Intinti Gruhalakshmi: మూడ్ రావట్లేదు.. తులసితో నందూ.. దివ్య విక్రమ్ హనీమూన్.. లాస్య కొత్త నాటకం
ఇండియాలో చాలా భాషలు ఉన్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి గొప్పదనం గురించి పరందామయ్య నందూకు వివరిస్తాడు. తర్వాత తెల్లారిన తర్వాత కూడా విక్రమ్ వాళ్లు గదిలో నుంచి రాకపోవడంతో రాజ్యలక్ష్మి వాళ్లు టెన్షన్ పడుతుంటారు. అప్పుడే వచ్చిన దివ్య వాళ్లను మరింతగా ఉడికించేలా మాట్లాడుతుంది.
తర్వాత దివ్య పాయసం చేసి ఇవ్వగా అది బాగోకపోయినా విక్రమ్ చెప్పడు. అది తెలిసిన దివ్య ఎంతో ఎమోషనల్ అవుతుంది. ఇక, దివ్య వాళ్లను మన ఇంటికి తీసుకు రావాలని నందూతో తులసి చెప్తుంది. అప్పుడు అతడు గతంలో తులసిని తిట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు.

వద్దన్నా మూడ్ వస్తుంది అంటూ: తులసి కుట్టిన షర్ట్ చూస్తూ నందూ గతాన్ని గుర్తు చేసుకుంటాడు. ఆ సమయంలో తులసిని 'మొగుడుకు షర్ట్ కుట్టాలన్న ఆరాటం ఉంటే సరిపోదు. అందుకు తగ్గ టేస్ట్ కూడా ఉండాలి. టేస్ట్ అంటే ఇలా ఉండాలి. లాస్య నాకు గిఫ్ట్‌గా ఇచ్చింది. దీన్ని చూడగానే ముద్దుపెట్టుకోవాలని అనిపిస్తుంది' అని అంటాడు. దీంతో తులసి ఎవరిని అని అడుగుతుంది.
దీనికతడు షర్ట్‌ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది' అంటాడు. ఆ మాటతో తులసి 'హో అంతే కదా.. హమయ్య' అనగా.. 'చూడు తులసీ.. నువ్వు కూడా పాత చింతకాయ పచ్చడిలా ఉండకుండా అప్డేట్ అవ్వు. అప్పుడు నువ్వు వద్దన్నా మూడ్ వస్తుంది' అని అంటాడు.

పనికిమాలిన ప్రయోగాలు వద్దని: నందూ మాటలకు తులసి 'ఎంతసేపూ మీ టేస్ట్‌లే తప్ప ఎదుటి వాళ్ల ఇష్టాల గురించి పట్టించుకోరు గౌరవించరు' అని అంటుంది. దీంతో నందూ 'ఎందుకు గౌరవించను. నువ్వు ఇల్లు బాగా ఊడుస్తావు. వడియాలు, అప్పడాలు బాగా పెడతావు. వంట బాగానే చేస్తావు. ఇదంతా గౌరవించడమే కదా. నీది మొగుడికి షర్ట్ గుండీలు ఊడిపోతే కుట్టే లెవల్ కానీ.. మొగుడుకు షర్ట్ కుట్టే లెవల్ కాదు. ఇలాంటి పనికి మాలిని ప్రయోగాలు ఎప్పుడూ చేయకే' అని అసహ్యించుకుంటూ వెళ్లిపోతాడు. దీంతో తులసి బాధపడుతుంది.
తులసిని సర్‌ప్రైజ్ చేయాలని: గతాన్ని గుర్తు చేసుకున్న తర్వాత నందూ 'అహంకారంతో దిగజారిపోయాను. స్వచ్ఛమైన ప్రేమ విలువ తెలుసుకోలేకపోయాను. మాయలో పడి కొట్టుకుని పోయాను. అదే నిజమైన ప్రేమ అనుకున్నాను. చేతులు కాలాక కానీ తెలియలేదు నేను చేసిన తప్పు ఏంటో.
నా షర్ట్ గుండీలు కుట్టే స్థాయి అని తులసిని ఎగతాళి చేశాను. అంతలా అవమానించినా అన్నీ మర్చిపోయి నువ్వు నాకు అండగా నిలబడ్డావు. నీ స్థాయిని నేను జీవితంలో అందుకోలేను తులసి. ఈరోజు ఈ షర్ట్ వేసుకుని నిన్ను సర్‌ప్రైజ్ చేస్తాను. నా కళ్లల్లో పశ్చాత్తాపం నీకు తెలిసేలా చేస్తాను' అంటాడు.
పట్టని షర్ట్.. సన్నగా అవ్వాలని: తులసి షర్ట్ తీసుకుని వేసుకుంటూ ఉండగా అది నందూకు పట్టదు. దీంతో దానికి ఉన్న బటన్ ఒకటి ఊడిపోతుంది. దీంతో నందూ 'అంతా భ్రమేనా.. నా అహంకారంతో మరీ ఇంత బలిశానని అనుకోలేదు. ఇక నుండి డైటింగ్ చేసి ఈ షర్ట్ బటన్స్ పట్టేలా సన్నగా అవుతాను. నన్ను చూసి తులసి కూడా ఆశ్చర్యపోవాలి. నన్ను కన్ను ఆర్పకుండా చూడాలి' అని అనుకుంటాడు. తర్వాత రాములమ్మ దగ్గరకు వెళ్లి తన ఫుడ్ డైట్ గురించి చెప్తాడు. దీంతో రాములమ్మ నందూ బాబు ఇప్పుడు సన్నగా అయ్యేది ఎవరి కోసం అంటుంది. దీంతో పరందామయ్య నవ్వుకుంటాడు.
అమ్మ తర్వాతనే ఎవరైనా అని: రాజ్యలక్ష్మి 'ఇన్నాళ్లూ దివ్య ఫస్ట్ నైట్ జరక్కుండా ఆపడానికి హాస్పిటల్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాను. అది దొంగదెబ్బ తీసి ఫస్ట్ నైట్ జరిపించుకుంది. ఇంక ఇంట్లో ఉండి ఏం చేస్తా? నా కొడుక్కి ఆస్తి వచ్చే వరకూ ఆ దివ్యను వదిలిపెట్టేదే లేదు. పదరా సంజయ్ హాస్పిటల్‌కి వెళ్దాం' అని అంటుంది. ఇంతలో విక్రమ్ వచ్చి 'అదేంటమ్మా.. నేను లేకుండా వెళ్తున్నారు' అని అడగ్గా.. నువ్వు దివ్యతో బిజీగా ఉంటావ్ కదా అని డిస్ట్రబ్ చేయలేదు నాన్నా అంటుంది. దీనికతడు 'ఎంత బిజీగా ఉన్నా అమ్మ తర్వాతే ఎవరైనా? ఎప్పటికైనా సరే' అని బదులిస్తాడు.

