For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi July 30th Episode: తప్పు చేశానని ఏడ్చిన నందూ.. ఆమెకు అడ్డంగా దొరికిపోయిన అంకిత

  |

  సుదీర్ఘ కాలంగా పోలిస్తే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  తండ్రి కోసం వచ్చిన నందూ.. కన్నీరు

  తండ్రి కోసం వచ్చిన నందూ.. కన్నీరు

  తండ్రి అనారోగ్యానికి కారణమయ్యానని బాధ పడుతున్న నందూ.. తులసి ఇంటికి వస్తాడు. వచ్చీ రావడమే ‘ఎలా ఉన్నారు నాన్న' అని అడుగుతాడు. అప్పుడు ‘నువ్వు రానంత వరకూ బాగానే ఉన్నాను' అంటూ బదులిస్తాడు. దీంతో నందూ ‘ఇప్పటికే నా వల్ల మీకు ఇంత కష్టం వచ్చిందని గిల్ట్ ఫీల్ అవుతున్నా. ఇప్పుడు మీరు ఇలా మాట్లాడతారేంటి నాన్న' అంటూ ఏడుస్తుంటాడు.

  Guppedantha Manasu July 29th Episode: తల్లితో కలవడంపై రిషి క్లారిటీ.. వాళ్లిద్దరిని అక్కడ చూసి షాక్

  తులసికి మళ్లీ న్యాయం చేయగలవా?

  తులసికి మళ్లీ న్యాయం చేయగలవా?

  ఎంత చెప్పినా పరందామయ్య వినడు. ఆ సమయంలో నందూ తనను క్షమించానని చెప్పండి అంటూ వేడుకుంటాడు. దీంతో ఆయన ‘కొడుకువు కాబట్టి నిన్ను క్షమించేస్తాను. మరీ నువ్వు తులసికి చేసిన అన్యాయాన్ని పూడ్చగలవా? లాస్యను వదిలిపెట్టి వచ్చేయగలవా? తులసికి మామయ్యగా మాత్రం నిన్ను క్షమించలేను. నేను చచ్చాక చితికి నిప్పు పెట్టు చాలు' అని అంటాడు.

   సాటి మనిషిగా కూడా చూడలేనంటూ

  సాటి మనిషిగా కూడా చూడలేనంటూ


  నందూతో మాట్లాడడంతో ఇష్టంలేక లోపలికి వెళ్లిపోతాడు తండ్రి. ఆ సమయంలో తులసిని పిలుస్తాడు నందూ. కానీ, ఆమె మాత్రం మాట్లాడడానికి ఇష్టపడదు. అప్పుడు ‘విడాకులు ఇచ్చినంత మాత్రాన సాటి మనిషిగా కూడా మాట్లాడలేవా' అని అంటాడు. దీనికి ‘ఇప్పుడు మీకు నా అవసరం వచ్చిందా? నా మనసు కూడా మీతో మాట్లాడడానికి ముందుకు రావడం లేదు' అని అంటుంది.

  లాస్య ప్లాన్‌ను అమలు చేసిన అంకిత

  లాస్య ప్లాన్‌ను అమలు చేసిన అంకిత

  లాస్య చెప్పిన మాటలకు అనుగుణంగా అంకిత అమలు చేయాలని చూస్తుంది. ఇందుకోసం ప్రేమ్, దివ్యతో వాదనకు దిగుతుంది. ‘అంకుల్‌ను తాతయ్య ఇంటికి రావద్దని అంటున్నారు. మీరు కూడా ఆయనను దూరం చేసుకుంటారా? తప్పు చేసినంత మాత్రాన క్షమించరా? తులసి ఆంటీ కూడా తప్పు చేస్తే ఇలానే చేస్తారా' అంటాడు. దీనికి ‘మా అమ్మ తప్పు చేయదు' అంటూ వెళ్లిపోతాడు ప్రేమ్.

  రామచంద్రకు విషయం చెప్పిన తులసి

  రామచంద్రకు విషయం చెప్పిన తులసి

  ఫ్యాక్టరీ తీసుకుంటానని చెప్పిన తులసి కోసం రామచంద్ర వేచి చూస్తుంటాడు. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి మధ్య చర్చ జరుగుతుంది. అప్పుడు మామ ఆపరేషన్ కోసం ఇల్లు తాకట్టు పెట్టిన విషయాన్ని ఆయనకు చెబుతుంది. దీంతో ఆయన కొంత కాలం వేచి చూస్తుంటానని చెబుతాడాయన. ఆ తర్వాత డబ్బుల కోసం మాధవి, మోహన్ సహాయం తీసుకోవాలని నిర్ణయం తీసుకుంటుంది తులసి.

   లాస్యకు అంకిత ఫోన్.. భాగ్య భరోసాగా

  లాస్యకు అంకిత ఫోన్.. భాగ్య భరోసాగా

  లాస్య, నందూను తిరిగి ఇంటికి తీసుకొచ్చేందుకు అంకిత చేసిన ప్లాన్ ప్రేమ్ వల్ల వర్కౌట్ కాదు. ఈ విషయాన్ని ఆమెకు ఫోన్ చేసి చెబుతుంది. దీంతో లాస్య నిరాశకు లోనవుతుంది. అప్పుడు పక్కనే ఉన్న భాగ్య ఆమెకు భరోసా ఇచ్చేలా మాట్లాడుతుంది. ‘ఎవరెస్ట్ ఎక్కేంత కష్టమా? బావగారిని వలలో వేసుకునేంత కష్టమా? నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టడం ఈజీనే' అని చెబుతుంది.

  ఎన్టీఆర్ షోలో చరణ్ ఆట అదుర్స్: ‘ఎవరు మీలో కోటీశ్వరులు' ఎపిసోడ్ లీక్.. మెగా హీరో ఎంత గెలిచాడంటే!

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
   అంకిత కొత్త ప్లాన్లు తెలుసుకున్న శృతి

  అంకిత కొత్త ప్లాన్లు తెలుసుకున్న శృతి

  అంకిత.. లాస్యతో మాట్లాడిన మాటలను శృతి వింటుంది. అప్పుడు ‘నువ్వు ఆంటీకి ఎంతో ద్రోహం చేస్తున్నావ్. ఈ విషయాన్ని వాళ్లకు చెప్పేస్తాను' అంటుంది. దీనికి అంకిత ‘నువ్వు చెప్పావనుకో.. ప్రేమ్ నాతో గొడవ పడతాడు. అప్పుడు అభికి తనకు గొడవ అవుతుంది. అది నీ వల్లే అవుతుంది' అని భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ, శృతి మాత్రం అందరికీ చెప్పేస్తానని అంటుంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 385: Parandhamaiah Asked Some Demands to Nandhu. Then Ankitha Try to Manipulate Prem and Divya. After That Shruthi Heared Ankitha Plans.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X