Intinti Gruhalakshmi Today Episode: తులసిని ఆ కోరిక కోరిన హనీ.. ఇంట్లో ఆమెను చూసి లాస్య, నందూ షాక్
మిగిలిన లాగ్వేజ్‌లతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేద్దాం మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. కొత్త బిజినెస్ ఐడియాలను ప్రోత్సహించేందుకు నందూ, లాస్యకు సామ్రాట్ ఇచ్చిన ప్లాన్‌లో భాగంగా ఇంటర్వ్యూలు జరుగుతుంటాయి. దీనికి తులసి తన మ్యూజిక్ స్కూల్ ఐడియాతో వస్తుంది. ఆమెను అక్కడ చూసి లాస్య వెటకారం ఆడుతుంది. ఆ తర్వాత సామ్రాట్ బాబాయి చూసి పలకరిస్తాడు. అనంతరం సామ్రాట్ వచ్చి తులసి ఐడియాను వివరించమని అడుగుతాడు. ఆమె చెప్పిన ప్లాన్ విన్న వెంటనే పెట్టుబడి పెట్టమని నందూకు ఆర్డర్ వేస్తాడు. ఇక, తులసి ఇంట్లో వాళ్లు సంతోషపడుతోన్న సమయంలో అభి కూడా వస్తాడు.

ఇంటికొచ్చినా నిరాశ పరిచిన అభి
తులసి తనను ఇంటికి రమ్మని ఆహ్వానించగానే అభి అక్కడకు చేరుకుంటాడు. అంకితను ఎలాగైనా ఒప్పించి తన వెంట తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో వచ్చిన అతడు.. ‘నిన్ను వదిలి ఉండలేకపోతున్నా. నువ్వు లేని చోట నాకు అసలు ప్రాణం నిలవడం లేదు. నిన్ను మా మామ్ బంధించి ఉంచింది. ఎలాగో వీళ్లను వదిలి నువ్వు రావు. అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావని నీకోసం వచ్చాను. అంతేకానీ, ఇక్కడ ఎవరి కోసమో రాలేదు' అంటూ మాట్లాడతాడు. దీంతో అందరూ నిరాశ పడతారు. అంకితకు మాత్రం అభి మీద ఉన్న కోపం ఇంకాస్త ఎక్కువ అవుతుంది.

ఒంటరిగా వచ్చిన ప్రేమ్.. అబద్ధం
అభి వచ్చిన కాసేపటికే ప్రేమ్ కూడా అక్కడకు చేరుకుంటాడు. అయితే, అతడు ఒంటరిగా రావడంతో తులసి ‘శృతి ఎక్కడ? నువ్వు ఒక్కడివే వచ్చావేంటి' అని ప్రశ్నిస్తుంది. దీనికి అతడు మౌనంగా ఉండడంతో ఇద్దరూ గొడవ పడ్డారా అని అడుగుతారు. అప్పుడు ప్రేమ్ ‘శృతి వాళ్ల అత్తయ్యకు ఒంట్లో బాలేదని అక్కడకు వెళ్లింది' అని అబద్ధం చెబుతాడు. దీంతో తులసి ఒకసారి తనకు ఫోన్ చెయ్ అంటుంది. అప్పుడు ప్రేమ్ ‘తనతో ఇప్పుడే మాట్లాడా. హాస్పిటల్‌కు వెళ్తున్నానని చెప్పింది' అంటాడు. దీంతో అందరూ ప్రేమ్ చెప్పింది నిజమే అని అనుకుంటారు.

ప్రేమ్ కోసం శృతి.. మార్చిన అత్త
ప్రేమ్.. శృతికి పదే పదే ఫోన్ చేస్తుండడంతో ఆమె ‘ప్రేమ్‌ను నేను కావాలని దూరం పెడుతున్నాను. దానివల్ల అతడు నాకు మరింత దూరం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రేమ్ నేను నీతో మాట్లాడతాను' అంటూ అతడి కోసం ఇంటికి వెళ్తుంది. కానీ, ప్రేమ్ ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతాడు. దీంతో పక్కనే ఉన్న ఆమెను శృతి అడగ్గా.. నీకోసమే వచ్చేశాడు కదా అంటూ ఎన్నో ప్రశ్నలు వేస్తుంది. అప్పుడు కౌశల్య వచ్చి ప్రేమ్ మీద మనసు విరగ్గొట్టేలా శృతికి ఎన్నో మాటలు చెబుతుంది. దీంతో ఆమె ప్రేమ్ కోసం కాకుండా తన అత్తతో వాళ్ల ఇంటికి తిరిగి వెళ్లిపోతుంది.

