For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi July 28th Episode: నిజం చెప్పిన తులసి.. తప్పు చేశానని కాళ్లు పట్టుకున్న నందూ

  |

  చాలా దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తండ్రి సర్జరీ కోసం డబ్బు తీసుకు రావడంలో నందూ విఫలం అయ్యాడు. అప్పుడు తులసి.. శశికళకు ఫోన్ చేసి అప్పు అడుగుతుంది. దీనికి ఆమె అంగీకారం తెలుపుతుంది. అయితే, ఇంటి పత్రాలు తీసుకు రమ్మంటుంది. ఇక, భాగ్య ఇచ్చిన సలహా మేరకు లాస్య కూడా డబ్బు ఇచ్చేందుకు రెడీ అవుతుంది. దీంతో చిన్న గొడవ జరుగుతుంది.

  Guppedantha Manasu July 27 Episode: కన్నీరు పెట్టించిన జగతి తీరు.. పార్టీకి వచ్చిన స్పెషల్ గెస్ట్

  లాస్యతో ప్రేమ్ గొడవ.. సారీ చెప్పిన అభి

  లాస్యతో ప్రేమ్ గొడవ.. సారీ చెప్పిన అభి

  లాస్య డబ్బులు తెస్తానని అనడంతో అనసూయ ఆమెను పొగుడుతుండగా ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. తులసిని నానమ్మ తిట్టడంతో ప్రేమ్ గొడవ పడతాడు. అప్పుడు లాస్య ‘నిజా నిజాలు తెలియకుండా మాట్లాడకు ప్రేమ్' అంటుంది. అప్పుడతను ‘మా అమ్మ నిజం.. నువ్వు అబద్ధం' అంటాడు. దీంతో అభి కలుగజేసుకుని సర్ధి చెప్పడంతో పాటు లాస్యకు సారీ అని అంటాడు.

   డబ్బులు కట్టేసిన తులసి.. నందూ ఆరా

  డబ్బులు కట్టేసిన తులసి.. నందూ ఆరా

  శశికళ ఇచ్చిన డబ్బులు తీసుకొచ్చిన తులసి ఆస్పత్రిలో కట్టేస్తుంది. ఈ విషయం బయట ఉన్న కుటుంబ సభ్యులకు చెబుతుంది. అప్పుడు నందూ ‘మా నాన్నకు నువ్వు డబ్బులు కడతావా? అసలు నీకు అవి ఎలా వచ్చాయి? మగాడిని నేనే డబ్బు తీసుకు రాలేకపోయా? రోహిత్ దగ్గరకు వెళ్లి దేహీ అని అడుక్కున్నావా? అసలు ఎలా తీసుకొచ్చావ్' అంటూ ప్రశ్నలు అడుగుతాడు.

   నిజం చెప్పిన తులసి.. సరైన మాటలతో

  నిజం చెప్పిన తులసి.. సరైన మాటలతో

  డబ్బుల గురించి నందూ ప్రశ్నించడంతో తులసి నిజం చెబుతుంది. ‘ఇల్లు తాకట్టు పెట్టి శశికళ దగ్గర డబ్బులు తీసుకొచ్చా' అని అంటుంది. అప్పుడు లాస్య ‘నందూ అడిగితే ఎన్నో ఇబ్బందులు పెట్టిన శశికళ నువ్వు అడిగితే ఇచ్చేసిందా? వడ్డీ డబ్బుల కోసమే గొడవ చేసిన ఆమె నీకు ఎలా డబ్బిచ్చింది' అని ప్రశ్నిస్తుంది. అప్పుడు తులసి మంచొళ్లకు మంచే జరుగుతుందని బదులిస్తుంది.

  తప్పు చేశానన్న నందూ.. లాస్యపై అలా

  తప్పు చేశానన్న నందూ.. లాస్యపై అలా

  తులసి డబ్బు కట్టడంతో పరందామయ్య ఆపరేషన్ చేయడం.. అది సక్సెస్ అవడం అయిపోతుంది. ఆ సమయంలో నందూ పక్కకు వచ్చి తండ్రికి ఇలా కావడానికి తానే కారణం అని బాధ పడుతుంటాడు. అప్పుడు లాస్య వచ్చి ‘నీ తప్పేం లేదు నందూ. ఆ తులసి చేసిన పని వల్లే ఇలా జరిగింది' అని అంటుంది. కానీ, నందూ మాత్రం తన వల్లే ఇలా జరిగిందని చెబుతూ వెళ్లిపోతాడు.

  యాంకర్ సుమపై సినీ నటి షాకింగ్ కామెంట్స్: వయసు పెరిగినా తీరు మారలేదు.. చాలా అసూయ అంటూ!

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  తండ్రికి నందూ సారీ.. గతం గుర్తు చేస్తూ

  తండ్రికి నందూ సారీ.. గతం గుర్తు చేస్తూ

  ఆపరేషన్ తర్వాత పరందామయ్య ఇంటికి వచ్చేస్తాడు. అప్పుడు తులసి తన వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అంటుంది. దీనికి ఆయన అంగీకరించడు. ఆ తర్వాత నందూ వచ్చి తండ్రికి సారీ చెబుతాడు. అప్పుడాయన ‘నీకు గుర్తుందా తులసిని పెళ్లి చేసుకున్నప్పుడు కలకాలం ఆమెతో ఉంటానన్నావ్. నేను కూడా అప్పుడే నిర్ణయించుకున్నా తనకు తండ్రిగా ఉండాలని' అని అంటాడు.

  English summary
  Intinti Gruhalakshmi Episode 383: Tulasi Arranged Money for Parandhamaiah Surgery. Then Doctors Did a Surgery. After That Nandu Feeling Guilty for His dad Situation.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X