Intinti Gruhalakshmi Today Episode: నందూ, లాస్యకు సామ్రాట్ షాక్.. తులసికి మాత్రం గుడ్ న్యూస్
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేద్దాం మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. సామ్రాట్ వాళ్ల బాబాయి హనీని తీసుకుని తులసి ఇంటికి వస్తాడు. ఆ చిన్నారికి సంగీతం నేర్పించమని అడుగుతాడు. దీనికామె కుదరదు అంటుంది. అప్పుడు ఆయన అభయం ఇవ్వడంతో ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ప్రేమ్.. శృతి కోసం రోడ్ల మీద వెతుకుతూ ఉంటాడు. మరోవైపు, తులసి.. అభికి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటుంది. దీంతో అతడు రానని అంటాడు. అప్పుడు తులసి.. నువ్వు వచ్చి అంకితతో మాట్లాడి ఏదైనా నిర్ణయం తీసుకో అంటుంది. గాయత్రి కూడా అదే చెప్పడంతో అభి వెళ్లేందుకు సిద్ధం అవుతాడు.

తులసి ప్రవర్తనకు సామ్రాట్ ఫిదా
నందూ ఇచ్చిన ప్రకటనతో ఇంటర్వ్యూకు చాలా మంది వస్తారు. అది చూసిన సామ్రాట్ వాళ్ల బాబాయి 'ఏమో అనుకున్నా కానీ ఇంటర్వ్యూకి చాలామంది వచ్చారు. నిజంగా ఎంతమంది సామ్రాట్‌లు ఉంటారు అని నేను అనుకోలేదు' అని అంటాడు. కానీ, సామ్రాట్ మాత్రం దీర్ఘంగా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. దీంతో సామ్రాట్ అని పెద్దగా పిలుస్తాడు. అప్పుడు సామ్రాట్ 'ఏదేమైనా తను సూపర్ బాబాయ్ తన ఆటిట్యూడ్‌కు, ఆలోచన విధానికి 100 కి 100 మార్క్స్ ఇవ్వచ్చు బాబాయ్' అంటాడు. అప్పుడు ఆయన ఎవరికి మార్కులు ఇస్తున్నావ్ అని అడుగుతాడు.

తొలిసారి అలాంటి వాళ్లను చూశా
బాబాయి అడిగిన ప్రశ్నకు 'నేను చెప్పేది తులసి గురించి బాబాయ్. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి చేతిలో ఒక బ్లాంక్ పెడితే అదేదో చిత్తు కాగితం లాగా నా మోహన విసిరి కొట్టింది బాబాయ్. తులసి కాకుండా ఆ ప్లేస్‌లో ఎవరైనా ఉంటే ఒకటి తర్వాత 100 సున్నాలు పెట్టుకునేవారు. ఇప్పటివరకు నేను డబ్బు మనుషుల్ని చూశాను బాబాయ్. తులసి లాంటి క్యారెక్టర్ ఉన్న వారిని ఫస్ట్ టైమ్ చూస్తున్నాను' అని చెప్తాడు. అంతలోనే తులసి.. నందూ, లాస్య ఆధ్వర్యంలో సామ్రాట్ కండక్ట్ చేస్తున్న ఇంటర్వ్యూకు వస్తుంది. ఆమెను చూసి వాళ్లు ఆ ఫైల్‌నే ముందుగా తీసుకుంటారు.

తులసిని అవమానించేలా లాస్య
తులసి ఫైల్ చూసిన వెంటనే లాస్య 'ఏంటి సంగీతం స్కూలు కూడా ఓ బిజినెస్ ఐడియానేనా.. ఇంకా నయం బట్టలు ఉతకడం అనే ఐడియాలతో రాలేదు. ఇక్కడ నీ ఐడియా ఓకే చేసి నందూనే సార్ దగ్గర వరకు పంపించాలి. నీ లైఫ్‌లో ఎప్పుడూ ఇలాంటి రోజు వస్తుంది అని అనుకోలేదు కదా.. నువ్వు మాజీ భార్య అని అందరిని కాదని నిన్ను ఏమి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడం కుదరదు. నువ్వు అందరిలా వెయిట్ చెయ్' అని వెటకారంగా మాట్లాడుతుంది. అప్పుడు నందూ మౌనంగా ఉండిపోతాడు. ఇక తులసి అక్కడే సోఫాలో కూర్చుని ఉండిపోతుంది.

