Intinti Gruhalakshmi Today Episode: తులసి వింత ప్రవర్తన.. షాక్‌లో నందూ, లాస్య.. చివరకు ఇలా!
ఇండియాలోని చాలా ఇండస్ట్రీలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. హనీతో కలిసి పెర్ఫార్మెన్స్ చేయాల్సిన టీచర్ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతుంది. దీంతో తులసి ఈ విషయాన్ని సామ్రాట్‌కు చెబుతుంది. అప్పుడు అతడు అక్కడ మొత్తం వెతుకుతాడు. కానీ, ఆమె కనిపించదు. దీంతో తులసి వెళ్లి ఆ టీచర్ స్థానంలో హనీతో కలిసి డ్యాన్స్ చేస్తుంది. దీంతో సామ్రాట్ సంతోషించగా.. నందూ, లాస్య షాక్ అవుతారు. అనంతరం హనీ, లక్కీ విజేతలుగా నిలుస్తారు. అప్పుడు హనీ తనతో పాటు ప్రైజ్ తీసుకునేందుకు తులసిని కూడా స్టేజ్ మీదకు రావాలని కోరడంతో ఆమె కూడా వెళ్తుంది.

హనీ సంతోషం.. సామ్రాట్ ఆలోచన
కాంపిటీషన్‌లో విజయం సాధించిన తర్వాత హనీ ఎంతో సంతోషంగా ఇంటికి వస్తుంది. అప్పుడు వాళ్ల తాతయ్య, తండ్రి సామ్రాట్‌తో ఆనందాన్ని పంచుకుంటుంది. 'నేను ఈ ట్రోఫీని మామూలుగా సాధించింది కాదు. దీనికోసం ఎంతో కష్టపడ్డాను. ఇది గెలిచిన తర్వాత అందరూ నన్ను పైకి లేపి నడిపించారు. స్కూల్‌లో నన్ను ఎంతగానో అభినందించారు' అని చెప్తుంది. ఆ తర్వాత ఆ ట్రోఫీతో హనీ ఫోజులు ఇస్తుండగా.. సామ్రాట్ వాళ్ల బాబాయి ఆ చిన్నారిని ఫొటోలు తీస్తాడు. కానీ, సామ్రాట్ మాత్రం అప్పుడు ఏదో ఆలోచనలో ఉండడం ఆయన గమనిస్తాడు.

తులసిపై సామ్రాట్ ప్రశంసల వర్షం
సామ్రాట్ ఏదో ఆలోచిస్తూ ఉండడం చూసిన వాళ్ల బాబాయి ఏమైందని ప్రశ్నిస్తాడు. అప్పుడు సామ్రాట్ తన కూతురు సంతోషాన్ని చూసి తనకు కూడా ఎంతో ఆనందంగా ఉందని చెబుతాడు. అంతేకాదు, అసలు హనీ గెలవడానికి కారణం తులసే అన్న విషయాన్ని అప్పుడు ప్రస్తావిస్తాడు. 'అసలు తులసి లేకపోతే ఈరోజు హనీ గెలిచేది కాదు. తను ఇంత ఆనందంగా ఉండేది కాదు. ఈరోజు అంతా మంచిగా జరిగిందే దానికి కారణం తులసే. తులసి పక్కన ఉంటే హనీ చాలా ధైర్యంగా, సంతోషంగా ఉంటుంది' అంటూ చెప్తాడు. దీంతో బాబాయి కూడా ఆలోచనలో పడతాడు.

తులసి ఇంటికి నందూ, లాస్య రాక
తులసి ఇంట్లో అందరూ ఉండడంతో సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఆ సమయంలోనే ఫ్యామిలీ ఫొటోను చూసుకుంటూ తులసి పిల్లలు పాత విషయాలను గుర్తు చేసుకుంటారు. ఆ తర్వాత ప్రేమ్, అభి కలిసి విజిల్స్ వేస్తూ ఆనందంగా గడుపుతారు. అప్పుడు పరందామయ్య 'ఈ ఆనందాన్ని మంచి బ్రేక్ ఫాస్ట్ చేస్తూ అనుభవిద్దామా' అని అడుగుతాడు. కానీ, తులసి మాత్రం అందరూ అడిగినట్లు కాకుండా.. ఇడ్లీ మాత్రమే చేస్తానని అంటుంది. అప్పుడు అందరూ చీటింగ్ చీటింగ్ అంటూ గొడవ చేస్తుంటారు. అప్పుడే నందూ, లాస్య అక్కడికి ఎంట్రీ ఇస్తారు.

