Intinti Gruhalakshmi July 27th Episode: డబ్బుల కోసం లాస్య కన్నింగ్ ప్లాన్.. తులసికి శశికళ సహాయం

ఎన్నో ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి ఇంటి పేపర్లను మామగారికి ఇచ్చేసి.. బయటకు వెళ్లిపోగానే నందూ తండ్రి గుండెపోటుతో పడిపోతాడు. దీంతో ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని డాక్టర్ చెబుతారు. ఆ డబ్బుల కోసం ఒకవైపు నందూ, మరోవైపు తులసి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆయనకు గుండెపోటు రావడానికి తులసే కారణమని అనసూయ నిందలు వేస్తుంది.

లాస్య అడ్డంకి... నందూతో వాగ్వాదం

లాస్య అడ్డంకి... నందూతో వాగ్వాదం

తండ్రి ఆపరేషన్ కోసం నందూ ప్రయత్నాలు చేస్తున్నది చూసి లాస్య కుల్లుకుంటుంది. అంతేకాదు, అతడు ఆఫీస్ డబ్బులు లెక్కలు చూడమని అడగగా.. లాస్య అడ్డు చెబుతుంది. అప్పుడు 'మా నాన్న కంటే ఇవేమీ ఎక్కువ కాదు.. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు సాయం చేస్తాం' అని బదులిస్తాడు నందూ. ఇలా ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఆఖరికి లాస్య సైలెంట్ అయిపోతుంది.

భర్త కోసం కన్నీరు పెట్టిన అనసూయ

భర్త కోసం కన్నీరు పెట్టిన అనసూయ

ఆస్పత్రిలో భర్త చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా.. అనసూయ అది చూసి తట్టుకోలేకపోతుంది. తన భర్తను తలుచుకుంటూ కన్నీరు మున్నీరు అవుతుంది. దీంతో ప్రేమ్.. 'తాతయ్యను ఎప్పుడూ తిడతావు. ఇప్పుడు ప్రేమ కారిపోతున్నట్లు ఏడుస్తున్నావేంటి' అని అడుగుతాడు. అప్పుడు 'భార్య భర్తలు అలాగే ఉంటారు.. కానీ ఏదైనా అయితే తట్టుకోలేరు' అంటుంది.

తులసికి రామచంద్ర ఫోన్.. డబ్బులు

తులసికి రామచంద్ర ఫోన్.. డబ్బులు

మామయ్య గారి ఆపరేషన్ కోసం డబ్బుల కోసం అన్వేషిస్తున్న తులసికి రామచంద్ర ఫోన్ చేస్తాడు. అప్పుడు 'ఏంటమ్మా.. డల్‌గా ఉన్నట్లు ఉన్నావు. ఏదైనా ప్రాబ్లమా' అని అడుగుతాడు. అప్పుడు ఏమీ లేదని చెబుతుంది. దీంతో రామచంద్ర డబ్బులు తీసుకు రమ్మంటాడు. ఆ సమయంలో తన మామకు గుండెపోటు వచ్చిందని అసలు విషయం చెప్పడంతో టైమ్ తీసుకోమని అంటాడు.

ఆఫీస్‌లో 5 లక్షలు.. షాకిచ్చిన డాక్టర్

ఆఫీస్‌లో 5 లక్షలు.. షాకిచ్చిన డాక్టర్

ఆఫీస్‌ అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్‌తో పాటు ఖర్చులు కోసం ఉంచిన డబ్బులు ఎంత ఉన్నాయో లెక్క చూడమని నందూ.. అకౌంటెంట్‌కు ఫోన్ చేస్తాడు. కొద్ది సేపటి తర్వాత కాల్ చేసిన అతడు.. అన్నీ కలిపితే రూ. ఐదు లక్షలు మాత్రమే ఉన్నాయని అంటాడు. ఆ డబ్బును తీసుకెళ్లి ఆస్పత్రిలో డిపాజిట్ చేయగా.. మొత్తం అమౌంట్‌ను కడితేనే ఆపరేషన్ చేస్తామని డాక్టర్ బదులు ఇస్తుంది.

తులసికి లాస్య ఫోన్... డిపాజిట్ మనీ

తులసికి లాస్య ఫోన్... డిపాజిట్ మనీ

డబ్బుల కోసం టెన్షన్ పడుతోన్న తులసికి లాస్య ఫోన్ చేసి మామ గురించి నెగెటివ్‌గా మాట్లాడుతుంది. దీంతో డిపాజిట్ చేసుకున్న డబ్బుల గురించి గుర్తు చేస్తుంది తులసి. దీనికి 'నా డబ్బులు నేనెందుకు ఇస్తా. నందూ అప్పులపాలైనా అవి తీయలేదు. ఎవరి కోసమే నా సేవింగ్స్ ఎందుకు ఖర్చ చేస్తా' అని బదులిస్తుంది. అలాగే, తులసిని డబ్బులు తీసుకు రాలేవని నిరుత్సాహపరుస్తుంది.

డబ్బుల కోసం శశికళకు తులసి ఫోన్

డబ్బుల కోసం శశికళకు తులసి ఫోన్

తులసికి శశికళ గుర్తుకు వచ్చి.. అప్పు కోసం ఆమెకు ఫోన్ చేస్తుంది. దీంతో 'అప్పుడు మీ ఇంటికి డబ్బుల కోసం వస్తే మర్యాదగా మాట్లాడమని అన్నావ్ కదా. ఇప్పుడు నాకే ఫోన్ చేశావ్' అని అంటుంది. దీనికి తులసి 'మిమ్మల్ని తిట్టలేదు. మంచిగా ఉండమని చెప్పాను' అంటుంది. కాసేపు డిష్కర్షన్ అయిన తర్వాత ఇంటి పత్రాలు తీసుకునిరా డబ్బులు ఇస్తా అని శశికళ చెబుతుంది.

లాస్యకు భాగ్య సలహా.. అప్పు అబద్ధం

లాస్యకు భాగ్య సలహా.. అప్పు అబద్ధం

ఒకవైపు తులసి, మరోవైపు నందూ డబ్బుల కోసం ప్రయత్నాలు జరుపుతుండగా.. భాగ్య లాస్య దగ్గరకు వస్తుంది. 'ఏంటి లాస్య అక్కడ గందరగోళం జరుగుతుంటే నువ్వు కామ్‌గా ఉన్నావ్? అయినా ఇప్పుడు మనీ అడ్జెస్ట్ చేశావంటే బావ దగ్గర, ఫ్యామిలీలో నీ విలువ పెరుగుతుంది. నీ డబ్బే అప్పు తెచ్చానని చెప్పి ఇవ్వు' అని సలహా ఇస్తుంది. ఆమె మాటలకు లాస్య ఓకే అనేస్తుంది.

లాస్య సహాయం... అనసూయ గొడవ

లాస్య సహాయం... అనసూయ గొడవ

భాగ్య చెప్పిన ప్రకారమే ఆస్పత్రికి వచ్చిన లాస్య 'నందూ డబ్బు సర్ధుబాటు చేశా. 10 రూపాయల వడ్డీ అడుగుతున్నారు. దానికి కూడా ఓకే చెప్పేశా' అంటుంది. దీంతో అనసూయ లాస్యను మెచ్చుకుంటూ తులసిని పరోక్షంగా తిడుతుంది. అప్పుడు అక్కడే ఉన్న ప్రేమ్ నానమ్మతో గొడవకు దిగుతాడు. ఇలా ఆస్పత్రిలో మరోసారి రచ్చ రచ్చ జరుగుతుంది. దీంతో ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X