Intinti Gruhalakshmi: దివ్యకు షాకిచ్చిన విక్రమ్.. నువ్వు రెండో పెళ్లానివే.. ఎదురు తిరిగిన కోడలు

జనరేషన్లు చేంజ్ అవుతూ ఉన్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే : శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్లాన్ ప్రకారం మందు కలిపిన డ్రింక్స్ ఇవ్వడంతో విక్రమ్, దివ్య నిద్ర లేవకుండా ఉంటారు. దీంతో రాజ్యలక్ష్మి తులసి వాళ్ల ఇంటికి వచ్చి నాటకం మొదలు పెడుతుంది. అప్పుడు విక్రమ్, దివ్య ముందు మందు పంచాయతీ పెడుతుంది. అప్పుడు నందూపై నిందలు వేయడంతో విక్రమ్‌ కూడా నమ్మేస్తాడు. దీంతో తులసి రాజ్యలక్ష్మి కాళ్లు పట్టుకుంటుంది. కానీ, వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోతారు. తర్వాత ఇంట్లో దివ్య పంచాయతీ పెట్టగా.. విక్రమ్ కోపంతో ఆమెను కొట్టబోతాడు. దీంతో దివ్య ఇంటి నుంచి వెళ్లిపోతానంటుంది.

iigl61
కావాలనే చెడగొట్టారు అంటూ : తన తల్లిదండ్రులపై నిందలు వేస్తుంటే దివ్య 'మా అమ్మనాన్నా నిజాయితీ నువ్వు కళ్లారా చూశావు విక్రమ్. డబ్బు కోసం మంగళసూత్రం అమ్ముకున్నారే తప్ప నువ్వు ఇచ్చింది తీసుకోలేదు' అని బదులిస్తుంది. దీంతో లాస్య 'నిజాయితీ గోంగూర పక్కన పెట్టు దివ్యా. బయటపడరు కానీ మీ వాళ్లకి అహంకారం, తలపొగరు ఎక్కువ. మనిషిపై పగపట్టారంటే కిందకి తొక్కే వరకూ వదలరు. దానికి నేనే పెద్ద ఉదాహరణ. కారణం ఏదైనా దివ్య వాళ్లకు నేనంటే పడదు. విడాకులు ఇచ్చాడు. నా బతుకు నన్ను బతకనివ్వొచ్చు కదా. మీ హనీమూన్ ప్లాన్ కావాలని చెడగొట్టారు' అంటుంది.
iigl61

మా వాళ్లను మాత్రం నమ్మరే : లాస్య మాటలకు దివ్య 'పిచ్చి పిచ్చిగా వాగకు. నీ గురించి, నీ క్రిమినల్ బ్రెయిన్ గురించి ఇక్కడున్న వాళ్లందరికీ తెలుసు. నీకు గతి లేక మాపై పడి బతుకుతున్నావు. పాత పగలు, కక్షలు మనసులో పెట్టుకుని నాటకాలు ఆడిస్తున్నావు' అని కోప్పడుతుంది. దీంతో రాజ్యలక్ష్మి 'తప్పమ్మా దివ్యా.. నీకంటే పెద్ద వాళ్లతో అలా మాట్లాడకూడదమ్మా ఎంత కాదన్నా.. లాస్య ఒకప్పుడు మీ నాన్నకి భార్య కదా' అంటుంది. దీంతో దివ్య 'కొంపలు ముంచే ఈవిడను ఒక్క మాట అంటే ఊరుకోరు. కానీ నిజాయితీ ఉన్న మా అమ్మ నాన్నల్ని మాత్రం నమ్మరేంటి' అని ప్రశ్నిస్తుంది.

iigl61

నీక్కూడ మీ అమ్మ పోలికలే : దివ్య మాటలకు విక్రమ్‌కు చిర్రెత్తుకొస్తుంది. అయినా దివ్య మాత్రం అస్సలు తగ్గదు. పైగా 'ఎన్నాళ్లు ఇలా మంచితనం ముసుగు వేసుకుని బతుకుతారు' అని నిలదీస్తుంది. దీంతో విక్రమ్ దివ్యా.. మాటలు జారకు అని హెచ్చరిస్తాడు. అప్పుడామె 'మీ అమ్మను ఒక్క మాట అనేసరికి కోపం తన్నుకొస్తుందే. మరి మా అమ్మను ఎన్ని మాటలు అంటున్నారు. అప్పుడు మౌనంగా ఉన్నావు ఎందుకు' అని కోప్పడుతుంది. దీంతో లాస్య కల్పించుకుని 'దివ్యా నీక్కూడా అన్నీ మీ అమ్మ పోలికలే. కాపురాన్ని చెడగొట్టుకోకు. మీ వాళ్లకు దూరంగా ఉండు' అని అంటుంది.

