For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi July 22 Episode: తులసికి సాయం చేస్తానన్న నందూ.. లాస్య మరో కన్నింగ్ ప్లాన్

  |

  ఎన్నో దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఫ్యాక్టరీ తీసుకోవాలన్న తులసి నిర్ణయాన్ని అందరూ అభినందిస్తారు. అంకిత, అనసూయ మాత్రం అడ్డంగా మాట్లాడుతూ ఇబ్బంది పెడతారు. అయినప్పటికీ ఆమె ధైర్యంగా ముందుకెళ్లాలనుకుంటుంది. అంతలో మామగారు ఇంటి పేపర్లు ఇస్తానని భరోసా ఇస్తాడు. ప్రేమ్, శృతి గురించి అంకిత.. అభి దగ్గర చెడుగా చెప్పే ప్రయత్నం చేసినా అతడు వినడు.

  Intinti Gruhalakshmi July 21st Episode: తులసి కోసం మామయ్య సాహసం.. రోడ్డున పడే ప్రమాదంలో కుటుంబం

  వాళ్లకు వార్నింగ్ ఇచ్చిన నందూ తండ్రి

  వాళ్లకు వార్నింగ్ ఇచ్చిన నందూ తండ్రి

  నందూ తండ్రి ఇల్లు తాకట్టు పెట్టుకోమని చెప్పిన మాటలకు అనసూయ, అంకిత అడ్డు చెబుతారు. అంతలో శృతి మాట్లాడగా.. ‘నువ్వు ఇప్పుడుంటావు.. తర్వాత వెళ్లిపోతావు. ఇల్లు పోతే మేము రోడ్డున పడాలి' అంటూ కామెంట్స్ చేస్తుంది. అప్పుడు నందూ తండ్రి ‘అంకిత మీరు ఉద్యోగం చేస్తే డబ్బులు లెక్క కాదు. అంతా వినండి ఇల్లు తాకట్టు పెట్టడం ఖాయం' అంటూ వార్నింగ్ ఇస్తాడు.

  లాస్యకు ఇంటి గురించి చెప్పిన అంకిత

  లాస్యకు ఇంటి గురించి చెప్పిన అంకిత

  నందూ తండ్రి తీసుకున్న నిర్ణయం గురించి అంకిత.. లాస్యకు ఫోన్ చేసి చెబుతుంది. ‘ఇక్కడ తులసి ఆంటీ మిడిసి మిడిసి పడుతున్నారు. బిజినెస్ అంటూ ఇంటిని తాకట్టు పెట్టాలని నిర్ణయించుకున్నారు' అని చెబుతుంది. దీంతో లాస్య ‘అదే జరిగితే ఇంట్లో వాళ్లంతా రోడ్డున పడతారు' అని సంతోష పడుతుంది. ఆ తర్వాత తేరుకుని అవును మీకే ఇబ్బంది అని కవర్ చేస్తుంది.

  రెచ్చగొట్టిన లాస్య.. నందూ షాకింగ్ రిప్లై

  రెచ్చగొట్టిన లాస్య.. నందూ షాకింగ్ రిప్లై

  అంకిత చెప్పిన మాటలు విన్న లాస్య వెంటనే నందూ దగ్గరకు వస్తుంది. అప్పుడు జరిగిన విషయం మొత్తాన్ని అతడికి వివరిస్తుంది. దీంతో నందూ ‘తులసి అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది. పోనీ నేను ఆమెకు సహాయం చేస్తాను' అని అంటాడు. దీనికి లాస్య అభ్యంతరం వ్యక్తం చేయగా.. ‘నా వాళ్లు రోడ్డున పడకుండా ఉండేందుకే అలా చేస్తానని అన్నాను' అంటూ వివరిస్తాడతను.

  తులసి పునరాలోచన.. నందూ వార్నింగ్

  తులసి పునరాలోచన.. నందూ వార్నింగ్

  ఇల్లు తాకట్టు పెట్టాలన్న నిర్ణయాన్ని తులసి పునరాలోచిస్తుంది. ఈ విషయం మామకు చెబుతుండగా.. నందూ లాస్యతో కలిసి ఎంట్రీ ఇస్తాడు. వచ్చీ రావడమే ఇల్లు విషయాన్ని ప్రస్తావిస్తాడు. అంతేకాదు, ‘ఇల్లు తాకట్టు పెట్టి అందరి లైఫ్‌లను రిస్కులో పెడతానంటే నేను ఒప్పుకోను. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకో తులసి' అంటూ ఆమెకు వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు.

  మీ దానం నాకొద్దు.. అంతా వచ్చేయండి

  మీ దానం నాకొద్దు.. అంతా వచ్చేయండి

  తులసిపై కోప్పడుతూనే నందూ ‘ఇల్లు తాకట్టు పెట్టే నిర్ణయం మానుకో. కావాలంటే మూడు నెలలు ఆగిన తర్వాత ఎంతో కొంత నేనే నీ ముఖాన్న పడేస్తాను' అని చెబుతాడు. దీనికి తులసి ‘మీ దానం నాకద్దు' అని అంటుంది. అప్పుడు నందూ ‘చూశారా నాన్న ఎంత పొగరుగా మాట్లాడుతుందో. ఇప్పుడైనా అందరూ నాతో వచ్చేయండి. మిమ్మల్ని చక్కగా చూసుకుంటా' అంటాడు.

  వర్షతో లవ్ ట్రాకుపై నోరుజారిన ఇమాన్యూయేల్: అందుకే ప్రేమిస్తోందని క్లారిటీ.. పాపం ఆమె కూడా బుక్

  మీ లాంటి అలవాటు వాళ్లకు లేదు అంటూ

  మీ లాంటి అలవాటు వాళ్లకు లేదు అంటూ


  నందూ తమను ఇంటికి రమ్మనగానే తండ్రి ‘నీకూ మాకు ఏ బంధం ఉందని రమ్మంటున్నావు. నువ్వు ఎప్పుడైతే వేరే అమ్మాయితో వెళ్లిపోయావో అప్పుడో మన బంధం పోయింది' అని అంటాడు. దానికి ప్రేమ్ కూడా మద్దతిచ్చేలా మాట్లాడతాడు. ఆ తర్వాత తులసి ‘మీలా వదిలేసి వెళ్లే అలావాటు ఇక్కడి వాళ్లకు లేదు. అందుకే వీళ్లంతా నాతో ఉంటానంటున్నారు' అని బదులు ఇస్తుంది.

  నందూ వార్నింగ్.. వాళ్లు మాత్రం అండగా

  నందూ వార్నింగ్.. వాళ్లు మాత్రం అండగా

  తర్వాత నందూ ‘నీకు ఒక్క రోజు టైమ్ ఇస్తున్నా తులసి. అందరినీ నా దగ్గరకు పంపించు' అని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు పిల్లలు మాత్రం తులసితోనే ఉంటామని చెబుతారు. ఆ తర్వాత లాస్య భాగ్య మధ్య చర్చ జరుగుతుంది. అప్పుడు లాస్య ‘వాళ్లు వస్తే తులసి ఏకాకి అవుతుంది. రాకపోతే నందూను రెచ్చగొట్టొచ్చు. సో ఏది జరిగినా తులసిని దెబ్బకొడతాను' అని ప్లాన్ చేస్తుంది. తర్వాత ఈ విషయంపై అభికి, అంకితకు గొడవ జరుగుతుంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 378: Nandu Father Ready to Gave House Papers to Tulasi. But Ankitha, Anasuya and Nandu Fired on This Decision. Then Lasya Created a Plan Opposite Tulasi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X