For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: సామ్రాట్‌కు షాకిచ్చిన లక్కీ.. చివరి నిమిషంలో ఆమె మిస్సింగ్

  |

  దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేద్దాం మరి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. హనీకి డ్యాన్స్ నేర్పించేందుకు తులసిని సామ్రాట్ ఒప్పిస్తాడు. దీంతో ఆమె ఆ పాపకు డ్యాన్స్ నేర్పిస్తూ సామ్రాట్‌పై పడబోతుంది. దీంతో వెంటనే అతడు ఆమెను పట్టుకుంటాడు. అది చూసి నందూ షాక్ అవుతాడు. అప్పుడు అతడిని లాస్య మరింతగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. అలాగే, తులసిని కూడా డబుల్ మీనింగ్ డైలాగులతో నిందిస్తుంది. ఇక, అంకితను కన్విన్స్ చేసేందుకు అభి ప్రయత్నిస్తాడు. కానీ, ఆమె మాత్రం దానికి సుముఖంగా ఉండదు. దీంతో ప్రేమ్ కూడా అభికి కొన్ని విలువైన సలహాలు ఇస్తాడు.

  Eesha Rebba అందాల అరాచకం: అబ్బో ఆమె ఫోజులు చూస్తే!

  సామ్రాట్‌కు షాకిచ్చిన లాస్య కొడుకు

  సామ్రాట్‌కు షాకిచ్చిన లాస్య కొడుకు

  లక్కీ వచ్చి తులసితో మాట్లాడుతుండగా.. సామ్రాట్‌, వాళ్ల బాబాయి వచ్చి బాబు ఎవరని ప్రశ్నిస్తారు. అంతలోనే అక్కడకు లాస్య, నందూ వస్తారు. వచ్చీ రావడమే లాస్య 'లక్కీ నీకు ఎన్నిసార్లు చెప్పాను. చెప్పాపెట్టకుండా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లొద్దని' అంటూ కోప్పడుతుంది. దీంతో సామ్రాట్ ఈ బాబు మీ బాబా అని అడుగుతాడు. అప్పుడు అవునంటూ లక్కీతో సామ్రాట్‌కు నమస్కారం పెట్టిస్తారు. దీంతో సామ్రాట్ ఆల్ ది బెస్ట్ చెప్పి మా పాప కూడా పార్టిసిపేట్ చేస్తుందని అంటాడు. అప్పుడు లక్కీ 'అయితే తనకి కూడా ఆల్ ద బెస్ట్ చెప్పండి. ఫస్ట్ ప్రైజ్ నాకు.. సెకండ్ ప్రైజ్ తనకి' అంటూ షాకిస్తాడు. దీంతో సామ్రాట్ ఏదో ఆలోచిస్తూ.. ఆ తర్వాత కాంపిటీషన్ అంటే అలాగే ఉండాలి అని అంటాడు.

  తులసికి సామ్రాట్ ప్రశ్న.. హనీ వల్ల

  తులసికి సామ్రాట్ ప్రశ్న.. హనీ వల్ల


  ఆ తర్వాత నందూ, లాస్య.. లక్కీని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతారు. వాళ్ల అలా వెళ్లగానే సామ్రాట్ 'తులసి గారు మీకు లక్కీ ఎలా తెలుసు' అని అడుగుతాడు. దీంతో తులసికి ఏం చెప్పాలో అర్థం కాదు. అంతలో హనీ అక్కడకు వచ్చి ఆంటీ నేను రెడీ అయ్యాను. ఎలా ఉన్నానో చెప్పండి అని అంటుంది. అప్పుడు తులసి సామ్రాట్ ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే తప్పించుకుంటుంది. మరోవైపు, లక్కీకి లాస్య.. 'నువ్వు గెలిస్తే మా వల్లే అని చెప్పాలి' అని సలహా ఇస్తుంది. కానీ, అతడు మాత్రం నువ్వేమీ నాకు హెల్ప్ చేయలేదుగా అంటూ బదులిస్తాడు.

  Vikrant Rona Twitter Review: సుదీప్ మూవీకి అలాంటి టాక్.. కేజీఎఫ్‌ను మించేలా.. ఫైనల్ రిపోర్ట్ ఇదే

  హనీ టీచర్‌కు ఫోన్.. తులసి అడగ్గా

  హనీ టీచర్‌కు ఫోన్.. తులసి అడగ్గా


  హనీ పోటీకి సిద్ధం అవుతూ ఉండగా.. వాళ్ల టీచర్ మాత్రం ఏదో కాల్ వస్తే టెన్షన్‌గా మాట్లాడుతుంటుంది. అది చూసిన తులసి ఏమైందండీ ఏమైనా ప్రాబ్లమా అని సూటిగా ప్రశ్నిస్తుంది. అప్పుడామె 'అవునండీ.. ఇక్కడ ఇచ్చే జీవితం చాలా తక్కువ.. అందుకే వేరే కంపెనీకి అప్లై చేశాను. చాలాసార్లు వేరే వేరే ఇంటర్వ్యూకు వెళ్ళాను. ఇప్పుడు ఒక కంపెనీ వాళ్ళు అర్జెంటుగా ఇంటర్వ్యూకు రమ్మని ఫోన్ చేశారు. అక్కడకు వెళ్లాలి అండి. వెళ్తే నా సాలరీ డబల్ అవుతుంది' అని అంటుంది. అప్పుడు తులసి ఈ ఒక్కరోజు ఆగమని ఆమెను బ్రతిమాలి వెళ్లిపోతుంది.