హనీ నిరాశగా.. ప్రశ్నించిన తులసి
ఇక, తులసి ఇంట్లో సంగీతం క్లాస్‌కు వచ్చిన హనీ ధీనంగా కూర్చుని ఉంటుంది. అప్పుడు తులసి ఏమైందని అడుగుతుంది. దీంతో హనీ ‘నా మూడ్ బాగోలేదు ఆంటీ. నేను రాను. యశోద నేషనల్ స్కూల్లో యాక్టింగ్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. ఈ కాంపిటీషన్లో అన్ని స్కూల్స్ పాల్గొంటాయి. ఒక్కొక్క స్కూల్ నుంచి ఒక స్టూడెంట్ ఒక్కొక్క టీచర్ కలిసి వెళ్లి ఒక కాంపిటీషన్ జరుగుతుంది. ఆ కాంపిటీషన్లో మా టీచర్ నా పేరు సెలెక్ట్ చేశారు. నన్ను ఆ కాంపిటీషన్‌కు వచ్చేటప్పుడు కృష్ణుడు గెటప్ వేసుకొని రమ్మన్నారు' అని అసలు విషయాన్ని చెబుతుంది.

హనీ ఆ కోరిక.. తులసి అంగీకారం
హనీ చెప్పిన దానికి తులసి బాగానే ఉంది కదా మరి ఎందుకు బాధ అని అడుగుతుంది. అప్పుడు హనీ కృష్ణుడు గెటప్ ఎలా వేసుకోవాలి అని అమాయకంగా అడుగుతుంది. దీనికి తులసి మీ ఇంట్లో మీ నాన్న, మీ తాతయ్య ఉన్నారు కదా అని అంటుంది. అప్పుడా చిన్నారి వాళ్లకు డబ్బులు పెట్టి కొనివ్వడమే తప్ప.. ఇలాంటివి చేయడం రాదు అని అంటుంది. అంతేకాదు, ‘మీరు నా ఫ్రెండ్ కదా నాకు హెల్ప్ చెయ్యచ్చు కదా.. మీరు నేను గెలవడానికి హెల్ప్ చేస్తా అంటేనే.. నేను క్లాస్‌కు వస్తాను. లేదంటే రాను' అని అంటుంది. దీంతో తులసి సరే అని ఒప్పుకుంటుంది.

లక్కీపై లాస్య ఫైర్.. నందూ హెల్ప్
ఇక, సామ్రాట్ గురించి లాస్య ఏదేదో అంటుంది. దీంతో నందూ ఆయనను వెనకేసుకుని వస్తాడు. ఆ సమయంలో లాస్య ‘సామ్రాట్ తులసిని ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్న తులసిని చూసిన చూపులు చూస్తే నాకు అర్థమవుతుంది' అంటుంది. దీనికి నందూ నువ్వు తొందర పడి అనవసరంగా అపార్థం చేసుకోవద్దు అని అంటాడు. అంతలో అక్కడకు లక్కీ వచ్చి తనకు వేషం వేయాలని చెప్తాడు. దీంతో లాస్య ఆ చిన్నారిపై కోప్పడుతుంది. కానీ, నందూ మాత్రం సాయం చేస్తానని హామీ ఇస్తాడు. ఆ తర్వాత అతడికి వేషం వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తాడు.
Recommended Video


తులసి రాకతో నందూ, లాస్య షాక్
ఇక, సామ్రాట్ ఇంట్లో హనీకి కృష్ణుడి వేషం వేస్తుంటాడు. కానీ, అది వర్కౌట్ కాదు. అప్పుడే నందూ, లాస్య అక్కడకు వచ్చి తులసి ఫైల్ ఇచ్చేందుకు వచ్చామని చెప్తారు. అప్పుడు హనీ ‘మీకు నన్ను రెడీ చేయడం కుదరదు అని తెలిసే తులసి ఆంటీని రమ్మన్నాను' అని చెప్తుంది. అంతలోనే అక్కడకు తులసి వస్తుంది. ఆ వెంటనే హనీని లోపలికి తీసుకెళ్లి వేషం వేసుకుని వస్తుంది. ఆ తర్వాత సామ్రాట్.. హనీకి, టీచర్‌కు డ్యాన్స్ కూడా నేర్పించమని తులసిని అడుగుతాడు. అప్పుడామె నాకు డ్యాన్స్ చేయడం రాదు అని చెప్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.


Click it and Unblock the Notifications











