For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi July 24th Episode: తులసిని భయపెట్టిన లాస్య.. నందూకు షాకిచ్చిన దివ్య.. కథ మలుపు

  |

  ఎన్నో ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూ ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న అంకితకు, ప్రేమ్‌కు మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. దీంతో ఆమె క్షమాపణ కోరుతుంది. తులసి ఆదేశాల వల్ల ప్రేమ్ సారీ చెబుతాడు. ఇక, ఇక్కడి విషయాలను లాస్యకు ఫోన్ చేసి చెబుతుంది అంకిత. ఆమె కొన్ని సలహాలు ఇస్తుంది. ఆ తర్వాత లాస్య, తులసికి ఫోన్ చేసి భయపెట్టే ప్రయత్నం చేస్తుంది.

  Guppedantha Manasu July 23rd Episode: బుద్ధి లేదా అంటూ వసుపై జగతి ఆగ్రహం.. ఆమెను మెచ్చుకున్న రిషి

  పగ తీర్చుకుంటాను.. దెబ్బకు రెండు

  పగ తీర్చుకుంటాను.. దెబ్బకు రెండు

  తులసికి ఫోన్ చేసిన లాస్య.. ‘అందరూ నా ఇంటికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఇక్కడ అందరికీ నరకం చూపిస్తాను. నేనేదీ మర్చిపోలేదు తులసి. నువ్వు నన్ను బయటకు గెంటేస్తుంటే ఎవరూ ఆపలేదు. దీంతో అందరిపై పగ తీర్చుకుంటాను. ఒక రకంగా నేను నందూను రెచ్చగొట్టి మంచి పని చేశాను. ఒక దెబ్బకు రెండు పిట్టలు పడినట్లైంది' అంటూ భయపెట్టేలా మాట్లాడింది.

  బాధ పడుతోన్న ప్రేమ్.. శృతి ఓదార్పు

  బాధ పడుతోన్న ప్రేమ్.. శృతి ఓదార్పు

  అంకిత చేసిన పనికి ప్రేమ్ బాధ పడుతుండగా శృతి అక్కడకు వచ్చి ‘నువ్వు, అభి, దివ్య ఈ ఇంటి పిల్లలు. అంకిత బయట నుంచి వచ్చిన అమ్మాయి. కాబట్టి ఆమె సరిగా ఉండలేకపోతోంది. దానికి ఎందుకు బాధ పడాలి ప్రేమ్' అని అంటుంది. అప్పుడు ప్రేమ్ ‘వదిన ఎందుకు ఇలా మారిపోయిందో అర్థం కావట్లేదు' అని అంటాడు. దీనికి అంకిత ప్లాన్‌ను మనసులోనే ఉంచుకుంటుంది శృతి.

  ఇంటి పేపర్లతో తులసి... తెగించావని

  ఇంటి పేపర్లతో తులసి... తెగించావని

  ఇంటి పేపర్లను చూస్తూ తనలో తానే బాధ పడుతుంటుంది తులసి. అంతలో అనసూయ ఎంట్రీ ఇచ్చి ‘ఏంటే వాటిని చూసి తెగ సంబర పడుతున్నావు. ఆస్తులన్నీ నీ పేరు మీద ఉన్నాయనే కదా విర్రవీగుతున్నావు. నువ్వు బాగా తెగించావే' అని నోరు పారేసుకుంటుంది. అప్పుడు తులసి ‘నాకు ఇవి వట్టి పేపర్లే. ఇల్లు నా పేరు మీదున్నా.. మామగారిదే ఈ ఇల్లు' అని సమాధానమిస్తుంది.

  నీ పీడ ఎప్పుడు విరగడ అవుతుందో

  నీ పీడ ఎప్పుడు విరగడ అవుతుందో

  అత్త మాటలకు తులసి మాట్లాడుతూ.. ‘ఎక్కడి నుంచో వచ్చిన లాస్య మనసు మీకు అర్థం అవుతుంది. మీ బాగోగులే నా బాగోగులు అనుకున్న నా మనసు మాత్రం మీకు అర్థం కాదు కదా' అంటుంది. అప్పుడు ‘నువ్వు ఎప్పుడు వదిలేసి వెళ్లిపోతావు. నువ్వనే దానివి లేకపోతే నా కొడుకు సంతోషంగా ఉండేవాడు. నీ పీడ ఎప్పుడు విరగడ అవుతుందో' అంటూ అనసూయ తిడుతుంది.

  టాప్ తీసేసి అమీ జాక్సన్ రచ్చ: అందాలు మొత్తం కనిపించేలా ఫోజులు.. ఇది మామూలు రచ్చ కాదుగా!

  నందూ ఎంట్రీ... దివ్య ప్రశ్నలకు షాక్

  నందూ ఎంట్రీ... దివ్య ప్రశ్నలకు షాక్

  తర్వాత రోజు నందూ, లాస్యతో కలిసి తులసి ఇంటికి వస్తాడు. నాతో రమ్మన్నానుగా రండి అంటాడు. దీనికి నీతో రావడానికి ఎవరూ సిద్ధంగా లేరు అని తండ్రి బదులిస్తాడు. అప్పుడు దివ్య కూడా మామ్ దగ్గరే ఉంటానంటుంది. దీనికి నందూ ఏ నా అవసరం నీకు లేదా అని అడుగుతాడు. అప్పుడు దివ్య ‘మీరే ముందు నన్ను వదిలేసి వెళ్లారు కదా డాడ్' అని ఎన్నో రకాలుగా ప్రశ్నిస్తుంది.

  నాకు మామ్‌తోనే ఉండాలని ఉందని

  నాకు మామ్‌తోనే ఉండాలని ఉందని

  దివ్య మాట్లాడుతూ ‘ఆరోజు మీరు లాస్య ఆంటీతో వెళ్లిపోయారు. అప్పుడు నేనెంత బాధ పడ్డానో తెలుసా? ఎంతగా ఏడ్చానో తెలుసా' అని అడుగుతుంది. అప్పుడు నందూ సీరియస్ అవుతాడు. అదే సమయంలో లాస్య స్పందిస్తూ.. ‘బాగానే ఎదిగిపోయావ్ దివ్య. మీ నాన్ననే ఎదురిస్తున్నావ్' అంటుంది. దీంతో ప్రేమ్ కూడా కలుగజేసుకుని తండ్రిపై ఫైర్ అవుతూ ప్రశ్నలు కురిపిస్తాడు.

  పేపర్లను మామకు ఇచ్చేసిన తులసి

  పేపర్లను మామకు ఇచ్చేసిన తులసి

  అందరూ గొడవ పడుతోన్న సమయంలో తులసి ఇంటి పేపర్లతో అక్కడకు వస్తుంది. రావడమే వాటిని తన మామ చేతిలో పెట్టి ‘అప్పుడు ఇవి నాకిచ్చే సమయంలో ఇంటిని ముక్కలు కాకుండా చూడమన్నారు. కానీ, నేను అలా చేయలేకపోయాను. ఎవరికి వారు అయిపోతున్నారు. కాబట్టి ఇవి మీకే ఇచ్చేస్తున్నా. నేనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నా' అని అందరికి షాకిస్తుంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 380: Prem and Shruthi Discussed about Ankitha Decision. After That Nandu and Lasya Came To Tulasi House. Then Tulasi Gave Property Document to Nandu Father
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X