For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: చివరి నిమిషంలో తులసి ఎంట్రీ.. విన్నర్ విషయం బిగ్ ట్విస్ట్

  |

  చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే


  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. లక్కీతో తులసి మాట్లాడుతుండగా నందూ, లాస్య వస్తారు. దీంతో సామ్రాట్ తను మీ కొడుకేనా అని అడుగుతాడు. అప్పుడు అవునని అంటారు. ఆ తర్వాత లక్కీ నేనే గెలుస్తా అంటూ సామ్రాట్‌కు షాకిస్తాడు. వాళ్లు వెళ్లిపోగానే లక్కీ మీకెలా తెలుసని సామ్రాట్ తులసిని ప్రశ్నిస్తాడు. కానీ, ఆమె సమాధానం దాటవేస్తుంది. అనంతరం హనీతో కలిసి పెర్ఫార్మెన్స్ చేయాల్సిన టీచర్ అక్కడి నుంచి తప్పించుకుంటుంది. ఇక, కాంపిటీషన్ ప్రారంభం కాగానే లక్కీ తన యాక్టింగ్‌తో అదరగొడతాడు. కానీ, హనీ టీచర్ మాత్రం కనిపించదు.

  Ramarao On Duty Twitter Review: రవితేజ మూవీ పరిస్థితి ఇదా.. కొత్త సమస్య.. ఓవరాల్ రిపోర్ట్ ఏంటంటే!

  హనీ టీచర్ మిస్సింగ్.. టెన్షన్‌లో

  హనీ టీచర్ మిస్సింగ్.. టెన్షన్‌లో

  కాంపిటీషన్ జరుగుతూ ఉండగానే హనీ వాళ్ల టీచర్ కనిపించకుండా పోతుంది. దీంతో హనీ.. తులసితో మా టీచర్ ఎక్కడుంది అని ప్రశ్నిస్తుంది. అప్పుడామె వచ్చి ఆడిటోరియం లోపల, బయట వెతుకుతుంది. కానీ, టీచర్ మాత్రం కనిపించదు. అప్పుడు తులసి ఈ విషయాన్ని సామ్రాట్‌కు చెబుతుంది. దీంతో అతడితో పాటు ఆయన బాబాయి కూడా బయట వెతుకుతూ ఉంటారు. కానీ ఆమె కనిపించదు. అప్పుడు సామ్రాట్ 'నేను ఎలాగైనా ఆమెను తీసుకుని వస్తాను. మీరు వెళ్లి హనీ పక్కన ఉండండి. తనకు ధైర్యం చెప్పి స్టేజ్ మీదకు పంపించండి' అని తులసితో చెప్తాడు.

  సామ్రాట్ ఫైర్.. తులసి చర్చలు

  సామ్రాట్ ఫైర్.. తులసి చర్చలు

  సామ్రాట్ వాళ్లు హనీ టీచర్ గురించి వెతుకుతోన్న సమయంలోనే సెక్యూరిటీ గార్డు వచ్చి ఆమె కంగారుగా అటు వైపు వెళ్ళిపోయింది అని చెబుతాడు. దీంతో సామ్రాట్ 'ఈ విషయం మాకు ముందే చెప్పాలి కదా. ఎలాగైనా హనీ ఈ కాంపిటీషన్‌లో గెలవాలి. దానికోసం ఏదైనా చేస్తాను' అని అంటాడు. ఆ తర్వాత ఇప్పుడు హనీకి ఏమని సర్ది చెప్పాలి అని ఆలోచిస్తుంటాడు. మొత్తానికి తన పాపకు సర్ది చెప్పలేను అని అనుకుంటాడు. ఇక లాస్ట్ పార్టిసిపెంట్ హనీ పేరు పిలుస్తారు. పిల్లలు అంతా హనీ హనీ అని అరుస్తారు. తులసి వెళ్లి జడ్జ్స్‌తో ఏవో చర్చలు జరుపుతుంది.

  స్టేజ్ మీదే హీరోయిన్‌కు ముద్దులు: ఏకంగా ఇద్దరితో.. ఆమె రియాక్షన్ చూశారంటే!

  హనీతో కలిసి స్టేజ్ పైకి తులసి

  హనీతో కలిసి స్టేజ్ పైకి తులసి

  జడ్జ్‌లతో తులసి మాట్లాడి వచ్చిన తర్వాత హనీ ఏమైంది ఆంటీ.. ఇంతకీ ఈరోజు నా డాన్స్ ఉందా లేదా అని అడుగుతుంది. దీనికి తులసి 'హనీ ముందు నువ్వు స్టేజ్ మీదకు వెళ్లి డాన్స్ చెయ్. నేను వెనుకమలా మీ టీచర్ పంపిస్తాను' అంటుంది. దీంతో హనీ వెళ్లి పెర్ఫార్మెన్స్ చేస్తుండగా తులసి గోపిక వేషంలో స్టేజ్ ఎక్కుతుంది. అలా వాళ్లిద్దరూ కలిసి డాన్స్ చేస్తారు. అది చూసిన సామ్రాట్ వాళ్ళ బాబాయి హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ లాస్య, నందూ మాత్రం షాక్‌లో ఉండిపోతారు. సామ్రాట్ కూడా చూసి సంతోషిస్తాడు. ఇక, తులసి హనీ అదిరిపోయే ప్రదర్శన ఇస్తారు.

