Intinti Gruhalakshmi Today Episode: తులసి ఉచ్చులో పడ్డ లాస్య.. ఫోన్ కాల్ యాక్టింగ్‌తో కథలో ట్విస్ట్

టెలివిజన్ చరిత్రలోనే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. లాస్యకు తులసి ఫోన్ చేయగా ఆమె కట్ చేయకుండా అలాగే ఉంచుతుంది. ఆ సమయంలో నందూ.. తులసిని తిడుతూ.. లాస్యను పొగుడుతూ మాట్లాడతాడు. ఆ తర్వాత లాస్యతో తులసి మాట్లాడుతూ.. తన ఇరవై లక్షలు కాజేసింది ఎవరో తెలిసింది అన్నట్లు చెబుతుంది.

దీంతో లాస్యకు ఎంతగానో భయం వేస్తుంది. ఆ తర్వాత అంకిత, దివ్యతో కలిసి తులసి ఒక ప్లాన్ రెడీ చేస్తుంది. అనంతరం భాగ్యను బాగా రెచ్చగొట్టిన లాస్య.. ఆమెను తులసి ఇంటికి పంపుతుంది. అక్కడకు రాగానే అందరూ అనుమానించినా తులసి మాత్రం ఆహ్వానిస్తుంది.

లాస్య నాటకం బయటపెట్టే ప్లాన్

లాస్య నాటకం బయటపెట్టే ప్లాన్

భాగ్య, లాస్య నాటకాన్ని బయటపెట్టేందుకు తులసి, దివ్య, అంకితలు కలసి అదిరిపోయే ప్లాన్ వేస్తారు. ఇందులో భాగంగానే అంకితే తులసికి ఫోన్ చేస్తుంది. కానీ, ఎవరో వేరే వ్యక్తి మాట్లాడినట్లు తులసి యాక్టింగ్ చేస్తుంది. ఆ సమయంలో భాగ్యకు ఏం జరుగుతుందో అర్థం కాక సతమతం అవుతుంది. ఆ తర్వాత తనకు ఫోన్ వచ్చినట్టు తులసి నటిస్తుంది. లోపలికి వెళ్లి మాట్లాడుతున్నట్టుగా చేస్తుంది. అప్పుడే భాగ్య బయటి నుంచి వచ్చి చాటుగా వింటుంది. ఆమె అక్కడే ఉందని తెలిసినా.. తులసి, అంకిత, దివ్యలు పిల్లి వచ్చినట్లు గట్టిగా మాట్లాడతారు.

అడ్రెస్ నోట్ చేసేసుకున్న భాగ్య

అడ్రెస్ నోట్ చేసేసుకున్న భాగ్య

తన ప్లాన్ ప్రకారమే భాగ్యకు వినిపించేలా తులసి మాట్లాడుతూ.. 'ఆ బ్యాంక్ బ్రోకర్ రంజిత్ గాడు ఎక్కడున్నాడో తెలిసిపోయిందా? ఎక్కడున్నాడు.. అడ్రస్ ఏంటి' అని ఫోన్‌లో అడుగుతుంది. అవతలి వ్యక్తులు ఏదో అడ్రస్ చెప్పినట్టుగా తులసి ఆ అడ్రస్‌ను బయటికి చెబుతుంది. దీంతో దాన్ని భాగ్య నోట్ చేసుకుంటుంది. ఫోన్ కట్ చేసిన తర్వాత అంకిత 'ఆంటి.. ఆ రంజిత్ గాడు దొరికాక వాడి వెనుక ఎవరు ఉన్నారో వాళ్ల సంగతి తేలుస్తా' అని భాగ్యకు వినపడేలా మాట్లాడుతుంది. అప్పుడు భాగ్య వెంటనే ఈ వార్త లాస్య చెవిన వేయాలి అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

లాస్యకు విషయం చెప్పిన భాగ్య

లాస్యకు విషయం చెప్పిన భాగ్య

మరోవైపు, తులసి ఇంట్లో ఏం జరుగుతుందో ఏమో అని లాస్య తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో ఆమెకు భాగ్య కాల్ చేస్తుంది. అప్పుడు లాస్య హలో భాగ్య ఏమైపోయావు అని అడుగుతుంది. దీనికామె నీకేంటి నువ్వు అక్కడ బాగానే ఉన్నావు అంటుంది. దీంతో ముందు అక్కడ ఏం జరుగుతోందో చెప్పు అని అడుగుతుంది లాస్య. అప్పుడు భాగ్య 'ఇంకాసేపట్లో నీ చేతులకు బేడీలు వేయడానికి పోలీసులు వచ్చినా వస్తారు. ఆ రంజిత్ గాడి అడ్రస్ తులసికి తెలిసిపోయింది' అని అంటుంది. ఆ మాట చెప్పగానే లాస్య భయంతో వణికిపోతూ ఉంటుంది.

