Intinti Gruhalakshmi July 3rd Episode: విడాకులపై తేల్చేసిన తులసి.. నందూ వింత ప్రవర్తనకు లాస్య షాక్

మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. భర్తను అన్ని రకాలుగా ఓడిపోయావు అంటూ తిడుతుంది తులసి. ఆ తర్వాత లాస్య అతడిని తీసుకుని వెళ్లిపోతుంది. అనంతరం తులసిని తప్పు చేసేవేమో అని అంటాడు మామగారు. అప్పుడు ఆమె ఎమోషనల్‌గా మాట్లాడుతుంది. దీంతో ఫ్యామిలీ మొత్తం ఆమెకు అండగా ఉంటుంది. అటు నందూ కూడా తులసి అన్న మాటలకు బాధ పడతాడు.

 తులసి ప్రవర్తనతో షాక్ అయిన శృతి

తులసి ప్రవర్తనతో షాక్ అయిన శృతి

జరిగిన దాన్ని ఊహించుకుంటూ గార్డెన్ ఏరియాలోనే పడుకుంటుంది తులసి. ఉదయాన్ని శృతి వచ్చి ఆమెను నిద్ర లేపుతుంది. అంతేకాదు, లోపలికి వెళ్లి పడుకోండి.. పని మొత్తం నేను చూసుకుంటా అంటుంది. కానీ, దీనికి తులసి ఒప్పుకోదు. అంతలో వర్కర్లు వచ్చి మిషన్ కుడతామని అనగా అన్నీ మర్చిపోయి ఓకే చెబుతుంది తులసి. ఆమె తీరుకు శృతి షాక్ అవుతుంది.

 ఘటనతో తట్టుకోలేకపోతున్న నందూ

ఘటనతో తట్టుకోలేకపోతున్న నందూ

తులసి తనను వద్దనడంపై నందూ రగిలిపోతుంటాడు. ఈ క్రమంలోనే లాస్య ఆఫీస్‌కు రమ్మనగా రానంటాడు. అంతేకాదు, 'తులసి నన్ను వద్దనడమేంటి లాస్య? నేను కదా తనను వద్దనుకున్నది. ఇప్పుడు నన్నే కాదంటోంది. అలాగే, నేను ఓడిపోయా అంటుంది' అని బాధ పడతాడు. దీనికి షాకైన లాస్య.. 'ఏదైతే ఏంటి నందూ.. మనం అనుకున్నదే జరిగింది కదా' అని వెళ్లిపోతుంది.

 తులసి మాటకు శెభాష్ అన్న మామ

తులసి మాటకు శెభాష్ అన్న మామ

మామ, కొడుకు అడిగిన మాటలకు తులసి స్పందిస్తూ.. 'ఫంక్షన్‌లో జరిగిన దాన్ని మీరు భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. అందుకే అది పెద్దగా అనిపిస్తుంది. నేనే దాన్ని చాలా చిన్నగా చూస్తున్నాను. అందుకే ఇలా ఉన్నాను. బంధాలను వదిలి పారియపోయింది ఆయన కదా' అంటుంది. అప్పుడు మామగారు 'శెభాష్ తులసి. నువ్వు మరింత ఎదగాలి' అని కోరుకుంటాడు.

 తులసి ధైర్యంపై మామ, అభి ప్రశంస

తులసి ధైర్యంపై మామ, అభి ప్రశంస

రెడీ అయి వచ్చిన తులసి వర్కర్లతో పని చేయిస్తుంటుంది. అప్పుడు మామగారు, అభి అక్కడకు వస్తారు. 'జరిగిన దాన్ని ఊహించుకుని బాధ పడతావనుకుంటే.. ఇంత ఫ్రీగా ఉన్నావేంటి' అని మామగారు ప్రశ్నిస్తాడు. ఆ తర్వాత అభి కూడా 'అక్కడ జరిగింది చిన్న విషయం కాదు మామ్. నువ్వేంటి అదేమీ పట్టనంటూ మామూలుగా నీ పనులు చేసుకుంటున్నావ్' అని అడుగుతాడు.

 విడాకులు ఎప్పుడిస్తావంటూ ప్రశ్నలు

విడాకులు ఎప్పుడిస్తావంటూ ప్రశ్నలు

కోడలిని తన భర్త ప్రశంసిస్తోన్న సమయంలో అనసూయ అక్కడకు వచ్చి సూటి పోటి మాటలు అంటుంది. అంతేకాదు, నందూకు విడాకులు ఎప్పుడిస్తావని అడుగుతుంది. అప్పుడు తులసి 'విడాకులు ఇవ్వడం ఖాయం. మీ అబ్బాయిని రెడీగా ఉండమనండి. అయినా మీకు మీ కొడుకు సుఖమే కావాలి. సహా ఆడదాని బాధ అవసరం లేదు కదా' అని ఆమెను కడిగి పారేస్తుంది.

తులసి కావాలా? లాస్య కావాలా? అని

తులసి కావాలా? లాస్య కావాలా? అని

ఆ ఘటననే తలుచుకుంటూ బాధ పడుతోన్న నందూకు.. తన రెండు ఆత్మలు మాట్లాడుతున్నట్లు ఊహించుకుంటాడు. అందులో ఓ ఆత్మ తులసి వైపు.. మరో ఆత్మ లాస్య వైపు మాట్లాడుతుంది. ఈ సమయంలోనే ఆ రెండూ కలిసి తులసితోనే ఉండు.. లాస్యతోనే ఉండు అని అతడికి చెబుతుంటాయి. మరోవైపు, తులసికి స్కూటీ కొనుక్కుందాం అని శృతి ఓ విలువైన సలహా ఇస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X