  పోటీలో లక్కీ, హనీ విజేతలుగా

  పోటీలో లక్కీ, హనీ విజేతలుగా

  డ్యాన్స్ చేసి కిందకు వచ్చిన తర్వాత సామ్రాట్ ఏమ్మా టెన్షన్ పడ్డవా అని హనీని అడుగుతాడు. దీంతో ఆ చిన్నారి లేదు నాన్న పక్కన తులసి ఆంటీ ఉందిగా అంటుంది. అనంతరం యాంకర్ మాట్లాడుతూ.. 'ఈ సారి కాంపిటీషన్ చాలా టఫ్‌గా ఉంది.. జడ్జెస్ రిజల్ట్ ఇచ్చారు. పోటీ చేసిన వాళ్లందరిలో లక్కీ, హనీ ఇద్దరు ఫైనల్‌కు క్వాలిఫై అవుతారు. అనంతరం వీళ్లిద్దరిలో విన్నర్ ఎవరో తేల్చే సమయంలో 5 అంకెలు లెక్కబెట్టిన తర్వాత లక్కీ, హనీ ఇద్దరినీ విజేతలుగా ప్రకటిస్తారు. దీంతో అటు నందూ, లాస్య.. ఇటు సామ్రాట్ వాళ్ల ఫ్యామిలీ.. తులసి చాలా సంతోషిస్తారు.

  టాప్ విప్పేసి రెచ్చిపోయిన కరీనా: ఇద్దరు బిడ్డల తల్లైనా ఘోరంగా ఫోజులు

  హనీ విజేత కాదు అంటూ ప్రశ్న

  హనీ విజేత కాదు అంటూ ప్రశ్న

  హనీ కూడా విజేతగా నిలవడంతో లాస్య మాత్రం తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది. అంతేకాదు, తను గెలవకుండా ఉంటే బాగుండేది అనుకుంటుంది. అంతలో ఒకరు లేచి 'హనీ ఎలా విన్నర్ అవుతుంది.. తులసి వాళ్ళ టీచర్ కాదు కదా' అని అభ్యంతరం వ్యక్తం చేస్తారు. దీంతో కాంపిటీషన్‌ను నిర్వహించిన వాళ్లు 'తులసి ఎందుకు టీచర్ కాదు.. హనీ ఆమె దగ్గర సంగీతం నేర్చుకుంటుంది. విద్య నేర్పే ఎవరైనా టీచర్ అయినట్లే కదా. అందుకే తులసి గారికి ఇందులో పాల్గొనే అవకాశం కల్పించాం' అంటూ ఆమెతో పాటు అక్కడున్న వాళ్లందరికీ వివరణ ఇస్తారు.

  తులసిని పైకి రమ్మని అన్న హనీ

  తులసిని పైకి రమ్మని అన్న హనీ

  ఇక, లక్కీకి, హనీకి ప్రైజ్‌ ఇచ్చే సమయంలో యాంకర్ వాళ్ల పేరెంట్స్‌ను కూడా పైకి రమ్మని పిలుస్తుంది. దీంతో లక్కీ కోసం నందూ, లాస్య పైకి వెళ్తారు. ఆ సమయంలో ఆ బుడ్డోడు తన విజయానికి సహకరించిన అందరికీ థ్యాంక్స్ చెబుతాడు. తర్వాత హనీ మాత్రం 'ఈరోజు నా గెలుపునకు తులసి ఆంటీ కారణం.. అందుకే నా పక్కన తులసి ఆంటీ ఉండాలి' అని కోరుకుంటున్నాను అని మైక్‌లో చెబుతుంది. దీంతో సామ్రాట్ 'వెళ్ళండి తులసి గారు.. మా మనసులో ఉన్న మాట హనీ చెప్పింది' అని అంటాడు. తర్వాత సామ్రాట్ బాబాబు 'అమ్మ కంటే ఎక్కువగా తనకి సపోర్ట్ చేశావు వెళ్లమ్మా' అని అంటాడు. తర్వాత తులసి, సామ్రాట్, వాళ్ళ బాబాయ్ ముగ్గురు హనీ దగ్గరకి వస్తారు. అప్పుడు ప్రైజ్‌లు అందిస్తారు. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 697: Tulasi Help To Honey in Drama Compitition. After That Samrat Praises Tulasi for Helping hoeny to Win the Compitition.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X