లిద్దరూ సరసాలు ఆడుకుంటూ ఉండగా రాజ్యలక్ష్మి వాళ్లు రగిలిపోతూ ఉంటారు. ఒకవైపు అందరూ శోభనం పనుల్లో బిజీగా ఉండగా.. లాస్య, రాజ్యలక్ష్మి మాత్రం ఫస్ట్ నైట్ ఆపాలని అనుకుంటూనే ఉంటారు.

Intinti Gruhalakshmi Serial Today Episode July 20th 2023

ముహూర్తానికి ఇంకా టైమ్ ఉంది:దివ్య, విక్రమ్‌ను శోభనం గదిలోకి పంపించబోతుండగా లాస్య ఆగండి అని అరుస్తుంది. దీంతో నందూ, తులసి 'ఏమైంది.. ఎందుకు ఆగమంటున్నావు? ఏంటి నీ ప్రాబ్లమ్' అనిప్రశ్నిస్తారు. దీంతో లాస్య 'ఎవరికి వాళ్లు వాళ్లను ఎప్పుడెప్పుడు గదిలోకి పంపేద్దామా అనే అనుకుంటున్నారు తప్పితే.. ముహూర్తం గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇంకా పది నిమిషాలు ఉంది' అని అంటుంది. దీంతో విక్రమ్ తాతయ్య 'కొంపలేం మునిగిపోలేదు.. లోపల కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు' అని అంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode July 20th 2023

విక్రమ్ నువ్వు ముందుగా వెళ్లు:పెద్దాయన మాటలకు లాస్య 'అలాగని గ్యారంటీ ఏముంది? పది నిమిషాలు ఆగితే సరిపోతుంది కదా' అని అంటుంది. దీంతో బసవయ్య 'అదేంటో కానీ.. శోభనం మనవడికి అయితే తాతకు హడావిడి ఎక్కువైంది' అని అంటాడు. దీంతో నందూ 'సరే విక్రమ్.. నువ్వు వెళ్లి గదిలో ఉండు.. ఈ లోపు దివ్య వస్తుంది' అని అంటాడు. అప్పుడు విక్రమ్ 'ఒకరు ముందు ఒకరు వెనుక ఎందుకు? తాతయ్య చెప్పినట్టు గదిలోకి ఒక్కసారే వెళ్లి ఓ పది నిమిషాలు కబుర్లు చెప్పుకుని ముహూర్తం టైంకే కార్యక్రమం మొదలుపెడతాం' అని దివ్య చేయి పట్టుకుని వెళ్దాం అంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode July 20th 2023

విక్రమ్ ఒక్కడే గదిలోకి వెళ్తాడు:విక్రమ్ మాటలకు బసవయ్య 'ఇది పద్దతి కాదేమో అల్లుడూ.. అక్క ఫీల్ అవుతుంది' అని అంటాడు. దీంతో విక్రమ్ తాత 'సంజయ్ గాడు ఏమైనా ముహూర్తం పెట్టి శోభనం చేసుకున్నాడా ఏంటీ' అని ప్రశ్నిస్తాడు. దీనికి రాజ్యలక్ష్మి.. ఈ ముసలోడేంటి? తెగ రెచ్చిపోతున్నాడు అని తిట్టుకుంటుంది. అప్పుడు తులసి కల్పించుకుని 'పద్దతి ప్రకారమే జరగనిద్దాం బాబూ.. ముహూర్తం అంటే ముహూర్తమే.. మీరు గదిలోకి వెళ్లండి బాబూ దివ్యని మేం గదిలోకి పంపిస్తాం' అని అంటుంది. దీంతో విక్రమ్ ఒక్కడే శోభనం గదిలోకి వెళ్తాడు.

