Intinti Gruhalakshmi Today Episode: అడ్డంగా దొరికిపోయిన లాస్య.. నందూకు మనీ గురించి తెలియడంతో!

తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఇంటికొచ్చిన భాగ్య దగ్గర తులసి తన ప్లాన్‌ను అమలు చేస్తుంది. ఇందులో భాగంగానే రంజిత్‌ను ఒక దగ్గర దాచి పెట్టామని తెలుసుకున్నట్లు ఆ అడ్రెస్‌ను చెబుతుంది. ఇదంతా చాటుగా విన్న భాగ్య.. వెంటనే లాస్యకు ఫోన్ చేసి ఈ విషయం చెబుతుంది. దీంతో ఆమె తులసి వాళ్లు రాకముందే మనం వెళ్లి రంజిత్‌ను విడిపిద్దాం అని భాగ్యతో అంటుంది. దీనికామె సరే అంటుంది. మరోవైపు, ప్రేమ్‌కు గిటార్ ప్లే చేయమని మప్పీ లహరి ఆఫర్ ఇస్తాడు. కానీ, అతడు ప్లే చేసింది నచ్చలేదని కోప్పడుతూ ప్రేమ్‌ను వెళ్లిపోమంటాడు.

తులసి ఉచ్చులో పడ్డ లాస్య, భాగ్య

తులసి ఉచ్చులో పడ్డ లాస్య, భాగ్య


తులసి ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు నటించి ఇచ్చిన అడ్రెస్‌కు లాస్య, భాగ్యలు భయంతో పరిగెత్తుకుంటూ వస్తారు. ఆ సమయంలో లాస్య తులసి చెప్పిన అడ్రస్ ఇదేనా అని భాగ్యను అడుగుతుంది. దీంతో ఇదే అంటుంది. అప్పుడు లాస్య 'కానీ.. ఇది చూడటానికి బూతు బంగ్లాలా ఉంది. రంజిత్‌కు ఇక్కడకు రావాల్సిన అవసరం ఏంటి' అని అడుగుతుంది. దీనికి భాగ్య 'నాకూ అదే అనుమానంగా ఉంది. కానీ, ఒకవేళ ఎవరికీ కనిపించకూడదని రంజిత్ ఈ బంగ్లాలోకి వచ్చి దాక్కున్నాడేమో కదా' అంటుంది. దీంతో లాస్య నిజమేనన్నట్లుగా తలూపుతుంది.

వీళ్ల కంటే ముందే.. బంగ్లాలో వాళ్లు

వీళ్ల కంటే ముందే.. బంగ్లాలో వాళ్లు

ఆ తర్వాత లాస్య 'కానీ.. రంజిత్‌కు ఇక్కడికే రావాల్సిన అవసరం ఏంటి చెప్పు' అని ప్రశ్నిస్తుంది. దీనికి భాగ్య 'ప్రాబ్లమ్ వచ్చింది కదా.. అందుకే.. ఎవరికీ కనిపించకూడదు అని రంజిత్ ఇక్కడ దాక్కొని ఉంటాడు' అంటుంది. దీంతో పాయింటే అని అనుకొని బంగ్లా లోపలికి ఇద్దరూ వెళ్తారు. నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశం కావడంతో వీళ్లిద్దరూ భయపడుతూనే ఆ బంగ్లా లోపలికి ఎంట్రీ ఇస్తారు. ఇంతలో తులసి, అంకిత, దివ్యలు ముందే ఆ బంగ్లా లోపలికి వెళ్లి దాక్కుంటారు. లాస్య, భాగ్య కోసం ఎదురు చూస్తుంటారు. అనుకున్నట్లుగానే వాళ్లిద్దరూ లోపలికి వచ్చేస్తారు.

లాస్య, భాగ్యను భయపెట్టే సౌండ్లు

లాస్య, భాగ్యను భయపెట్టే సౌండ్లు

లాస్య, భాగ్య ఆ బూత్ బంగ్లాలో దెయ్యాలు ఉంటాయేమో అని తెగ భయపడుతూ ఉంటారు. వాళ్లను మనం మరింతగా భయపెడదాం అని తులసి.. దివ్య, భాగ్యకు చెబుతుంది. అందుకు అనుగుణంగానే ఆ తర్వాత వాళ్ల చాటుగా వెళ్లి వింతగా అరుస్తారు. దీంతో లాస్య, భాగ్యకు చాలా భయం వేస్తుంది. అప్పుడు భాగ్య 'లాస్య ఒక పని చేయి.. గట్టిగా రంజిత్ అని పిలువు.. అప్పుడు ఇక్కడే ఉంటే పలుకుతాడు కదా' అంటుంది. దీనికి లాస్య 'నీ మొహం.. ఎవరో అనుకొని ఇక్కడి నుంచి పారిపోతాడు వద్దు' అంటుంది. ఇంతలో తులసి వాళ్ల అరుపులు ఎక్కువ అవుతాయి.

తులసి ఎంట్రీతో లాస్య, భాగ్య షాక్

తులసి ఎంట్రీతో లాస్య, భాగ్య షాక్

అక్కడ అరుపులు ఎక్కువ అవడంతో లాస్య, భాగ్య వెనక్కి వెళ్లిపోదాం అని అనుకుంటారు. అలా తిరిగి వెళ్లిపోతుండగా ఆ బంగ్లా డోర్ లాక్ అవుతుంది. ఇంతలో వాళ్లకు తులసి, అంకిత, దివ్య ముగ్గురు కనిపిస్తారు. దూరం నుంచి వాళ్లు సరిగ్గా కనిపించరు. తర్వాత వాళ్ల ముందుకు వస్తారు. దీంతో వాళ్లను చూసి లాస్య, భాగ్య షాక్ అవుతారు. అప్పుడు భాగ్య హమ్మయ్య దెయ్యాలు కాదు అంటుంది. కానీ, లాస్య మాత్రం వీళ్లు అంతకంటే ఎక్కువ అంటుంది. తులసి వాళ్లు కనిపించడంతో భాగ్య 'ఈ ఇల్లు అమ్ముతామంటే చూడ్డానికి వచ్చాం. మీరూ అందుకే వచ్చారా' అంటుంది.