iigl61

నీకు ఏ అధికారం ఉందని : లాస్య మాటలకు దివ్య 'నువ్వెవరు ఆ మాట చెప్పడానికి? నీకు ఏం అధికారం ఉంది' అని కోప్పడుతుంది. అప్పుడు రాజ్యలక్ష్మి 'అది లాస్య మాట కాదు.. నా మాట. అనే అధికారం నాకుంది కదా దివ్యా' అని అంటుంది. అప్పుడు బసవయ్య 'ఏంటమ్మా దివ్యా.. నీ విషయాల్లో ఎవరూ కల్పించుకోకూడదు. కానీ మీ అమ్మ మాత్రం అందరి విషయాల్లో కల్పించుకుంటుంది. ఈ ఇంటి విషయాల్లో మీ అమ్మ వేలు పెట్టకుండా ఉండి ఉంటే పరిస్థితి ఇంత వరకూ వచ్చేది కాదు' అని అంటాడు. దీంతో దివ్య 'బాబాయ్' అంటూ అతడిపై ఆగ్రహంతో చూస్తుంది.

iigl61

పొగరుతో వదిలేసింది అని : దివ్య కోప్పడడంతో బసవయ్య 'మీ అమ్మ పద్దతిగా ఉండి ఉంటే.. నిన్ను పద్దతిగా పెంచేది. పొగరెక్కి మొగుడ్ని వదిలేసింది. తన కాళ్లపై తాను నిలబడాలని సంసారాన్ని గాలికి వదిలేసింది. నీకు కూడా అవే బుద్దులు నేర్పిస్తుంది. అందుకే మీ అమ్మకు దూరంగా ఉండమని మా అక్కయ్య చెప్తుంది. ఇందులో తప్పేం ఉంది' అని అంటాడు. దీంతో దివ్య 'బాబాయ్.. మా అమ్మ గురించి ఇంకొక్క మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. మా అమ్మ దేవత' అంటూ ఫైర్ అవుతుంది. దీనికి ప్రసన్న 'ఔనౌను.. మీ అమ్మ దేవతే.. శని దేవత' అంటూ మధ్యలోకి వస్తుంది.

iigl61

నువ్వు కూడా రెండో దానివే : అందరూ తనను కార్నర్ చేస్తుండడంతో దివ్య 'ఏంటి అత్తయ్యా వీళ్లు ఇలా మాట్లాడుతున్నారు? మీరు కూడా మా మామయ్య గారికి రెండో పెళ్లమే కదా. మొదటి పెళ్లానివి కాదు కదా' అంటుంది. దాంతో అక్కడే ఉన్న విక్రమ్ తాత.. 'బాగా గుర్తు చేశావు అమ్మా.. ఈ మధ్య ఆవేశం ఎక్కువై నిజాలు మర్చిపోతున్నారు' అని అంటాడు. దీంతో దివ్య ఇంకా ఇంకా రెచ్చిపోతూ ఉంటుంది. అప్పుడు విక్రమ్ ఆమెను కొట్టడానికి చేయి లేపుతాడు. దీంతో దివ్యకు విక్రమ్‌పై చిర్రెత్తుకొచ్చి ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అని బెదిరిస్తుంది. అయినా అతడు ఇంకా కోపంగానే మాట్లాడుతుంది.

iigl61
రాజ్యలక్ష్మి యాక్టింగ్ చేస్తూ : దివ్య ఇంట్లో నుంచి వెళ్లిపోతానని బ్యాగ్ సర్ధుకునేందుకు లోపలికి వెళ్తుంది. అప్పుడు రాజ్యలక్ష్మి కళ్లు తిరిగి పడినట్లు యాక్టింగ్ చేయడంతో పాటు దివ్య తనకు కావాలని నాటకం షురూ చేస్తుంది. అప్పుడు విక్రమ్ మాత్రం తల్లి వైపు మాట్లాడతాడు. అయినా దివ్య అస్సలు తగ్గకుండా వెళ్లిపోతానని అంటుంది. అంతేకాదు, 'మీ అమ్మ నాటకం నీకు అర్థం కాదు. తను నీ భార్యను కూడా నీతో పడుకోనివ్వదు' అని ఇంకా కోపం వచ్చేలా మాట్లాడుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X