ఎలాగైనా శోభనాన్ని ఆపు అని:విక్రమ్, దివ్య శోభనం జరగకుండా లాస్య ప్లాన్ చేసిందని ధీమాగా ఉన్న రాజ్యలక్ష్మి తర్వాత ఆమెను పక్కకు తీసుకు వెళ్లి 'ఏం ప్లాన్ వేశావు చెప్పు. నువ్వు కిందపడ్డా సరే వెంటనే ఎదురుదాడికి రెడీ అవుతావు. నీలో నాకు నచ్చేది ఇదే. దివ్య ఫస్ట్ నైట్ ఆపడానికి ప్లాన్ రెడీ చేశావు. నాకు ఆరాటం ఆగడం లేదు. ఈ ఫస్ట్‌ నైట్‌ను ఎలా ఆపుతున్నావో చెప్పు లాస్యా' అని అంటుంది. దీంతో లాస్య 'ప్లానా పాడా? నేనెప్పుడో చేతులు ఎత్తేశాను' అని అంటుంది. దీంతో రాజ్యలక్ష్మికి కోపం వస్తుంది. అప్పుడు ఎలాగైనా నువ్వు శోభనాన్ని ఆపాల్సిందే అంటూ ఆమెకు వార్నింగ్ ఇస్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode July 20th 2023

విక్రమ్ ప్రామిస్.. కార్యం స్టార్ట్:ఎట్టకేలకు ముహూర్తం సమయానికి దివ్యను శోభనం గదిలోకి పంపుతారు. అప్పుడు విక్రమ్ కంగారుగా భార్యతో సరసాలు మొదలు పెడతాడు. కానీ, దివ్య మాత్రం భర్తను తన వైపునకు తిప్పుకోవాలని అనుకుంటుంది. అందుకోసం ఆమె అతడిని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. చివరికి విక్రమ్ 'నాకు నువ్వంటే ఇష్టం. ఎప్పటికీ నీ చేయి వదిలిపెట్టను' అని ప్రామిస్ చేస్తాడు. తర్వాత ఇద్దరూ పాలు తాగి, యాపిల్ షేర్ చేసుకుంటారు. అనంతరం లైట్లు ఆఫ్ అయిపోతాయి. దీంతో వీళ్లిద్దరి కార్యం ప్రారంభం అవుతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode July 20th 2023

లాస్యకు షాక్ ఇచ్చిన తులసి:కూతురి ఫస్ట్ నైట్ అవుతుందన్న సంతోషంలో ఉన్న తులసిని లాస్య కెలుకుతుంది. దీంతో ఆమెకు కోపం వస్తుంది. 'ఈరోజు దేవుడి దయతో నా కూతురి ఫస్ట్ నైట్ జరుగుతుంది. ఇకపై తనను ఎవరూ ఆపలేరు. ఈ ఇంట్లో ఎంత మంది ఉన్నా తనకు ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉన్నాయి. నువ్వు నా భర్తను లాక్కున్నావు. ఆయనతో అయినా ఉన్నావా? కోర్టులో కేసు వేశావు ఏం లాభం జరిగింది? మూసుకుని నెల నెల భరణం తీసుకో. ఇప్పుడు నా కూతురు ఒక్కదాన్నే మీరు తట్టుకోలేకపోతున్నారు.. నేను కూడా ఈ ఇంట్లో సెటిల్ అయితే ఇంక మీ పని గోవిందా' అని అంటుంది. దీంతో లాస్య ఒక్కసారిగా షాక్ అవుతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode July 20th 2023

తులసి రుణం తీర్చుకోవాలి:ఇక, ఇంట్లో నందూ ఒంటరిగా కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు పరందామయ్య రావడంతో ఇద్దరూ తులసి గురించి మాట్లాడుకుంటారు. ఆ సమయంలో నందూ 'దేవత లాంటి తులసి వల్లే ఈరోజు నేను మళ్లీ నిలదొక్కుకోగలిగాను. లేకపోతే నా పరిస్థితి తెగిన గాలిపటంలా మారిపోయేది. తన రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు' అని అంటాడు. దీంతో పరందామయ్య 'ఇప్పటికైనా తులసి దేవత అని ఒప్పుకున్నావు సంతోషం' అంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X