Intinti Gruhalakshmi: ఫస్ట్ నైట్‌తో రాజ్యలక్ష్మి, లాస్యకు ఝలక్.. ఆమెతో గతం గుర్తు చేసుకున్న నందూ
తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ముహూర్తానికి ఇంకా సమయం ఉందని విక్రమ్ వాళ్లను దివ్య ఆపుతుంది. దీంతో అతడు ముందుగా వెళ్లగా.. తర్వాత దివ్యను శోభనం గదిలోకి పంపుతారు. వాళ్లు అలా వెళ్లగానే లాస్యను లాక్కుని వెళ్లిన రాజ్యలక్ష్మి ఎలాగైనా నువ్వు శోభనాన్ని ఆపాల్సిందే అంటూ ఆమెకు వార్నింగ్ ఇస్తుంది. ఇక, శోభనం గదిలో దివ్య తనను వదలొద్దు అనగా 'నాకు నువ్వంటే ఇష్టం. ఎప్పటికీ నీ చేయి వదిలిపెట్టను' అని ప్రామిస్ చేస్తాడు. దివ్య ఫస్ట్ నైట్ జరుగుతుందని సంతోషంలో ఉన్న తులసిని లాస్య రెచ్చగొట్టగా.. గట్టి వార్నింగ్ ఇచ్చేస్తుంది.

తులసి గురించి ఏడ్చిన నందూ:తులసి దేవత అని నందూ అనగానే పరందామయ్య 'పోనీలేరా నందూ.. ఇప్పటికైనా తులసి దేవత అని తెలుసుకున్నావు.. ఆ దేవతకు నువ్వంటే ఎంతో నమ్మకంరా.. లేకపోతే నీ కోసం తన ఉద్యోగాన్ని ఎందుకు వదలుకుంటుంది చెప్పు' అని అంటాడు. దీనికి నందూ 'నిజమే నాన్నా.. పెళ్లైనప్పటి నుంచి తులసి నాకు తోడుగా ఉంది. గుడ్డిగా నమ్మింది. నేను నమ్మించి మోసం చేశాను. ఒంటరి దాన్ని చేశాను. విడాకులు ఇచ్చాను. అనుమానంతో పొడుచుకుని తిన్నాను. తన క్యారెక్టర్‌ను కూడా శంకించాను' అని ఎమోషనల్ అయిపోతాడు.

ప్రశాంతంగా బతకనీయండని:నందూ మాటలకు పరందామయ్య 'దొంగలు పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్టు ఇప్పుడు పశ్చాత్తాప పడితే లాభం ఏంట్రా? జరగాల్సింది జరిగిపోయింది. అయినా సరే తులసికి నువ్వంటే కోపం లేదురా. అయినా నీకు లాస్య లాంటిదే కరెక్ట్‌రా. లాస్యతో నీకు విడాకులు ఇప్పించకుండా ఉండి ఉంటే బాగుండురా' అని అంటాడు. దీనికి నందూ 'అయ్యయ్యో వద్దు నాన్నా.. అలా శపించకండి. ఇలా ఒంటరిగా అయినా ప్రశాంతంగా గడపనివ్వండి' అని అంటాడు. అప్పుడు నందూ 'తులసి ఒంటరి బతుక్కి కారణం నేనే. అయినా నా వైపును తులసి ఎందుకు నిలబడుతుంది' అని ప్రశ్నించగా.. పరందామయ్య 'ఆ ప్రశ్న వేయాల్సింది నన్ను కాదురా తులసిని' అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు.

