For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: నిజం తెలిసి షాకైన సామ్రాట్.. వాళ్లను కలిపేందుకు తులసి ప్లాన్

  |

  ఎంతో కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా చూసేయండి మరి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తమ ఇంటి గార్డెన్‌లో హనీ పోగొట్టుకున్న బంగారు గొలుసును తులసి తీసుకెళ్లి సామ్రాట్‌కు అందిస్తుంది. అయినప్పటికీ అతడు ఆమె మీద నిందలు వేస్తూనే ఉంటాడు. ఆ తర్వాత శృతి.. ప్రేమ్ భార్యే అన్న విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ మప్పీ లహరి గుర్తిస్తాడు. అప్పుడే ప్రేమ్‌కు శృతి అక్కడ పని చేస్తున్న నిజం కూడా తెలిసిపోతుంది. మరోవైపు.. సంజన సహాయంతో తులసి ఓ డ్యాన్స్ స్కూల్‌కు వెళ్తుంది. అక్కడ హనీ.. తులసిని చూసి ఆమె దగ్గరకు రాబోతుంది. అంతలో సాంకేతిక లోపంతో లిఫ్టులో ఆమె చిక్కుకుపోతుంది.

  నిధి అగర్వాల్ అందాల జాతర: స్లీవ్‌లెస్ టాప్‌లో ఆమెనిలా చూశారంటే!

  తులసితో గొడవ పడిన సామ్రాట్

  తులసితో గొడవ పడిన సామ్రాట్

  స్కూల్‌లో హనీ లిఫ్టులో ఇరుక్కుపోయిన విషయం తెలిసి సామ్రాట్ ఢీలా పడిపోతాడు. ఆ వెంటనే పైకి పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తాడు. అక్కడ తులసి కనిపించడంతో అతడు షాక్ అవుతాడు. అప్పుడు నవ్వు ఇక్కడున్నావేంటి అని ప్రశ్నిస్తాడు. ఆ తర్వాత హనీ లోపల ఇరుక్కుంటే ఏం చేస్తున్నారు అంటూ స్కూల్ యాజమాన్యాన్ని తిడుతాడు. దీంతో వాళ్లు తులసి కోసమే లిఫ్ట్ ఎక్కిందని అంటారు. అప్పుడు సామ్రాట్ తులసిపై విరుచుకుపడతాడు. అంతేకాదు, 'అసలు నువ్వు నా బిడ్డను వదలవా? నీకు దండం పెడతాను. నీకు ఎంత డబ్బు కావాలి చెప్పు. నా కూతురును వదిలేయ్' అంటూ తులసితో గొడవ పెట్టుకుంటున్నాడు.

  అసలు నిజం చెప్పేసిన బాబాయ్

  అసలు నిజం చెప్పేసిన బాబాయ్

  తులసితో సామ్రాట్ గొడవ పడుతోన్న సమయంలోనే అతడి బాబాయ్ అక్కడకు వస్తాడు. వచ్చీ రావడమే అతడిని పక్కకు తీసుకెళ్లి 'గొడవ వద్దు నువ్వు ముందు ఇటురా' అంటూ తులసి గురించి అసలు నిజం చెబుతాడు. అంతేకాదు, తులసి వల్లే ఇప్పుడు పాప బతికి ఉందని చెబుతాడు. దీంతో సామ్రాట్ షాక్ అవుతాడు. తర్వాత ఎలక్ట్రిషియన్, డాక్టర్ అక్కడకు వస్తారు. వాళ్లు వెళ్లి లిఫ్ట్ రిపేర్ చేస్తుంటాడు. ఇంతలో హనీ భయపడకుండా తులసి పాట పాడుతుంది. దీంతో హనీ లిఫ్ట్‌లో భయపడకుండా ఉంటుంది. అనంతరం లైట్ వెలుగుతుంది. లిఫ్ట్ బాగవుతుంది. లిఫ్ట్ తలుపులు తెరుచుకోగానే హనీ బయటికి వస్తుంది.

  దేత్తడి హారిక అందాల ఆరబోత: బాడీ పార్టులన్నీ కనిపించేలా ఘోరంగా!

