Intinti Gruhalakshmi: బోనం పడేయాలని లాస్య ప్లాన్.. దివ్యను కాపాడిన రాజ్యలక్ష్మి.. అసలు ట్విస్ట్ అదే!

తరాలు మారుతూ వస్తున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. లాస్యకు ఉద్యోగం ఇవ్వాలని విక్రమ్ తీసుకున్న నిర్ణయంపై దివ్య అసంతృప్తిగా ఉంటుంది. కానీ, అతడు మాత్రం వెనక్కి తగ్గేదే లేదు అన్నట్లుగా మాట్లాడతాడు. దీంతో తనకు విలువ ఇవ్వడం లేదని దివ్య కోప్పడుతుంది. తర్వాత అక్కడకు నందూ, తులసి వచ్చి దివ్య వాళ్లను పంపించమని అడుగుతారు. దీంతో రాజ్యలక్ష్మి, బసవయ్య వాళ్లను అవమానిస్తారు. తర్వాత లాస్య అక్కడకు రావడంతో నందూ గొడవ చేస్తాడు. దీంతో విక్రమ్ ఆమె వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదన్నా లాస్య మాత్రం దివ్య వాళ్లను విడదీస్తానంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode July 3rd 2023

రెండో పెళ్లి జోక్.. దివ్య సెటైర్లు:దివ్యతో విక్రమ్ రెండో పెళ్లి గురించి జోకులు వేస్తాడు. దీనికామె 'పెళ్లై ఇన్నాళ్లు అయింది. శోభనమే ఇంకా జరగలేదు. అసలు జరుగుతుందో లేదో కూడా తెలీదు. కానీ, అయ్య గారు రెండోసారి పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. సిగ్గు లేకపోతే సరి. అదేదో సినిమాలో హీరోకి పెళ్లి కాకపోతే పెళ్లి కాని ప్రసాద్ అని పిలిచేవారు. ఇక నుంచి మిమ్మల్ని శోభనం కాని విక్రమ్ అని పిలుస్తారు. ఆ మాటతో అయినా మా అత్తగారిలో చలనం వస్తుందేమో చూడాలి' అని సెటైర్లు వేస్తుంది. దీంతో విక్రమ్ 'మన శోభనం గండం తొలగిపోవాలనే ఈరోజు ప్రత్యేకపూజ చేయిస్తుంది' అంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode July 3rd 2023

దివ్య సరసం... లాస్య ఎంటర్:విక్రమ్ ఆ మాట చెప్పగానే 'పంతులు గారు మనకు మొదటి రాత్రి జరగాలని మంత్రాలు చదువుతున్నారో లేక జరగకూడదని మంత్రాలు చదువుతున్నారో అడిగి తెలుసుకో. సర్లే ముందు లోపలికి వెళ్లి పట్టు పంచె కట్టుకుని రా' అని భర్తతో సరసంగా మాట్లాడుతుంది. అంతలోనే అక్కడకు లాస్య వస్తుంది. కానీ, దివ్య పట్టించుకోనట్లుగా వెళ్లిపోతుంది. దీంతో లాస్య 'ఏంటి నన్ను చూడగానే అలా పారిపోతున్నావు మీ నాన్నలాగ' అని అనగా దివ్య 'మా నాన్న గురించి మాట్లాడకు' అని సీరియస్ అవుతుంది.

నా దిష్టే తగులుతుంది అని:దివ్య సీరియస్ అవడంతో లాస్య 'ఓయ్ నందూ నీకు నాన్న కావచ్చు కానీ నాకు మాజీ మొగుడు. మాట్లాడే హక్కు నాకు ఉంది. మీ అమ్మ మాజీ మొగుడుతో కలిసి ఉంటే తప్పు లేదు కానీ, నేను మాట్లాడితే తప్పా? ఏంటో ఒక మొగుడు ఇద్దరు పెళ్లాలు ఉండటం చూశాం కానీ.. ఇలా ఇద్దరు మాజీ పెళ్లాలు ఉండటం భలే తమాషాగా ఉంది' అని మాట్లాడుతుంది. దీంతో దివ్య ఇక ఆపుతావా అని అరవగా 'సర్లే సర్లే.. ఇందాక మీ మొగుడు పెళ్లాల సరసాలు చూశాను. భలే ముద్దొస్తున్నారు. నా దిష్టే తగులుతుంది' అని అంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode July 3rd 2023

