For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi July 23rd Episode: లాస్య సూచనతో అంకిత ప్లాన్ అమలు.. తులసి ఇంట్లో పెద్ద గొడవ

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూ తండ్రి ఇంటి పేపర్లను తులసికి ఇవ్వడానికి రెడీ అవుతాడు. అప్పడు అంకిత, అనసూయ దీనికి అడ్డు పడతారు. ఆ సమయంలో నందూ కూడా అక్కడకు వచ్చి గొడవ పెట్టుకుంటాడు. అంతేకాదు, ఒక్కరోజులో తన వాళ్లందరినీ పంపించేయాలని తులసికి వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత లాస్య, భాగ్యతో కలిసి కన్నింగ్ ప్లాన్ రెడీ చేస్తుంది.

  ఇంటిని ముక్కలు చేయాలని అంకిత

  ఇంటిని ముక్కలు చేయాలని అంకిత

  తులసి ఇంటిని ముక్కలు చేయాలని భావిస్తోన్న అంకిత.. ఇంట్లో పెద్ద గొడవను పెడుతుంది. ఇంట్లో నుంచి అందరం నందూ అంకుల్ దగ్గరకు వెళ్లిపోదాం అని రచ్చ చేస్తుంది. దీనికి ప్రేమ్ అడ్డు పడతాడు. ఈ క్రమంలోనే ‘అమ్మకు అండగా ఉండాల్సిన సమయంలో వదిలేసి వెళ్దాం అంటున్నావు. మీ అమ్మ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే వదిలేస్తావా' అంటూ వదినపై ఫైర్ అవుతాడు.

  యంగ్ హీరోతో ‘గృహలక్ష్మి' ఫేం లాస్య పెళ్లి: అప్పటి ఇప్పటి బాయ్‌ఫ్రెండ్.. ఈరోజు కోసమే మా నాన్న అంటూ!

  తమ్ముడికి అభి సపోర్ట్... తులసి ఫైర్

  తమ్ముడికి అభి సపోర్ట్... తులసి ఫైర్

  ఎంత చెప్పినా అంకిత వినకపోవడంతో ప్రేమ్ అబార్షన్ మేటర్‌ను తీసుకొస్తాడు. అప్పుడామె ‘చూశావా అభి.. ప్రేమ్ ఎన్నెన్ని మాటలు అంటున్నాడో' అని అంటుంది. దీనికి అభి ‘నువ్వు చేసిన తప్పును ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నా. మళ్లీ దాని గురించి నీకు సపోర్ట్ చేయాలా' అని తమ్ముడికే సపోర్ట్ చేస్తాడు. అంతలో తులసి అక్కడకు వచ్చి ప్రేమ్‌ను బాగా తిట్టి గొడవను ఆపేస్తుంది.

  తులసిపై నందూను రెచ్చగొట్టిన లాస్య

  తులసిపై నందూను రెచ్చగొట్టిన లాస్య

  మరోవైపు, తులసి విషయంపై నందూ, లాస్య మధ్య చర్చ జరుగుతుంది. అప్పుడు అతడిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ‘మీ ఇంట్లో వాళ్లందరినీ తులసి మాయ చేస్తుంది. వాళ్లను ఇక్కడకు రాకుండా అడ్డుకుంటుంది. వాళ్ల మనసులు మార్చే ప్రయత్నాలు చేస్తుంది' అంటూ రెచ్చగొడుతుంది. దీంతో నందూ ‘చూద్దాం రేపటికల్లా రాకపోతే ఏం చేయాలో అది చేస్తా' అంటూ బదులిస్తాడు.

  అంకితకు లాస్య సలహా.. వెళ్లిపోతానని

  అంకితకు లాస్య సలహా.. వెళ్లిపోతానని

  ఇంట్లో జరిగిన గొడవను లాస్యకు ఫోన్ చేసి చెబుతుంది అంకిత. ఆ సమయంలో ప్రేమ్ చాలా కోపంగా ఉన్నాడని అంటుంది. దీంతో లాస్య, అంకితకు కొన్ని సలహాలు ఇస్తుంది. దీంతో కచ్చితంగా ఇలానే చేస్తాను అని చెబుతుందామె. అందుకు అనుగుణంగానే ఇంట్లో నుంచి వెళ్లిపోడానికి రెడీ అవుతుంది అంకిత. భర్త అభి ఎంత చెప్పినా వినకుండా తన ఇంటికి పయనం అవుతుందామె.

  లేలేత అందాలతో కవ్విస్తోన్న నభా నటేష్: అలాంటి ఫొటోలతో రచ్చ చేసిన ఇస్మార్ట్ బ్యూటీ

  అవమానం జరిగింది... సారీ చెప్పాలని

  అవమానం జరిగింది... సారీ చెప్పాలని

  అంకిత తన ఇంటికి వెళ్లిపోతానంటుండగా.. అందరూ వద్దని నాలుగు మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తారు. దీంతో ‘నన్ను అన్నవారు సంతోషంగా తిరుగుతుంటే తట్టుకోలేకపోతున్నా' అని అంటుంది. అప్పుడు అభి ‘ఏంటి అంకిత? ఇప్పుడు వాడు నీకు సారీ చెప్పాలా' అని అడుగుతాడు. దీంతో తులసి.. ప్రేమ్‌ను అంకితకు సారీ చెప్పమని అరవడంతో అతడు క్షమాపణ కోరుతాడు.

  తులసికి లాస్య ఫోన్... భయ పెడుతూ

  తులసికి లాస్య ఫోన్... భయ పెడుతూ

  ఇంట్లో బాధగా ఉన్న తులసికి లాస్య ఫోన్ చేస్తుంది. ఆ సమయంలో ‘ఏంటి ఏడుస్తున్నావా తులసి' అని అడుగుతుంది. అప్పుడామె ‘అలాంటి పరిస్థితులు ఇక్కడ లేవు' అంటూ బదులిస్తుంది. అలా ఇద్దరి మధ్యా మాటలు తారాస్థాయికి చేరుతాయి. చివర్లో ‘నీ ఇంట్లో వాళ్లంతా ఇక్కడకు వస్తే తర్వాత ఏం జరుగుతుందో తెలుసా' అంటూ భయపెడుతుంది. దీంతో తులసి ఆలోచనలో పడుతుంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 379: Prem Serious about Ankitha Decision. Then He Argue to her. After That She Asked Apology from Prem. That Time He Says Sorry to her. After That Lasya Did Phone Call to Tulasi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X