Intinti Gruhalakshmi: దివ్య ఇంటికి వెళ్లకుండా ప్లాన్.. లాస్య మాటకు విక్రమ్ ఓకే.. ఆ ప్రామిస్ చేయడంతో!

దాదాపు ఇరవై ముప్పై ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. గతంలో తులసి తన కోసం షర్ట్ కుట్టిన విషయాన్ని నందూ గుర్తు చేసుకుంటాడు. అప్పుడు అతడు ఆమెను తిట్టినది తలుచుకుని బాధ పడతాడు. అంతేకాదు, తులసి అప్పుడు కుట్టిన షర్ట్‌ను ఇప్పుడు వేసుకుంటాడు. ఇక, దివ్యను ఆస్పత్రికి తీసుకు వెళ్లమని తల్లితో విక్రమ్ చెప్తాడు. కానీ, ఆమె వద్దని అంటుంది. అప్పుడు లాస్య దివ్య, విక్రమ్‌ హనీమూన్ ప్లాన్ చేశామని చెప్తారు. అది అయ్యాక ఆస్పత్రి బాధ్యతను కూడా దివ్యకే ఇస్తానని రాజ్యలక్ష్మి అంటుంది. ఇక, రెండో నైట్ కోసం దివ్య వాళ్లను తులసి తన ఇంటికి తీసుకెళ్తానని అంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode July 24th 2023

తులసి ఇంటికి వెళ్లకుండా ప్లాన్:ఆరంభంలో రాజ్యలక్ష్మి 'విక్రమ్.. తులసి ఇంటికి వెళ్లాడంటే ఆ తల్లీ కూతుళ్లు వాళ్ల దారిలోకి తెచ్చుకుని నాకు దూరం చేస్తారు. ఏదోటి చేసి వాళ్లను ఆ ఇంటికి వెళ్లకుండా ఆపాలి' అని లాస్యతో అంటుంది. దీంతో లాస్య 'ఇప్పుడు మన కావాలని అడ్డం పడుతున్న విషయం విక్రమ్‌కు తెలిస్తే.. మనకు అడ్డం తిరుగుతాడు. ఉన్నది ఒక్కటే మార్గం. మనం హనీమూన్ అన్నాం కాబట్టి ఎంత త్వరగా టికెట్స్ బుక్ చేస్తే అంత త్వరగా వాళ్లను ఆపొచ్చు. ఆ వంకతో వాళ్లను అత్తారింటికి వెళ్లకుండా చేయొచ్చు' అని అంటుంది.

దివ్యను పని మనిషిని చేస్తాను:లాస్య మాటలకు రాజ్యలక్ష్మి 'నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లను నేను హనీమూన్‌కు పంపను. ఆ దివ్య నా కొడుకు సంజయ్ జీవితం నాశనం చేసింది. అలాంటి దాన్ని నేను ఎలా సంతోషంగా ఉండనిస్తాను? నా కొడుకును ఈ ఇంటి పని మనిషి హోదాకి సరిపోయే ప్రియకి ఇచ్చి పెళ్లి చేసింది. వాడి జీవితంలో ముద్దు ముచ్చట లేకుండా చేసింది. కాబట్టి అది జీవితాంతం ఈ ఇంటి పని మనిషిగా బతకాల్సిందే. అదే నా టార్గెట్.. దానికి తగ్గట్టు ప్లాన్ చెప్పు' అని అంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode July 24th 2023

వేరే మార్గం లేదు రాజ్యలక్ష్మి:రాజ్యలక్ష్మి ప్లాన్ చెప్పడమనడంతో లాస్య 'నా దగ్గర ఏమైనా మ్యాజిక్ బ్యాక్స్ ఉందా చేత్తో తీసి ఇవ్వడానికీ. ముందు మనం విక్రమ్‌ను అత్తారింటికి వెళ్లకుండా ఆపడం కంటే మార్గం లేదు రాజ్యలక్ష్మీ. ముందు మనం హనీమూన్ టికెట్స్‌ తీసి ఆ వంకతో వాళ్లను ఆపేద్దాం. ఆ తర్వాత వాళ్లను హనీమూన్ వెళ్లకుండా ఆపే బాధ్యత నాది' అని చెప్తుంది. దీంతో రాజ్యలక్ష్మి 'నిన్ను నమ్మొచ్చా' అని అనగా.. లాస్య 'అంతకంటే వేరే మార్గం లేదు' అని అంటుంది. దాంతో సరే కానివ్వు అని అంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode July 24th 2023

