Intinti Gruhalakshmi: భర్తను వదిలేసిన దివ్య.. విక్రమ్‌కు మరో పెళ్లి.. లాస్య, రాజ్యలక్ష్మి ప్లాన్

ఎప్పటికప్పుడు కొత్త కొత్త షోలు వస్తున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తన తల్లిదండ్రులపై అందరూ నిందలు వేస్తుండడంతో దివ్య సర్ధి చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ, రాజ్యలక్ష్మి, బసవయ్య, లాస్య ఆమెపై ఎదురుదాడి చేస్తుంటారు. దీంతో దివ్య కూడా వాళ్లకు ఎదురు తిరిగి మాట్లాడుతుంది. అంతేకాదు, రాజ్యలక్ష్మిని సైతం రెండో పెళ్లి చేసుకున్నావు కదా అంటూ మాట్లాడుతుంది. దీంతో విక్రమ్ ఆమెను కొట్టబోతాడు. అప్పుడు దివ్య ఇంట్లో నుంచి వెళ్లిపోతానని అంటుంది. ఆ సమయంలో రాజ్యలక్ష్మి యాక్టింగ్ మొదలు పెడుతుంది. అయినా విక్రమ్ మాత్రం దివ్యను పట్టించుకోడు.

Intinti Gruhalakshmi

చిన్న పిల్లల ఆట కాదు అంటూ: దివ్య వెళ్లిపోడానికి రెడీ అవడంతో బసవయ్య 'పోతానని గడపదాటాలని అనుకుంటుంది. ఎవర్ని బెదిరిస్తుంది? వెళ్లనివ్వు అక్కా' అంటాడు. ప్రసన్న 'ఇప్పుడు వెళ్లినా.. మళ్లీ వాళ్ల అమ్మా నాన్న తీసుకొస్తారు' అనడంతో విక్రమ్ 'అలాజరగనివ్వను. ఒక్కసారి గడపదాటాక మళ్లీ వెనక్కి వచ్చే అవకాశం ఇవ్వను. గడపదాటక ముందే ఆలోచించుకోమని చెప్పండి తాతయ్యా. ఇదేం చిన్న పిల్లల ఆట కాదు. ఇష్టం వచ్చినప్పుడు రావడానికి ఇష్టం లేనప్పుడు వెళ్లిపోవడానికి. ఈ గడపదాటిందంటే మా అమ్మను అవమానించినట్టే.. నన్ను అవమానించినట్టే' అని అంటాడు.

ఇంటి నుంచి వెళ్లిపోయిన దివ్య: విక్రమ్ మాటలకు రాజ్యలక్ష్మి తప్పురా అలా మాట్లాడొద్దు అంటుంది. దీనికతడు 'అతి మంచితనం కూడా పనికి రాదమ్మా. నీపై నిందలు వేస్తున్న దివ్య గురించి ఎందుకంత తాపత్రయం' అని ప్రశ్నిస్తాడు. అప్పుడామె 'దివ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదరా'.. అని అనగా.. 'ప్రేమ లేదని డిసైడ్ అయింది కదా ఇంకేంటి? నాకు నా తల్లిపై ఉన్న ప్రేమకంటే ఏదీ ఎక్కువ కాదు' అని వెళ్లిపోతాడు. ఆ వెంటనే దివ్య.. విక్రమ్ తాత కాళ్లకు నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత విక్రమ్‌తో జరిగిన విషయాలను అన్నీ గుర్తు చేసుకుని బాధ పడుతుంది.

Intinti Gruhalakshmi

పుట్టింట్లో దివ్య.. పర్మీషన్ కావాలా: దివ్య పరిస్థితి గురించి పరందామయ్య 'రేయ్ నందూ.. దివ్య ఎలా ఉందో ఏంటో కనుకున్నారా? అది చిన్న పిల్లరా.. జీవితం విలువ తెలియని పిల్లరా.. మనం పట్టించుకోకపోతే దివ్యను ఎవరు పట్టించుకుంటారు. నువ్వైనా అడగాలి కదమ్మా' అని అంటాడు. దీనికి తులసి 'విక్రమ్‌పై నాకు నమ్మకం ఉంది.. తనే సర్దిచెప్తాడు' అని అంటుంది. అంతలోనే అక్కడకు దివ్య బ్యాగ్ సర్దుకుని వస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. తర్వాత దివ్య 'అమ్మా నేను నా గదిలోకి వెళ్లొచ్చా' అనగా.. తులసి 'ఇది నీ ఇల్లు.. దీనికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు' అని అంటుంది. తర్వాత అసలు ఎందుకు వచ్చావని వాళ్లు అడగ్గా దివ్య మాత్రం సమాధానం చెప్పదు.