జాబిలమ్మ కనిపిస్తుంది అంటూ:ఫస్ట్ నైట్ తర్వాత దివ్య మత్తుగా పడుకుని ఉంటుంది. కానీ, విక్రమ్ మాత్రం నిద్ర లేచి భార్యను అలానే చూస్తూ ఉంటాడు. ఇంతలోనే ఆమె నిద్ర లేస్తుంది. అప్పుడు 'ఓయ్.. ఏంటి కళ్లు ఆర్పకుండా అలా చూస్తున్నావు ఏంటి సంగతి' అని అడుగుతుంది. దీనికి విక్రమ్ 'జాబిలమ్మ అందంగా కనిపిస్తుంటే ఏం చేస్తాం. నువ్వు చెరువులో కలువ పువ్వు కంటే అందంగా కనిపిస్తున్నావు. అందుకే కళ్లు ఆర్పకుండా చూస్తున్నా' అని అంటాడు. దీనికామె 'కలువ పువ్వు చేతికి అందుతుంటే అలా చూస్తూ వదలేయడం తప్పు కదా' అని రెచ్చగొడుతుంది.
ఐసీయూ ముందు తిరిగినట్లు:విక్రమ్, దివ్య ఉన్న గది ముందర లాస్య, రాజ్యలక్ష్మి తిరుగుతూ ఉంటారు. ఎంతకూ వాళ్లు బయటకు రాకపోవడంతో టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే విక్రమ్ వాళ్ల తాత వచ్చి 'ఏంట్రా.. హాస్పిటల్‌లో ఐసీయూ రూం ముందు తిరిగినట్టు అలా టెన్షన్‌గా తిరుగున్నారేంటి? పొద్దెక్కినా వాళ్లు ఇంకా నిద్ర లేకపోవడం ఏంట్రా.. ఏం జరిగిందంటావు' అని సంజయ్‌తో అంటాడు. అంతలోనే దివ్య చిక్కిరిబిక్కిరిగా వస్తుంది. ఆమెను లాస్య, రాజ్యలక్ష్మి చూసి తెగ రగిలిపోతూ ఉంటారు. వాళ్లను ఉడికించేటట్టుగానే దివ్య ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది.

ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో:ఉదయం కాగానే తులసి కాఫీ తీసుకు వచ్చి అనసూయకు ఇస్తుంది. అక్కడే ఉన్న నందూను పరందామయ్య అనుకుని మామయ్య అని పిలుస్తుంది. దీంతో అనసూయ చెప్పగా చూసుకోలేదు అంటుంది. ఇక, తులసి వెళ్లిపోయిన తర్వాత అనసూయ 'ఇప్పుడు మన మధ్య ఎలాంటి బంధం లేకుపోయినా ఎన్నో సేవలు చేస్తుంది. కన్నవాళ్లే కాదనుకునే రోజుల్లో కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. ఆ లాస్య ఏ రోజైనా మాకు పని చేసిందా' అని నందూ ముందుర అంటుంది. దీంతో నందూ కూడా పశ్చాత్తపపడతాడు.

దివ్య పాయసం.. పస లేదుగా:శోభనం తర్వాత తన భార్యకు అందంగా కనిపించడం కోసం విక్రమ్ తెగ రెడీ అవుతూ ఉంటాడు. అంతలో దివ్య వచ్చి అతడిని ఉడికిస్తూ ఉంటుంది. దీంతో విక్రమ్ ముద్దుల పెళ్లానివి అంటూ మాట్లాడుతుంటాడు. అప్పుడామె 'ఎప్పుడూ ఈ ముద్దుల గోలేనా? ఈ పొగడ్తలకు తక్కువేం లేదు కానీ... ఈ పాయసం తినండి.. నీకు ఇష్టం అని మా అమ్మని ఫోన్‌లో అడిగి మరీ చేశాను' అని ఇస్తుంది. అది తింటూ విక్రమ్ మైమరచిపోయినట్లు నటిస్తాడు. చివర్లో అది లాక్కుని దివ్య టేస్ట్ చేయగా చండాలంగా ఉంటుంది. అప్పుడు విక్రమ్ నిన్ను బాధ పెట్టలేక తింటున్నా అంటాడు.

గతం గుర్తు చేసుకున్న నందూ:నందూకు కెఫేలో పేమెంట్లు ఆగిపోవడంతో తులసిని అడగడానికి వెళ్తాడు. అప్పటికే ఆమె పాత ఆఫీస్‌లో ఫైల్స్ గురించి ఫోన్‌లో మాట్లాడుతూ వంట చేస్తుంది. అప్పుడామె ఇబ్బంది పడుతుండగా నందూ ఫోన్ పట్టుకుని ఆమె వెనకాలే తిరుగుతూ ఉంటే మాట్లాడుతుంది. అది అయిపోయిన తర్వాత మేటర్ చెప్తాడు. తర్వాత తులసి 'దివ్య వాళ్లకు మన ఇంట్లో కూడా ఫస్ట్ నైట్ చేయాలి. మీరు వెళ్లి రాజ్యలక్ష్మి గారిని అడగండి' అంటుంది. దీంతో నందూ రెడీ అవుతూ ఉండగా.. గతంలో తులసి తన కోసం కుట్టిన షర్ట్ తీస్తాడు. అప్పుడు ఆమెను తిట్టింది మొత్తం గుర్తు చేసుకుని బాధ పడతాడు. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