నన్ను ఎవరూ అడ్డుకోలేరు:లాస్య మాటలకు దివ్య 'ఏంటి శపిస్తున్నావా? నేను వెళ్లేది అమ్మవారి దగ్గరకు. అన్నీ ఆవిడే చూసుకుంటుంది. నీ శాపాలు ఏం పనిచేయవు' అని అంటుంది. దీంతో లాస్య 'మీ అమ్మతో కలిసి బోనం ఎత్తుతున్నానని మురిసిపోకు. అది ఎలా జరుగుతుందని అనుకున్నావు? మీ ఇద్దరి మధ్యలో నేను ఉన్నాను. బోనం ఎత్తనివ్వను' అని సవాల్ చేస్తుంది. దీనికి దివ్య 'మా ఇద్దరి మధ్యన నువ్వే కాదు.. మరో వందమంది లాస్యలు అడ్డువచ్చినా మేం బోనం ఎత్తకుండా అడ్డుపడలేరు' అని చాలెంజ్ చేస్తుంది. అప్పుడు లాస్య సర్లే గుడిలో తేల్చుకుందాం అని వెళ్లిపోతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode July 3rd 2023

బసవయ్య వెటకారం స్టార్ట్:ఉదయం అవగానే తులసి వాళ్లు గుడి దగ్గరకు వెళ్తారు. తర్వాత అక్కడకు దివ్య, విక్రమ్‌తో పాటు రాజ్యలక్ష్మి వాళ్లు కూడా ఎంట్రీ ఇస్తారు. అందరూ పలకరించుకున్న తర్వాత తులసి.. విక్రమ్ తాత గారు రాలేదని అడుగుతుంది. దీనికి బసవయ్య 'ముందు వచ్చిన వాళ్లను సరిగ్గా పలకరించండి.. ఆ తర్వాత రాని వాళ్ల గురించి ఎంక్వైరీ చేయొచ్చు' అని వెటకారంగా అంటాడు. దీంతో దివ్య 'ఏం అత్తయ్య గారూ.. మా వాళ్ల మర్యాద సరిపోలేదా' అని బదులిస్తుంది. దీంతో పరందామయ్య తమ మర్యాదల గురించి మాట్లాడతాడు. అప్పుడే అక్కడకు లాస్య కూడా వస్తుంది.

బోనం పడేయాలని ప్లాన్స్:అంతా అయిపోయిన తర్వాత దివ్యకు బోనం ఎత్తించాలని తులసి వెళ్తుంది. అప్పుడు లాస్య నందూ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. దీంతో అతడు ఆమెపై సీరియస్ అవుతాడు. అతడలా వెళ్లిపోగానే తులసితో లాస్య వాదనకు దిగుతుంది. అది చూసిన రాజ్యలక్ష్మి లాస్యను మందలిస్తుంది. ఏం చేసినా విక్రమ్‌కు తెలియకుండా చేయమని చెప్తుంది. అనంతరం దివ్య ఎత్తుకున్న బోనాన్ని కింద పడేయాలని ఓ ఆవిడకు లాస్య చెబుతుంది. దీంతో ఆమె పూనకం వచ్చినట్లుగా దివ్య పక్కకు వెళ్లి బోనం పడేయబోతుంది. అంతలోనే రాజ్యలక్ష్మి వచ్చి బోనం పట్టుకుంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode July 3rd 2023

ప్లాన్ ఫెయిల్ అయిందని:దివ్య బోనం కింద పడకుండా పట్టుకున్న రాజ్యలక్ష్మిని లాస్య పక్కకు తీసుకువెళ్లి ఎందుకలా చేశావు అని ప్రశ్నిస్తుంది. దీనికామె 'మన ప్లాన్ గురించి దివ్యకు మొత్తం తెలిసిపోయింది. మనం సెట్ చేసిన ఆవిడను ఆ దివ్య పట్టుకుని విక్రమ్‌కు నిజం చెప్పించాలని అనుకుంది. అదే జరిగి ఉంటే మనం అడ్డంగా దొరికిపోయే వాళ్లం' అని అసలు విషయం చెప్తుంది. తర్వాత దివ్యతో శాంతి పూజ చేయించి ఇబ్బంది పెట్టాలని రాజ్యలక్ష్మి అనుకుంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X