  జరిగిన దానికి సిగ్గుపడ్డ సామ్రాట్

  జరిగిన దానికి సిగ్గుపడ్డ సామ్రాట్

  లిఫ్టులో నుంచి బయటికి రాగానే హనీ తులసిని హత్తుకుంటుంది. ఆ తర్వాత డాడీ అంటూ సామ్రాట్ దగ్గరికి వెళ్తుంది. దీంతో తులసి, సామ్రాట్ సహా అక్కడ ఉన్న వాళ్లందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఇక, తులసి గురించి అసలు నిజం తెలుసుకున్నాక సామ్రాట్ పశ్చాతాపపడుతాడు. అది అంటూ తులసితో మాట్లాడబోతాడు. కానీ తులసి మాత్రం మీకో పెద్ద నమస్కారం అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత సామ్రాట్ పదే పదే తులసిని నిందిస్తూ అన్న మాటలను గుర్తు చేసుకుంటాడు. ఆమె విషయంలో తప్పు చేశానని సిగ్గు పడుతుంటాడు.

  తాగొచ్చి గొడవ పెట్టుకున్న ప్రేమ్

  తాగొచ్చి గొడవ పెట్టుకున్న ప్రేమ్

  శృతి పనిమనిషిగా చేస్తుందని తెలుసుకున్న ప్రేమ్ ఫుల్లుగా తాగి ఇంటికి వస్తాడు. అతడిని అలా చూసిన శృతి షాక్ అవుతుంది. అప్పుడామె 'ప్రేమ్ ఏంటి ఇలా మనసును బాధపెడుతున్నావు. మన పెళ్లి అయిన క్షణం నుంచి నీ వెనుకే నడిచాడు. నీతోనే కష్టాలు పంచుకున్నాను' అంటుంది. దీనికి ప్రేమ్ 'వాడు అన్ని మాటలు అంటున్నా నువ్వు వాడిని ఒక్కమాట కూడా అనలేదు. పెళ్లాం సంపాదన మీద బతుకుతున్నాను కదా. అంతేలే నాకు కావాల్సిందే ఇది' అంటూ శృతిపై చిరాకు పడతాడు. ఆ తర్వాత ఆమెను ఎన్నో మాటలు అని అలిసిపోయి ఒళ్లో పడిపోతాడు.

  లవర్‌తో కలిసి రెచ్చిపోయిన శృతి హాసన్: నైట్ టైమ్ అతడితో యమ హాట్‌గా!

  అంకితకు ఫోన్ చేసిన అభి ఫ్రెండ్

  అంకితకు ఫోన్ చేసిన అభి ఫ్రెండ్

  మరోవైపు అంకితకు అభి ఫ్రెండ్ నరేశ్ ఫోన్ చేస్తాడు. కాల్ లిఫ్ట్ చేయగానే 'నేను నరేశ్‌ను. అభి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒకసారి వాడికి ఫోన్ ఇస్తావా' అని అడుగుతాడు. దీంతో నేను ఇంట్లో లేను అని సమాధానం చెబుతుంది. దీనికి నరేష్ అలా అని అభి చెప్పమన్నాడా అంటాడు. దీంతో అంకితకు కోపం వచ్చి ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత 'నా పెళ్లాం నాతో ఉండటం లేదని తన ఫ్రెండ్స్‌కు చెప్పుకోవచ్చు కదా. ఛీఛీ.. ఏంటో ఈ జీవితం' అంటూ చిరాకుతో ఇంట్లోకి వెళ్లిపోతుంది. అదంతా విన్న అనసూయ అసలు వీళ్ల గొడవ ఏంటో అని తులసితో అంటుంది.

  అందరినీ కలిపేలా తులసి ప్లాన్

  అందరినీ కలిపేలా తులసి ప్లాన్


  అంకిత, అభి విడిపోయి ఉండడంతో వీళ్ల సమస్యకు పరిష్కారం లేదా అని అడుగుతుంది అనసూయ.. తులసిని అడుగుతుంది. అప్పుడు పరందామయ్య 'పెళ్లాం పక్కన లేకుండా ఒక్కడు అత్తారింట్లో ఉండటం ఏంటి' అని అంటాడు. దీంతో తులసి వాళ్లను నేనే కలుపుతాను అంటుంది. అంతేకాదు, తులసి 'కృష్ణాష్టమి వస్తుంది కదా. అభిని పిలుస్తాను. నాలుగు రోజులు ఇక్కడ ఉండమంటాను. ప్రేమ్, శృతిని కూడా పిలుద్దాం. అందరం నాలుగు రోజులు కలిసి ఉండొచ్చు సరదాగా' అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 689: Samrat Fires and Blames Tulasi after his Daughter Stuck in Lift. After That Prem Drunked and Fired on Shruthi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X