ఆమె దగ్గరకు సామ్రాట్ బాబాయ్
ఇంటర్వ్యూ కోసం కూర్చుని చూస్తోన్న తులసిని చూసిన సామ్రాట్ వాళ్ళ బాబాయ్.. ఏమ్మా తులసి ఇలా వచ్చావేంటి అని అడుగుతాడు. దీనికామె ఇంటర్వ్యూ కోసం వచ్చాను అని చెబుతుంది. ఆ వెంటనే ఆయన సరే రా సామ్రాట్ దగ్గరకు తీసుకు వెళ్తాను అని అంటాడు. దీనికి తులసి లేదు అందరికీ లాగానే నేను కూడా వెయిట్ చేస్తాను అని అంటుంది. అప్పుడు ఆయన 'సామ్రాట్ నిన్ను ఇక్కడ చూస్తే తనే డైరెక్ట్‌గా వస్తాడు. అది ఏ మాత్రం బాగోదు. ఒకసారి నువ్వే ఆలోచించుకో' అంటాడు. ఆ తర్వాత సామ్రాట్‌ను పిలుస్తాడు. అప్పుడతను నందూ, లాస్యతో ఉంటాడు.

బిజినెస్ ఐడియా చెప్పిన తులసి
తులసిని చూడగానే సామ్రాట్ వాట్ ఏ ప్లసంట్ సర్ప్రైజ్ మీరు వచ్చారా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ల బాబాయి మన యాడ్ చూసి తులసి వచ్చిందట అని చెబుతాడు. దీంతో తులసి మీరు మీటింగ్‌లో ఉన్నారు అనుకుంటా. నేను వెయిట్ చేస్తాను అని అంటుంది. అప్పుడు సామ్రాట్ తులసి గారు మీ బిజినెస్ ఐడియా ఏంటి చెప్పండి అని అడుగుతాడు. దీనికామె 'నేనొక మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. సంగీతానికి పశువులు, పక్షులు, మనుషులు అందరూ పరవశిస్తారు. ఈ విషయం తెలియకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది' అంటుంది.

సంగీతం గొప్పదనం వివరించగా
ఆ తర్వాత తులసి 'సంగీతం అనేది ఓంకారం నుండి మొదలైంది. విష్ణుమూర్తి అవతారాలలో ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తాడు.. శివుడు డమరుకం వాయిస్తాడు. చదువుల తల్లి సరస్వతి వీణ వాయిస్తోంది. చదువులు పెరుగుతున్న ఈరోజుల్లో శాస్త్రీయ సంగీతం గురించి ఎవరికీ తెలియదు. అది మన దురదృష్టం. అలాంటి పరిస్థితి మార్చాలి అన్నది నా ఉద్దేశం.. గంగా నదిలో మునిగితే గాని దాని విలువ పవిత్రత తెలియదు. అలాగే మనం ఏం పోగొట్టుకుంటున్నామో తెలియదు. అంతేకాదు సార్ సంగీతం రావడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఇవన్నీ మనిషికి ఉపయోగపడేవే' అని తులసి చెబుతుంది.

తులసి ప్లాన్‌కు సామ్రాట్ సిగ్నల్
తులసి మాటలను విన్న తర్వాత సామ్రాట్ 'వావ్ నిజంగా నాకు కావాల్సింది ఇలాంటి ప్రాజెక్ట్స్.. లుక్ మిస్టర్ నందూ మీరేం చేస్తారో నాకు తెలీదు అర్జెంటుగా తులసి ప్రాజెక్ట్ పట్టాలెక్కాలి. స్వయంగా మీరే ఈ ప్లాన్‌ను ఎగ్జిక్యూట్ చేసి అమలు చేయాలి. తులసి గారి సలహాలు తీసుకోండి' అని నందూకు చెప్తాడు. ఆ తర్వాత వాళ్ల బాబాయ్‌తో 'అందుకు అవసరమైన అమౌంట్‌ను వెంటనే అరేంజ్ చేయండి' అంటాడు. దీంతో తులసి నా కల తీరేలా చేసినందుకు ధన్యవాదాలు వస్తాను సార్ అని వెళ్తుంది. అప్పుడు సామ్రాట్ మనసులో లేదు నా కల తీర్చుకుంటున్నాను అని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత ఇంటికెళ్లి ఈ విషయం అందరికీ చెప్పడంతో సంతోషిస్తారు. అప్పుడే అభి.. తులసి ఇంటికి వస్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