రాత్రికి ఏర్పాట్లు చేయాలంటూ:దివ్య వాళ్లు వస్తున్నారన్న సంతోషంతో ఇంటికి వచ్చిన తులసి 'సాయంత్రానికి పిల్లలు ఇంటికి వస్తున్నారు. మన ఇంట్లో మూడు రోజులు ఉంటారు. ఆ తర్వాత హనీమూన్‌కు పంపిస్తారట' అని చెప్తుంది. దీంతో అనసూయ, పరంధామయ్యలు సంతోషిస్తారు. ఆ తర్వాత తులసి 'ఇల్లు కడగాలి.. ముగ్గులెట్టాలి.. అల్లుడికి మర్యాదలు చేయాలి.. రాత్రికి ఏర్పాట్లు చేయాలి. పెళ్లాయ్యాక తొలిసారి ఇంటికొస్తున్నారు. ఆ ఆరాటం ఉంటుంది కదా' అంటూ తెగ హడావిడి చేస్తుంది. అప్పుడు నందూ తులసికి నేను హెల్ప్ చేస్తాను అని అంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode July 24th 2023

టికెట్లు బుక్ చేయించిన లాస్య:విక్రమ్‌ను తీసుకుని దివ్య ఇంటికి వెళ్లేందుకు రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడు రాజ్యలక్ష్మి 'నా కొడుకు హోదాకు భంగం కలగకుండా చూసుకో' అని చెప్తుంది. ఇంతలో లాస్య వచ్చి 'నువ్వు విక్రమ్ గురించి దిగులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు' అనగా.. ఏ నువ్వు కూడా వెళ్తున్నావా ఏంటీ అని అంటుంది. అప్పుడు లాస్య 'అసలు విక్రమ్ వెళ్తే కదా.. వాళ్ల హనీమూన్ టికెట్స్ బుక్ చేసుకొచ్చాను' అని షాకిస్తుంది. దీంతో రాజ్యలక్ష్మి నటిస్తూ 'అదేంటి.. అత్తారింటికి వెళ్లొచ్చిన తర్వాత కదా హనీమూన్ అనుకున్నాం' అనగా.. దివ్య మర్చిపోయిందనుకుంటా అంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode July 24th 2023

వద్దంటే ఐదు లక్షలు పోతాయ్:దివ్య మాటలకు లాస్య 'నేను మర్చిపోవడం కాదమ్మా. నువ్వు పుట్టింటి ప్రయాణం మర్చిపోవాలి. మీ హనీమూన్ టికెట్స్ ప్రయాణం ఎల్లుండే' అని అంటుంది. దీంతో దివ్య వచ్చే వారం అన్నారుగా అనడంతో 'వచ్చే వారానికి దొరకలేదు. లక్కీగా ఎల్లుండే దొరికాయి. అనవసరంగా వెయిట్ చేయడం ఎందుకని బుక్ చేశా. నేను మీరు అత్తారింటికి వెళ్లడం కంటే హనీమూన్ ముఖ్యం అనుకున్నా. అందుకే మమ్మిల్ని అడక్కుండానే బుక్ చేసేశా. సారీ విక్రమ్.. వద్దంటే క్యాన్సిల్ చేస్తా. పోతే పోతాయి ఐదు లక్షలు' అని అంటుంది. దీంతో విక్రమ్ తప్పక ఒప్పుకుంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode July 24th 2023

తులసి ఏర్పాట్లు.. బర్త్‌డే కోసం:దివ్య వాళ్లు వస్తుండడంతో నందూ, తులసి కలిసి ఏర్పాట్లు చేస్తుంటారు. అప్పుడు బెడ్‌ను డెకరేషన్ చేస్తూ గతంలో తమ మధ్య జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. అప్పుడు దివ్యకు ఫోన్ చేయాలి అనుకుంటూ ఉండగా.. ఆమె తల్లికి ఫోన్ చేసి రావట్లేదని చెప్తుంది. దీంతో తులసి వాళ్లు బాధ పడుతూ ఉంటారు. ఇక, పుట్టింటికి వెళ్లడం లేదని దివ్య బాధపడుతుంది. అప్పుడు విక్రమ్‌ దగ్గరకు తీసుకోగా.. 'రేపు మా నాన్న బర్త్‌డే. మనం వెళ్తే మంచిగా చేద్దాం అనుకున్నా' అంటుంది. దీంతో విక్రమ్ 'మనం హనీమూన్‌కు వెళ్లేది ఎల్లుండి కదా. రేపు మీ ఇంటికి వెళ్లి వచ్చేద్దాం' అంటాడు. దీంతో దివ్య సంతోషిస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూరైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X