హనీమూన్.. ఆస్పత్రి బాధ్యతలే: ఆ తర్వాత తల్లితో విక్రమ్ దివ్యను కూడా ఆస్పత్రికి తీసుకుని వెళ్లమంటాడు. కానీ, రాజ్యలక్ష్మి 'చూడు నాన్నా.. ఇప్పుడు దివ్య హాస్పిటల్‌కు రావాల్సినంత అవసరం ఏముంది? దివ్య ప్లేస్‌లో వేరే డాక్టర్‌ను తీసుకున్నాం. కొత్త కాపురాన్ని ఎంజాయ్ నీయండి.. ఏ వయసులో ముచ్చట ఆ వయసులోనే తీర్చుకోవాలి' అని అంటుంది.
అయినా ఇప్పుకోకపోవడంతో లాస్య 'విక్రమ్ మీకు మీ అమ్మ సర్‌ప్రైజ్ ఇద్దాం అనుకున్నారు. మీకు చెప్పకూడదని అనుకున్నారు. కానీ దివ్య మొండితనం వల్ల చెప్పకతప్పడం లేదు. ఫస్ట్ నైట్ కాగానే.. మిమ్మల్ని హనీమూన్‌కు పంపాలని ప్లాన్ చేసింది. యూరప్ పంపించాలని అనుకున్నది' అని చెబుతుంది. తర్వాత రాజ్యలక్ష్మి 'మీ హనీమూన్ అయ్యాక.. దివ్యకు ఆస్పత్రి బాధ్యతలు అప్పగించేస్తాను' అని అంటుంది.
ఫస్ట్ నైట్ తర్వాత మా ఇంట్లోనే: ఫస్ట్ నైట్ తర్వాత దివ్య, విక్రమ్‌ను తమ ఇంటికి తీసుకు వెళ్లేందుకు తులసి, నందూ వస్తారు. అప్పుడు వాళ్లు రాజ్యలక్ష్మికి చెప్పి పర్మీషన్ ఇవ్వమని అడుగుతారు. కానీ, బసవయ్య, లాస్య పుల్లులు పెట్టే ప్రయత్నాలు చేస్తారు. దీంతో విక్రమ్ తాత 'పెళ్లైనప్పటి నుంచి దివ్య పుట్టింట్లో నిద్ర చేయలేదు. ఫస్ట్ నైట్ అయిపోయింది కాబట్టి అభ్యంతరం చెప్పడానికి ఏముంది' అని ప్రశ్నించగా.. రాజ్యలక్ష్మి 'నేను విక్రమ్‌తో మాట్లాడి చెప్తా' అంటుంది.
అప్పుడు విక్రమ్ 'వాళ్లు అడుగుతున్నారు కదా. వెళ్లి వచ్చేస్తాం' అంటాడు. దీంతో చేసేదేం లేక రాజ్యలక్ష్మి ఓకే అంటుంది. కానీ, వాళ్లను సాయంత్రం పంపిస్తా అని చెప్తుంది. దీంతో తులసి వాళ్లు వెళ్లిపోతారు. అప్పుడు హనీమూన్ ఐడియా ఇచ్చిన లాస్యపై రాజ్యలక్ష్మి ఫైర్ అవుతుంది. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











