For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi July 31st Episode: తులసి ఆశలపై నీళ్లు పోసిన మోహన్.. తాత చనిపోతాడని భయపెట్టి!

  |

  మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసికి న్యాయం చేయాలి.. లాస్యను వదిలేయాలి అని పరందామయ్య నందూ ముందు కొన్ని డిమాండ్లను ఉంచుతాడు. అనంతరం అంకిత.. దివ్య, ప్రేమ్‌ను మార్చాలని చూస్తుంది. కానీ, వాళ్లు మాత్రం ఆమెకు ఎదురు చెబుతారు. దీంతో లాస్యకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెబుతుంది అంకిత. అప్పుడు ఆమె మాట్లాడిన మాటలను శృతి వినేస్తుంది.

  అతడిపై రష్మీ గౌతమ్ రొమాంటిక్ కామెంట్స్: హీరో ఫొటో గోడ మీద.. అది మాత్రం బెడ్‌ మీద అంటూ!

  నువ్వలా చేస్తే తాతయ్య చనిపోతారు

  నువ్వలా చేస్తే తాతయ్య చనిపోతారు

  అంకిత మాటలను విన్న శృతి.. ఆమె నిజస్వరూపం అందరికీ చెబుతానని అంటుంది. అప్పుడు అంకిత ‘చెప్పు చెప్పు.. పాపం తాతయ్య ఇప్పుడే ఆపరేషన్ చేయించుకుని వచ్చారు. నువ్వు గొడవ పెట్టడం వల్ల ఇంట్లో గొడవలై ఆయన ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఆయన చావుకు కారణం అవుతావా? నువ్వు పోల్‌కు ఉన్న జెండా లాంటి దానివి మాత్రమే' అంటూ శృతితో అంటుంది.

  మాధవి, మోహన్‌ల చెంతకు తులసి

  మాధవి, మోహన్‌ల చెంతకు తులసి

  ఫ్యాక్టరీ తీసుకోడానికి కావాల్సిన డబ్బుల కోసం మాధవి, మోహన్‌ల సహాయం కోరేందుకు వాళ్ల ఇంటికి వస్తుంది తులసి. ఆ సమయంలో ఇబ్బందిగానే వాళ్లకు విషయం చెబుతుంది. దీనికి స్పందిస్తూ మోహన్ ‘నీకు సాయం చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కాకపోతే ఇల్లు కొనడానికి ఈ మధ్యనే వాళ్లకు అడ్వాన్స్ ఇచ్చాము. రెండు నెలలు ఆగితే మనీ వస్తుంది' అని అంటాడు.

   నగలు అమ్ముకోమని ఇచ్చిన మాధవి

  నగలు అమ్ముకోమని ఇచ్చిన మాధవి

  మోహన్ డబ్బులు లేవని చెప్పగానే తులసి బయటకు వచ్చేస్తుంది. దీంతో మాధవి వెనక్కి పిలుస్తుంది. అంతేకాదు, తన నగలును తీసుకుని వచ్చి అమ్ముకోమని చెబుతుంది. దీంతో తులసి కన్నీటి పర్యంతం అవుతుంది. కానీ, ఆ నగలు అమ్మడానికి ఇష్టపడదు. ఆ సమయంలో మాధవి, మోహన్ ఎంతగా బ్రతిమాలినా తులసి మాత్రం ఒప్పుకోకపోగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

  Guppedantha Manasu July 30th Episode: తల్లి ఆశలపై నీళ్లు చల్లిన రిషి.. పార్టీకి అందుకే వచ్చానంటూ!

  ఇంట్లో నుంచి వెళ్లడానికి కారణం నువ్వే

  ఇంట్లో నుంచి వెళ్లడానికి కారణం నువ్వే

  స్కూటీ మీద ఇంటికి వస్తున్న తులసికి నందూ ఎదురుగా వస్తాడు. ఫుల్లుగా తాగేసి ఉన్న అతడు.. తులసి మీద నిందలు వేస్తాడు. ‘నీ వల్లే నేను ఇంట్లో నుంచి వెళ్లిపోయా. లేకపోతే మా అమ్మానాన్నలతో సంతోషంగా ఉండేవాడిని' అంటాడు. అప్పుడు తులసి ‘నేను మిమ్మల్ని వెళ్లిపోమనలేదు. లాస్యను పంపేశా. మరి మీరెందుకు వెళ్లిపోయారు' అని ఎదురు ప్రశ్నిస్తుంది.

  నందూకు ఫ్యామిలీని ఇచ్చేయ్ తులసి

  నందూకు ఫ్యామిలీని ఇచ్చేయ్ తులసి

  నందూ ‘నాకు ఏ ఇల్లు లేదు. ఎవరూ లేరు' అంటూ అరుస్తూ పడిపోతాడు. దీంతో అతడిని ఇంట్లో దిగబెడుతుంది తులసి. అప్పుడు లాస్య వచ్చి ‘ఎందుకు నందూను బాధ పెడుతున్నావ్? తన ఫ్యామిలీని తనకు ఇచ్చేయొచ్చు కదా' అంటుంది. అప్పుడు ‘అక్కడ అందరూ ఆయనను అంగీకరించాలి. నేను బలవంతంగా ఈయనను అక్కడకు తీసుకెళ్లలేను' అంటూ సమాధానం ఇస్తుంది.

  నాటకాలు ఆడుతున్నావ్.. వద్దు అంతే

  నాటకాలు ఆడుతున్నావ్.. వద్దు అంతే

  లాస్య మాట్లాడుతూ.. ‘నువ్వు ఆయనను వలలో వేసుకోడానికి ట్రై చేస్తున్నావ్.. ఆయనకు మళ్లీ దగ్గరయ్యేందుకు నాటకాలు ఆడుతున్నావ్' అని నిందలు వేస్తుంది. అప్పుడు తులసి ‘ఒకసారి ప్రేమగా.. ఒకసారి ధ్వేషంగా ఉంటున్నది ఆయన. అయినా ఆయనను వలలో వేసుకునే అవసరం లేదు. నేను ఒక్కసారి వద్దు అన్నానంటే వద్దు అంతే' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

  గృహలక్ష్మి హీరోయిన్ కస్తూరి పర్సనల్ ఫొటోలు: సీరియల్‌లో అలా.. రియల్‌గా ఇలా.. లేటు వయసులో ఘాటు ఫోజులు

  Tappinchukoleru Movie Teaser - Suspense Thriller | Filmibeat Telugu
  ప్రేమ్‌కు సర్ధి చెప్పడానికి అభి యత్నం

  ప్రేమ్‌కు సర్ధి చెప్పడానికి అభి యత్నం

  తండ్రి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉన్న ప్రేమ్ దగ్గరకు అభి వస్తాడు. ‘కోప్పడనంటే ఓ విషయం చెబుతా. నాన్నను మళ్లీ ఇక్కడకు తీసుకు వద్దాం. ఎంత కాదనుకున్నా ఆయన మన తండ్రి. చిన్నప్పటి నుంచి మనకు ఏది కావాలంటే అది ఇచ్చారు. ఎన్ని తప్పులు చేసినా క్షమించారు. అలాంటిది మనం ఒక్కసారి క్షమించకూడదా' అని సర్ధఇ చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు.

  English summary
  Intinti Gruhalakshmi Episode 386: Tulasi Asked Money to Mohan and Madhavi. But They Spent Money for New House. Then Madhavi Gave Gold To Tulasi. After That Heated Argument Between Tulasi and lasya.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X