Intinti Gruhalakshmi July 21 Episode: తులసి కోసం మామయ్య సాహసం.. రోడ్డున పడే ప్రమాదంలో కుటుంబం

సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసికి రామచంద్ర ఇచ్చిన ఆఫర్‌ను ఇంట్లో వాళ్లకు చెప్పగా కొందరు నిరుత్సాహపరుస్తారు. దీంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అనుకుని ఫ్యాక్టరీకి వెళ్లిన తులసి గిరిధర్‌కు వార్నింగ్ ఇస్తుంది. ఇక, లాస్యకు నందూ సారీ చెబుతాడు. ఇక, తులసికి వచ్చిన ఆఫర్‌పై నందూ సంతోష పడగా.. లాస్య, అనసూయ అసూయ చెందుతారు.

తులసి గురించి బాధ పడిపోయిన ప్రేమ్

తులసి గురించి బాధ పడిపోయిన ప్రేమ్

రామచంద్రను కలవడానికి వెళ్లిన తులసి ఇంకా ఇంటికి రాకపోగా.. ఆమె నుంచి ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో ప్రేమ్ కలవర పడుతుంటాడు. అంతలో అతడి దగ్గరకు శృతి వస్తుంది. అప్పుడు ప్రేమ్ బాధను అర్థం చేసుకున్న ఆమె కంగారు పడొద్దని చెబుతుంది. అప్పుడు తులసి ఆంటీకి ఫోన్ చేయమన్నా.. ప్రేమ్ మాత్రం ఏదైనా పనిలో ఉంటుందేమోనని సంకోచిస్తాడు.

 ప్రేమ్, శృతిపై అభికి నూరిపోసిన అంకిత

ప్రేమ్, శృతిపై అభికి నూరిపోసిన అంకిత

ఫోన్ చేసిన ప్రేమ్‌కు తులసి ఫ్యాక్టరీని తీసుకున్నట్లు చెబుతుంది. దీంతో అతడు శృతిని ఎత్తుకుని తిప్పుతాడు. అది చూసిన అంకిత.. అభి దగ్గరకు వెళ్లి 'శృతి, ప్రేమ్ తీరు బాలేదు. వాళ్లిద్దరికీ ఏదో బంధం ఉన్నట్లు అనిపిస్తుంది. అనాథ అని వచ్చి ఇలాంటి పనులు చేస్తుందా' అని అంటుంది. అప్పుడు అభి 'మనలాగే వాళ్లు కూడా ప్రేమించుకుంటున్నారేమో. లైట్ తీసుకో' అని బదులిస్తాడు.

తులసికి సర్‌ప్రైజ్.. సాధించావని కితాబు

తులసికి సర్‌ప్రైజ్.. సాధించావని కితాబు

రామచంద్ర కంపెనీలో తులసిని కొత్త సారథి అంటూ అందరికీ పరిచయం చేస్తాడు. అప్పుడు అందరూ 'అండగా ఉండండి.. మీ వెనుక మేము ఉంటాము' అని ధైర్యం చెబుతారు. అక్కడ పని ముగించుకుని ఇంటికి వచ్చిన తులసికి ఎవరూ కనిపించరు. కొద్ది సేపటి తర్వాత అందరూ వచ్చి ఆమెను సర్‌ప్రైజ్ చేస్తారు. అదే సమయంలో సాధించావంటూ తులసిని మెచ్చుకుంటారు.తులసికి సర్‌ప్రైజ్.. సాధించావని కితాబు
రామచంద్ర కంపెనీలో తులసిని కొత్త సారథి అంటూ అందరికీ పరిచయం చేస్తాడు. అప్పుడు అందరూ 'అండగా ఉండండి.. మీ వెనుక మేము ఉంటాము' అని ధైర్యం చెబుతారు. అక్కడ పని ముగించుకుని ఇంటికి వచ్చిన తులసికి ఎవరూ కనిపించరు. కొద్ది సేపటి తర్వాత అందరూ వచ్చి ఆమెను సర్‌ప్రైజ్ చేస్తారు. అదే సమయంలో సాధించావంటూ తులసిని మెచ్చుకుంటారు.

 పెట్టుబడి ఎక్కడి నుంచి తీసుకు వస్తుంది

పెట్టుబడి ఎక్కడి నుంచి తీసుకు వస్తుంది

ఫ్యాక్టరీని తీసుకోవాలన్న తులసి నిర్ణయానికి అందరూ సంతోషిస్తారు. అయితే, అంకిత, అనసూయ మాత్రం ఆమెను అడ్డు చెబుతారు. ఇలాంటి రిస్క్ చేయడం వల్ల ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడే ప్రమాదం ఉందని అంకిత అంటుంది. ఇక, అనసూయ ఎప్పటిలాగే సామెతలతో తులసిని నిరుత్సాహ పరుస్తుంది. ఆ తర్వాత ఫ్యాక్టరీ నడపడానికి పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నిస్తుంది.

మామ డేరింగ్.. అంకిత, అనసూయ అడ్డు

మామ డేరింగ్.. అంకిత, అనసూయ అడ్డు

తులసి మామ పెట్టుబడికి ఎంత డబ్బు అవసరం అవుతుందమ్మ అని అడుగుతాడు. దీనికామె రూ. 20 లక్షలు అంటుంది. అప్పుడు ఇంటి పేపర్లు పెట్టి డబ్బు తెచ్చుకోమని అంటాడు. దీనికి అంకిత, అనసూయ అడ్డు పడతారు. ఏదైనా తేడా వస్తే అందరం రోడ్డు మీదుకు వెళ్లాలని అంటారు. అప్పుడు ప్రేమ్, శృతి కూడా తాతకు సపోర్టుగా మాట్లాడతాడు. దీంతో ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X