For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi July 26 Episode: నందూ తండ్రికి గుండెపోటు.. షాకింగ్ న్యూస్ చెప్పిన డాక్టర్

  |

  దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అంకితతో జరిగిన గొడవపై ప్రేమ్‌ బాధ పడతాడు. దీంతో శృతి అతడికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది. అనంతరం అనసూయ.. తులసిని నోటికి వచ్చినట్లు తిట్టి బాధ పెడుతుంది. ఆ తర్వాత నందూ, లాస్య వచ్చి గొడవ పడడంతో.. పిల్లలు తులసికి అండగా నిలబడతారు. కానీ, ఆమె మాత్రం ఇంటి పేపర్లను మామగారికి ఇచ్చేసి అందరికీ షాకిస్తుంది.

  మీరంతా కలిసి ఉండొచ్చు.. అందుకే

  మీరంతా కలిసి ఉండొచ్చు.. అందుకే

  ఇంటి పేపర్లను మామగారికి ఇచ్చి తన బాధనంతా వెల్లగక్కుతోన్న తులసి మాటలతో ఈరోజు ఎపిసోడ్ మొదలైంది. ‘నేను లేకపోతే మీరంతా సంతోషంగా ఉండొచ్చు. నేను మధ్యలో వచ్చాను.. మధ్యలోనే వెళ్లిపోతాను. నా వల్లే ఇంట్లో గొడవలు.. కష్టాలు వచ్చాయి కదా. నా వల్లే అందరూ బాధలు పడుతున్నారు కదా. అందుకే నేనే ఇక్కడి నుంచి వెళ్లిపోతాను' అని అంటుంది తులసి.

  దానికి సీక్వెల్‌గా మహేశ్ - త్రివిక్రమ్ మూవీ: ఆ హీరోయిన్ వల్ల లీకైన న్యూస్.. అరాచకమైన కథతో!

  శని పోతుంది.. మంచి రోజు వచ్చింది

  శని పోతుంది.. మంచి రోజు వచ్చింది

  తల్లి మాటలకు బాధ పడిన అభి ‘ఇంత చిన్న విషయానికే వెళ్లిపోతా అంటావేంటి మామ్' అని అడుగుతాడు. అప్పుడు అనసూయ ‘వెళ్లనివ్వరా శని పోతుంది. ఈ మాట కోసమే చాలా కాలం నుంచి వేచి చూస్తున్నా. ఇంత మంచి రోజు ఇంత త్వరగా వస్తుందని అస్సలు అనుకోలేదు' అని అంటుంది. అప్పుడు తులసి కూడా అత్తకు సమాధానాలు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతుంది.

  నందూ తండ్రికి గుండెపోటు.. తులసి

  నందూ తండ్రికి గుండెపోటు.. తులసి

  తులసి బయటకు వెళ్లిపోగానే నందూ తండ్రికి హార్ట్ ఎటాక్ వస్తుంది. దీంతో మెట్లపైనే ఆయన కింద పడిపోతాడు. అప్పుడంతా కంగారు పడుతుండగా తులసి వెనక్కి వచ్చేస్తుంది. తర్వాత ఆయనను ఆస్పత్రికి తీసుకుని వెళ్తారు. అక్కడ అనసూయ మాట్లాడుతూ ‘తులసి వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ముసలి ప్రాణాలను ఇలా ఇబ్బంది పెడుతుంది' అంటూ కోడలిపై నిందలు వేస్తుంది.

  నందూనే కారణం అంటూ తులసి ఫైర్

  నందూనే కారణం అంటూ తులసి ఫైర్

  అనసూయ అన్న మాటలకు తులసి ఓ రేంజ్‌లో ఫైర్ అవుతుంది. ‘మామయ్య గారికి ఇలా అవ్వడానికి నేను కారణం కాదు. ఉన్నపళంగా తన ఇంటికి రమ్మని భయపెట్టిన మీ అబ్బాయే దీనికి కారణం. నాపై ఇంకెన్ని నిందలు వేస్తారు అత్తయ్య' అంటూ ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత లాస్యలో మధ్యలో మాట్లాడుతుండగా.. ఆమెకు కూడా తులసి సరైన సమాధానం ఇవ్వడంతో కామ్ అవుతుంది.

  తండ్రికి సర్జరీ.. నందూ, లాస్య వేరుగా

  తండ్రికి సర్జరీ.. నందూ, లాస్య వేరుగా

  ఆస్పత్రిలో బయట గొడవ జరుగుతుండగా డాక్టర్ ఎంట్రీ ఇస్తుంది. అప్పుడు నందూను పిలిచి ‘మీ నాన్న గారికి రెండోసారి పెయిన్ వచ్చింది కదా.. ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. దీనికి రూ. 15 లక్షలు ఖర్చు అవుతుంది' అంటుంది. దీంతో నందూ ఆ డబ్బును తీసుకొస్తా అంటాడు. లాస్య మాత్రం మనసులో ‘మా కష్టార్జితం అంతా నందూ ఇలా వృథా చేస్తాడేమో' అని అనుకుంటుంది.

  డబ్బుల కోసం తులసి... ఇంటి పేపర్స్

  డబ్బుల కోసం తులసి... ఇంటి పేపర్స్

  నందూ డబ్బులు తీసుకు వస్తానని చెప్పినా తులసి కూడా ప్రయత్నాలు ప్రారంభిస్తుంది. ఇందుకోసం ఇంటి పేపర్లు పెడతామని అభిని సేట్‌కు ఫోన్ చేయమంటుంది. కానీ ఆయన మాత్రం ఇవ్వనంటాడు. అప్పుడు అంకిత ఈ తలనొప్పి అవసరమా అనగా.. అభి ఫైర్ అవుతాడు. ఇక, నందూ ఆఫీస్ డబ్బు లెక్క చూస్తుండగా.. లాస్య మరోసారి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది.

  Jayanthi no more: ఆమెకు వచ్చిన అవార్డులు.. తెలుగులో నటించిన గొప్ప చిత్రాలు ఇవే

  నానమ్మపై ప్రేమ్ ఫైర్.. డబ్బుల కష్టం

  నానమ్మపై ప్రేమ్ ఫైర్.. డబ్బుల కష్టం

  ఒకవైపు తులసి.. మరోవైపు నందూ ఓపెన్ హార్ట్ సర్జరీకి అవసరం అయ్యే డబ్బుల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక, ఆస్పత్రిలో ఉన్న అనసూయ మాత్రం తులసిని తిడుతుంటుంది. అప్పుడు అక్కడే ఉన్న ప్రేమ్ నానమ్మపై ఫైర్ అవుతాడు. ఆ సమయంలోనే ‘తాతయ్య కోసం డబ్బులు తెచ్చేది నాన్న కాదు.. అమ్మే. అది గుర్తు పెట్టుకో నానమ్మ' అంటూ చెబుతాడు.

  English summary
  Intinti Gruhalakshmi Episode 381: Tulasi Gave House Document to Nandhu Father. Then She Left her Home Went Back. After That Nandhu Father Suffered with Heart Attack.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X