For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi July 29th Episode: మళ్లీ తులసి ఇంట్లోకి లాస్య.. నందూతో ఫైట్ తర్వాత నయా ప్లాన్

  |

  మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పరందామయ్య సర్జరీ కోసం తులసి డబ్బులు తీసుకొస్తుంది. దీంతో ఆపరేషన్ జరుగుతుంది. కానీ, ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అంటూ నందూ ఆమెను ప్రశ్నిస్తాడు. తర్వాత తన తండ్రి పరిస్థితికి కారణం తానేనంటూ నందూ ఎంతగానో ఫీల్ అవుతాడు. దానికి అనుగుణంగానే పరందామయ్య నందూను లాస్య విషయంలో హెచ్చరిస్తాడు.

  గృహలక్ష్మి హీరోయిన్ కస్తూరి పర్సనల్ ఫొటోలు: సీరియల్‌లో అలా.. రియల్‌గా ఇలా.. లేటు వయసులో ఘాటు ఫోజులు

  నందూకు దండం పెట్టిన పరందామయ్య

  నందూకు దండం పెట్టిన పరందామయ్య

  నందూతో తండ్రి పరందామయ్య ఎమోషనల్‌గా మాట్లాడుతుండగా ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. లాస్య విషయంలో కొడుకును హెచ్చరించిన ఆయన.. ‘నువ్వు వదిలేసినా తులసిని నేను దూరం చేసుకోను. ఈ కట్టె కాలే వరకూ తనకు తండ్రిగా ఉంటాను. దయచేసి నన్ను రమ్మని అడగకు. చిన్నోడివైనా నీకు దండం పెట్టి వేడుకుంటున్నా' అంటూ కన్నీరు మున్నీరు అవుతాడాయన.

  నందూను మరింతగా రెచ్చగొట్టిన లాస్య

  నందూను మరింతగా రెచ్చగొట్టిన లాస్య

  తండ్రి మాటలకు బాధపడుతూ బయటకు వచ్చిన నందూను లాస్య మరింతగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ‘నువ్వు మీ నాన్న కోసం ఎంత కష్టపడ్డావు. ఆఫీస్‌లో డబ్బంతా ఊడ్చుకుని వచ్చావు. కానీ, వీళ్లు నీకు అస్సలు విలువు ఇస్తున్నారా? మీ నాన్న గారు ఎలాంటి మాటలు అన్నారు. మనకు ఇలాంటి అవమానాలు అవసరమా చెప్పు' అంటూ మనసు మార్చాలని చూస్తుంది.

  లాస్యతో ప్రేమ్ గొడవ.. తులసి రావడంతో

  లాస్యతో ప్రేమ్ గొడవ.. తులసి రావడంతో

  లాస్య మాటలు విన్న ప్రేమ్ ఆమెతో గొడవకు దిగుతాడు. ‘ఏంటి లాస్య? మా నాన్నకు తాతయ్యకు మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నావా' అంటూ ఫైర్ అవుతాడు. అప్పుడు లాస్య అతడికి సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. దీంతో ‘నీ మాటలు వింటే నాన్నలా ఎటూ నిర్ణయించుకోలేని వాడిని అవుతాను' అంటాడు. అంతలో తులసి ఎంట్రీ ఇచ్చి కొడుక్కి సర్ధి చెప్పి ఆపుతుంది.

  తులసిలా వాళ్లను వదిలేయలేను అంటూ

  తులసిలా వాళ్లను వదిలేయలేను అంటూ

  ఇంటికి వచ్చిన తర్వాత లాస్య, నందూ మధ్య గొడవ జరుగుతుంది. ‘నీకే ఉన్నారా బోడి తల్లిదండ్రులు? వాళ్ల కోసం ఇంతలా దిగజారుతావా' అంటూ లాస్య కోప్పడుతుంది. దీంతో నందూ ‘అంటే నువ్వు అనాథలా ఉన్నావని, నన్ను కూడా అలా ఉండమంటావా? అసలు నీతో ఎప్పుడు ఎలా మాట్లాడాలో అర్థం కావడంలేదు' అని వెళ్లిపోతాడు. దీంతో లాస్య ఎమోషనల్ అయిపోతుంది.

  జబర్ధస్త్ టీమ్ లీడర్లపై రాంప్రసాద్ షాకింగ్ కామెంట్స్: షోలోకి వచ్చిన అమ్మాయిలతో అలా చేస్తారంటూ!

  అనసూయపై తులసి ఫైర్.. తప్పు అంటూ

  అనసూయపై తులసి ఫైర్.. తప్పు అంటూ

  తండ్రి కొడుకులను వేరు చేశావంటూ తులసితో అనసూయ గొడవకు దిగుతుంది. అప్పుడామె ‘ఏంటి అత్తయ్య ఊరుకుంటున్నా అని మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని వదిలేసి ఆ లాస్యతో వెళ్లిపోయినప్పుడు మీ కొడుకును ఎందుకు నిలదీయలేదు. మిమ్మల్ని కాదనుకుని వెళ్లింది ఆయన. నేను మాత్రం మీకోసమే ఇక్కడుంటున్నా' అని ఫైర్ అవడంతో అత్త షాకౌతుంది.

  లాస్యకు భాగ్య సలహా.. తులసి ఇంటికెళ్లి

  లాస్యకు భాగ్య సలహా.. తులసి ఇంటికెళ్లి

  నందూ తీరుతో కోపంగా ఉన్న లాస్యకు భాగ్య విలువైన సలహాలు ఇస్తుంది. ‘తులసి అక్కను ఒక్కదాన్నే ఆ ఇంటి నుంచి దూరం చేశావంటే నువ్వు శాశ్వతంగా అక్కడ ఉండిపోవచ్చు. అందుకోసం నువ్వు కొంచెం రిస్క్ అయినా ఆ ఇంట్లోకి మళ్లీ ప్రవేశించాలి. అలా వెళ్లిన తర్వాత అందరి మనసులకు దగ్గరై.. ఆ తులసిని వాళ్లకు దూరం చేయాలి. అప్పుడంతా నీ చేతుల్లో ఉంటుంది' అంటుంది.

   అగ్గిపుల్ల రాజేసిన లాస్య.. అంకితతో అలా

  అగ్గిపుల్ల రాజేసిన లాస్య.. అంకితతో అలా

  భాగ్య చెప్పిన సలహా మేరకు లాస్య ప్లాన్లు రెడీ చేసుకుంటుంది. ఆ వెంటనే అంకితకు ఫోన్ చేస్తుంది. అప్పుడు ఇంట్లో గొడవలు పెట్టడం గురించి ఆమెకు సలహాలు ఇస్తుంది. దీనికి అనుగుణంగానే అంకిత కూడా నడుచుకుంటానని చెబుతుంది. ఆ తర్వాత లాస్య ‘అగ్గిపుల్ల రాజేశా.. ఆ ఇంట్లో మంటలు వస్తాయి చూడు' అని భాగ్యతో చెబుతుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తయిపోయింది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 384: Parandhamaiah Told the Truth to Nandhu. Then Lasya Not Happy with Nandhu Behaviour. After That She Fight With him. Then She Plan to Collapse tulasi house.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X