తులసి ఉచ్చులోనే పడిన లాస్య

తులసి ఉచ్చులోనే పడిన లాస్య

లాస్యతో ఫోన్‌లో మాట్లాడుతోన్న సమయంలో భాగ్య 'తులసి అక్క మనుషులు ఆ రంజిత్ గాడి చొక్కా పట్టుకొని ఇక్కడికి లాక్కొస్తున్నారట. వాడిని నాలుగు పీకితే వాడు ముందు మన గురించి చెబుతాడు. ఆ తర్వాత మనకు చిప్పకూడే గతి' అని లాస్యతో అంటుంది. దీంతో లాస్య 'అర్జెంట్‌గా మనం ఒక పని చేయాలి. ఆ రంజిత్ గాడు ఎక్కడున్నాడో వాడి అడ్రస్ నీకు తెలుసు కదా. తులసి మనుషుల కంటే ముందు మనం వెళ్లి వాడిని తప్పిద్దాం' అంటుంది. దీనికి భాగ్య దానికి ఫోన్ చేస్తే అయిపోతుంది కదా. మనం వెళ్లడం ఎందుకు అంటుంది. కానీ, లాస్య ఒప్పుకోదు.

లాస్య ఢీలా... తులసేమో ఖుషీగా

లాస్య ఢీలా... తులసేమో ఖుషీగా

భాగ్యతో మాట్లాడిన తర్వాత నుంచి లాస్య టెన్షన్ పడటం చూసి నందూ.. ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు. దీంతో ఆఫీసు టెన్షన్ అంటుంది. దీనికి అతడు రిజైన్ చేయి అంటాడు. ఆ తర్వాత నువ్వు రెడీగా.. ఈవెనింగ్ సరదాగా బయటికెళ్లి వద్దాం. ఎంజాయ్ చేసి వద్దాం అంటాడు. దీంతో సరే అన్నట్టుగా తల ఊపుతుంది. మరోవైపు తమ ప్లాన్ వర్కవుట్ అవుతున్నందుకు తులసి, అంకిత, దివ్య సంతోషిస్తారు. అప్పుడు దివ్య 'ఇంత తెలివి ఇన్నాళ్లు ఎక్కడ దాచుకున్నావు మామ్. ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నావు' అని అంటుంది.

రోడ్డున పడడం మీరే చూస్తారని

రోడ్డున పడడం మీరే చూస్తారని

దివ్య మాటలకు తులసి 'అప్పటికీ ఇప్పటికీ మీ అమ్మ ఒకేలా ఉంది. ఒకేలా అందరినీ అభిమానిస్తోందివ. నా దారి మారలేదు కానీ.. నడిచే పద్ధతి.. ఆలోచించే విధానం మారింది. దీనివల్లే మీ అమ్మ చాలాసార్లు ఓడిపోయింది. అయినా మీ అమ్మ వెనక్కి తగ్గే పిరికిది మాత్రం ఎప్పటికీ కాదు. ఇక, మనకంటే ముందే ఆ రంజిత్ గాడిని పట్టుకోవాలన్న ఆరాటంలో లాస్య, భాగ్య కంగారుగా రోడ్డున పడతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీ కళ్లతో మీరే చూద్దురు కానీ.. రెడీ అయిపోండి' అని అంటుంది. దీంతో అంకిత, దివ్య ఏం జరుగుతుందో అని ఆసక్తిగా చూస్తుంటారు.

శృతికి శుభవార్త.. ప్రేమ్‌కు షాక్

శృతికి శుభవార్త.. ప్రేమ్‌కు షాక్

ఉదయాన్నే పేపర్ చదివిన తులసి.. అందులో ఓ మ్యూజిక్ కాంపిటీషన్ గురించి ఉన్న యాడ్‌ను చూస్తుంది. అందులో గెలిస్తే రూ. 5 లక్షలు ప్రైజ్‌మనీ వస్తుందని ఉంటుంది. ఆ వెంటనే శృతికి ఫోన్ చేస్తుంది. 'ఈరోజు న్యూస్ పేపర్‌లో పాంప్లెట్ ఉంది చూడు అని చెబుతుంది శృతికి. అందులో గెలిస్తే 5 లక్షలు బహుమతి. ఎవరి మీదా ఆధారపడకుండా వాడంతట వాడే ఆల్బమ్ చేసుకోవచ్చు. వాడిని పాల్గొనమని చెప్పు' అని అంటుంది. దీంతో శృతి సరే అంటుంది. మరోవైపు, ప్రేమ్‌కు మ్యూజిక్ డైరెక్టర్ మప్పీ లహరి గిటార్ వాయించమని ఆఫర్ ఇస్తాడు. కానీ, అతడు ప్లే చేసేది ఆయనకు నచ్చదు. దీంతో 'వద్దు ఆపు అంటాడు. వెళ్లు నీకు ప్లే చేయడం చేతకాదు.. వెళ్లి కుర్చీలు తూడ్చుకో' అని షాకిస్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X