  తప్పించుకున్న హనీ వాళ్ల టీచర్

  తప్పించుకున్న హనీ వాళ్ల టీచర్


  హనీ వాళ్ల టీచర్‌తో మాట్లాడిన తర్వాత లక్కీ కోసం తులసి పక్కకు వెళ్తుంది. అప్పుడామె ఎవరూ చూడకుండా ఇక్కడి నుంచి తప్పించుకోవాలని అని అనుకుంటుంది. ఆ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడే ఆమెను చూసిన సామ్రాట్ వాళ్ల బాబాయితో ఆవిడ హనీ వాళ్ల టీచరే కదా అంటాడు. అప్పుడాయన కూడా అవును అని చెప్తాడు. దీంతో సామ్రాట్ ఆ టీచర్‌ను పిలిచి ఎక్కడికి వెళ్తున్నావని ప్రశ్నిస్తాడు. దీంతో ఆమె క్యాంటిన్‌కు వెళ్లొస్తాను అని అబద్ధం చెబుతుంది. ఆ తర్వాత లక్కీ.. హనీ గురించి తులసిని అడుగుతాడు. దీంతో హనీ గురించి నీకెలా తెలుసని ఆమె ప్రశ్నిస్తుంది. అప్పుడు లక్కీ ఇంట్లో మమ్మీ వాళ్లు మాట్లాడుకుంటే విన్నా అంటాడు. తర్వాత హనీకి లక్కీ ఆల్ ది బెస్ట్ చెబుతాడు. కానీ, ఆమె మాత్రం ఏమీ చెప్పదు.

  దారుణమైన ఫొటోలు వదిలిన రష్మిక: ఆమెను ఇంత హాట్‌గా ఎప్పుడైనా చూశారా!

  హనీకి తులసి విలువైన మాటలు

  హనీకి తులసి విలువైన మాటలు


  లక్కీ అక్కడి నుంచి వెళ్లిపోయిన వెంటనే తులసి 'హనీ నువ్వు ఎందుకు అమ్మ లక్కీకి అల్ ది బెస్ట్ చెప్పలేదు' అని అడుగుతుంది. దీనికా చిన్నారి నేను గెలవాలి కదా అందుకే చెప్పలేదు అని అంటుంది. దీంతో తులసి 'మనం గెలిచినా గెలవక పోయినా కూడా మనతో పాటు కాంపిటీషన్‌లో ఉన్న వారికి ఆల్ ది బెస్ట్ చెప్పాలి. విజయం మనకు అనుకూలంగా వస్తే దానిని పాజిటివ్‌గా తీసుకోవాలి. అలా అని మనం ఓడిపోతే దానిని నెగిటివ్‌గా తీసుకోకూడదు. అందులో చేసిన తప్పులను సరిదిద్దుకొని మరోసారి గట్టిగా ప్రయత్నించాలి' అని విలువైన మాటలను చెబుతుంది.

  కాంపిటీషన్ ప్రారంభం అవగానే

  కాంపిటీషన్ ప్రారంభం అవగానే

  తులసి హనీకి చెప్పిన మాటలు విన్న సామ్రాట్ ఆశ్చర్యపోతాడు. ఇక.. హనీ వాళ్ళ టీచర్ అక్కడ్నుంచి తప్పించుకుని వెళ్లిపోతుంది. అంతలోనే కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. ముందుగా ఒక అమ్మాయి సెల్ ఫోన్ ఈ సమాజంలో బంధాలను ఏ విధంగా దూరం చేస్తుందో అర్థమయ్యేలాగా ఓ స్కిట్ చేసి వివరిస్తుంది. ఆ తర్వాత లక్కీ.. అల్లూరి సీతారామరాజు వేషంలో స్టేజ్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ చేస్తాడు. దీంతో ఆ చిన్నారిని అందరూ చప్పట్లతో అభినందిస్తారు. అప్పుడు హనీ కూడా లక్కీ చాలా బాగా చేశాడు కదా ఆంటీ అంటుంది. దీనికి తులసి అవునమ్మా తర్వాత నువ్వు కూడా అంతే బాగా చేయాలి అని అంటుంది. ఇంతలో హనీ అవును మా మిస్ ఎక్కడ అని అడుగుతుంది. తర్వాత ఆమె కనిపించదు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 696: Samrat Questioned to Tulasi about Nandhu and Lasya. Then She Gets Worried. After That Honey Teacher Escapes From Competition.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X