నందూ... లాస్యను అవమానిస్తూనే
లాస్య, నందూ అక్కడకు రాగానే పరందామయ్య 'చీటింగ్ చీటింగ్ అనగానే ఈ చీటర్స్ ప్రత్యక్షమయ్యారేంటి' అంటూ సెటైర్ వేస్తాడు. అప్పుడు అక్కడే ఉన్న అనసూయ 'ఈ ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారని తెలిసిపోయినట్లుంది.. ఇక గొడవ పెట్టడానికి వచ్చుంటారు. అది వాళ్లకు అలవాటే కదా' అంటుంది. దీంతో నందూ 'బెదిరిస్తున్నారు ఏంటి? మేము సామ్రాట్ గారు వాళ్ళ కంపెనీలో పెద్ద పొజిషన్స్‌లో ఉన్నాము అది మర్చిపోవద్దు' అని అంటాడు. అప్పుడు తులసి 'అంతేకదా.. నేనెవరో తెలుసా? సామ్రాట్ గారితో కలిసి బిజినెస్ చేస్తున్నా' అంటుంది.

తులసి ప్రవర్తనతో నందూ షాక్‌లో
ఆ తర్వాత దివ్యను అది ఇంగ్లీషులో ఎలా చెప్పాలమ్మా అని అడుగుతుంది. దీంతో బిజినెస్ పార్టనర్ మమ్మీ అంటుంది. అప్పుడు తులసి 'అర్థమైందిగా నేనేంటో ఇప్పుడు నాతో ఎలా మాట్లాడుకోవాలో ఎలా మసులుకోవాలో మీరే డిసైడ్ చేసుకోండి. మీరు ఇలా చేస్తే నష్టం నాకు కాదు మీకే. మీరే సామ్రాట్ గారికి సమాధానం చెప్పల్సి వస్తుంది' అని అంటుంది. అప్పుడు నందూ షాక్ అవుతాడు. ఆ తర్వాత తులసి మేడం అని పిలుస్తాడు. అప్పుడు 'జరిగిందంతా మర్చిపోండి' అంటాడు. దీనికి తులసి 'మీరు చేసిందా? మీరిద్దరూ కలిసి చేసిందా' అంటుంది.

అలాంటి హక్కు నాకు లేదా అంటూ
ఇక, నందూ 'తులసి మేడం.. మీ మ్యూజిక్ స్కూల్‌కు సంబంధించిన డిజైన్స్ పట్టుకొచ్చాం. మీరు చూసి ఓకే అంటే ఇక వర్క్ స్టార్ట్ చేద్దాం' అంటూ తన వెంట తీసుకొచ్చిన డిజైన్ల గురించి వివరించి చెబుతాడు. అనంతరం 'ఇది మేడం ప్లాన్.. మీకు ఓకేనా' అని అడుగుతాడు. దీనికి తులసి 'ప్లాన్ నాకు నచ్చలేదు' అంటుంది. దీంతో ఎందుకు అని నందూ అడుగుతాడు. అప్పుడు తులసి 'మీకు నచ్చకపోతే చిన్న చిన్న కారణాలు చెప్పి బంధాలను సులువుగా పెళ్లి చేసుకుంటారు. కానీ ఓ స్కూల్ బిల్డింగ్ ప్లాన్ నచ్చలేదని స్వేచ్చగా చెప్పే హక్కు కూడా నాకు లేదా? మీకు నాకు తేడా ఏంటి మీరు మగవారు.. నేను ఆడదానిననా' అని అడుగుతుంది. దీంతో నందూ షాక్ అవుతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