దెబ్బ మీద దెబ్బ కొట్టాలంటూ: దివ్య వెళ్లిపోవడంతో రాజ్యలక్ష్మి, లాస్య సంతోషంగా ఉంటారు. అప్పుడు లాస్య 'నందు గోపాల్ పుట్టినరోజు కూతురి కాపురం కూల్చడానికే వచ్చింది' అని అంటుంది. దీనికి రాజ్యలక్ష్మి 'అవును లాస్యా.. ఇంత తేలికగా పని అవుతుందని అనుకోలేదు. ఇక నుంచి దాని బతుకు పుట్టింట్లోనే' అని అంటుంది. దీంతో లాస్య 'అలా అని మనం తీరిగ్గా కూర్చోకూడదు రాజ్యలక్ష్మీ. విక్రమ్‌కు దివ్యపై ద్వేషాన్ని మించిన ప్రేమ ఉంది. అది ఏ క్షణంలోనైనా మనకి ప్రమాదమే. విక్రమ్ మనసు మారుతుంది. అందుకే దెబ్బ మీద దెబ్బ కొట్టాలి. అర్జెంట్‌గా వాళ్లను విడగొట్టాలి' అంటుంది.

Intinti Gruhalakshmi

మరో పెళ్లి చేసుకోరా మనవడా: దివ్య వెళ్లిపోయిన తర్వాత విక్రమ్ బాధ పడుతూ ఉండడంతో తాతయ్య వెళ్లి సర్ధి చెప్పబోతాడు. కానీ అతడు తనను తాను సమర్ధించుకుంటాడు. అంతేకాదు, 'నీకు మా అమ్మ అంటే ఇష్టం లేదు. అందుకే మా అమ్మను అన్ని మాటలు అంటున్నా నువ్వు మాట్లాడలేదు' అని అంటాడు. దీనికి తాతయ్య 'ఒరేయ్.. దివ్య చెప్పేది నిజంరా.. అర్ధం చేసుకోకుండా గెంటేశారు. ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకొని నువ్వు మీ అమ్మ హాయిగా ఉండండిరా. ఈసారి నువ్వు ఇష్టపడ్డ అమ్మాయిని కాకుండా.. మీ అమ్మకి ఇష్టమైన అమ్మాయిని చేసుకోరా' అని అంటాడు.

నువ్వు చేసిన పనికి ఏడువు: ఆ తర్వాత విక్రమ్ తాతయ్య 'ఈ ఇంటికి కావాల్సింది మీ అమ్మ మెచ్చే కోడలు. దివ్యపై నీ ప్రేమ అబద్దం. తన గురించి నీ దిగులు పెద్ద అబద్దం. దివ్య వెళ్తుంటే కనీసం అడ్డుపడలేదు. అమ్మ చెప్పింది వినడం తప్ప నీకంటే వ్యక్తిత్వం లేదు. రెక్కల్లో ఎరిగే బలం రాగానే తల్లి పక్షి పిల్ల పక్షిని వదిలేస్తుంది. మీ అమ్మ పక్షి నీ రెక్కలు విరగ్గొట్టి కూర్చోబెట్టింది. నీకు అది అర్ధం కావడం లేదు. అది అర్ధం అయిన రోజున దివ్య పడిన వేదన నీకు తెలుస్తుందిరా.. నీవ్వు చేసిన పనికి ఏడాల్సిందే' అని మనవడికి హితోపదేశం చేస్తాడు. దివ్య కూడా విక్రమ్ గురించి బాధ పడుతుంది.

Intinti Gruhalakshmi

తులసి అడిగినా చెప్పకుండా: బెడ్‌పై పడుకుని దివ్య 'నీపై నాకు ఏదో చిన్ని ఆశ. తప్పు తెలుసుకుని రమ్మంటావనే తాపత్రయం. ఇంకెప్పుడూ ఇలా జరగదని మాటస్తావని ఆరాటం. అందుకే మన గొడవ గురించి ఇంట్లో చెప్పలేదు. ఓపిగ్గా ఎదురుచూస్తున్నా విక్రమ్. నాకు దూరం అవుదాం అనే నిర్ణయించుకున్నావా? ప్రేమ ఇద్దరి వైపు నుంచి ఉంటేనే బంధం నిలబడుతుంది.. లేదంటే బంధం నిలవదు విక్రమ్.. మనిద్దరి విషయంలో జరగబోయేది అదేనేమో' అని ఏడుస్తుంది. అంతలో తులసి వచ్చి పిలవగా పడుకున్నట్లు నటిస్తుంది. దీంతో తులసి ఏదో చెప్పి వెళ్లిపోతుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X