అసలు మేటర్ చెప్పేసిన తులసి

అసలు మేటర్ చెప్పేసిన తులసి

భాగ్య అడిగిన దానికి తులసి బదులిస్తూ.. 'కాదు.. మీరు ఏం చేస్తున్నారో చూద్దామని మీ వెనుకే ఎప్పటి నుంచో వస్తున్నాం. ఇంతకీ మీ చెంచా గాడు రంజిత్ కనిపించాడా' అని అడుగుతుంది. దీంతో రంజిత్ ఎవరు అక్కడ పేరు ఎప్పుడూ వినలేదే అంటుంది భాగ్య. అప్పుడు తులసి 'అయితే మీ లాస్య ఫోన్‌లో చూడు.. వాడి ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది' అంటుంది. దీనికి భాగ్య అవునా అంటూ నోరెళ్లబెడుతుంది. అప్పుడు లాస్య 'వాళ్లు నోటికొచ్చినట్టు మాట్లాడి సంబంధం లేని విషయంలో మనల్ని ఇరికించాలని చూస్తున్నారు. పదా వెళ్దాం' అని అంటుంది.

20 లక్షలు డిమాండ్ చేసిన తులసి

20 లక్షలు డిమాండ్ చేసిన తులసి

లాస్య వాళ్లు వెళ్లిపోదాం అని అనుకుంటుండగా.. తులసి ఆపుతుంది. అంతేకాదు, 'మీరు ఇక్కడికి రాకముందే.. రంజిత్‌ను నావాళ్లు తీసుకొచ్చేశారు. ఇప్పుడు వాడు నా దగ్గరే ఉన్నాడు. మొత్తం పూసగుచ్చినట్టు చెప్పాడు. నా డబ్బును మోసం చేసి తీసుకొని నందూతో బిజినెస్ పెట్టించావు. ఆయన దృష్టిలో నువ్వు ఎంతో ఎదిగిపోయావు అవునా. ఇప్పుడే నేను ఆయన దగ్గరికి వెళ్లి మీరు బిజినెస్‌లో పెట్టిన డబ్బు నాది అంటూ నిజం చెప్పేస్తే.. మీ భార్యాభర్తల బంధానికి సమాధి కడతారు. భాగ్యను బెదిరించి నోరు మూయించడం కాదు.. నా నోరు మూయించలేవు నువ్వు. వజ్రాయుధం నా చేతుల్లో ఉంది' అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత తన డబ్బు 24 గంటల్లోగా తిరిగి ఇచ్చేయాలని లాస్యను తులసి డిమాండ్ చేస్తుంది.

శుభవార్త చెప్పిన శృతి.. ప్రేమ్ డీలా

శుభవార్త చెప్పిన శృతి.. ప్రేమ్ డీలా

శృతి.. ప్రేమ్ కోసం ఎదురు చూస్తుంటుంది. అప్పుడు దీనంగా ప్రేమ్ ఇంటికి వస్తాడు. అప్పుడామె నువ్వు ఎప్పుడు వస్తావా అని నీకోసమే ఎదురు చూస్తున్నాను అంటుంది. దీంతో ఎందుకు సరుకులు అయిపోయాయా.. తీసుకురావాలా అంటాడు. దీంతో నీకో గుడ్ న్యూస్ అంటుంది. ఆ తర్వాత తులసి చెప్పి పాంప్లెట్‌ను చూపిస్తుంది. కానీ, ప్రేమ్ మాత్రం అందులో పాల్గొనేందుకు నిరాశ చూపుతాడు. ఆ సమయంలో శృతి అతడిని ఎంతగానో మోటివేట్ చేస్తుంది. అంతేకాదు, 'కాంపిటిషన్‌లో ఎంట్రీ దొరుకుతుందో లేదో.. అని టెన్షన్ పడకు. నీ పేరును ఎంట్రీ లిస్ట్‌లో ఇన్‌క్లూడ్ చేస్తా అన్నారు' అంటుంది. దీంతో ప్రేమ్ పర్మీషన్ లేకుండా చేసిందని ఆమెపై ఫైర్ అవుతాడు. అప్పుడు శృతి ఎమోషనల్‌గా మాట్లాడుతుంది.

నందూకు నిజం చెప్పేసిన లాస్య

నందూకు నిజం చెప్పేసిన లాస్య


తులసితో మాట్లాడిన తర్వాత లాస్య, భాగ్య ఇంటికి తిరిగి వస్తారు. అప్పుడు నందూ.. లాస్యను ఎక్కడికి వెళ్లావు అని ప్రశ్నిస్తాడు. దీంతో లాస్య చిరాకుగా ఉంది తర్వాత మాట్లాడుతా అంటుంది. దీనికి నందూ 'అదేంటి లాస్య అలా మాట్లాడుతున్నావు. రేపటి నుంచి బిజినెస్‌లో బిజీ అయిపోతాను. ఈరోజు సరదాగా బయటికి వెళ్దాం అన్నా కదా. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు చెప్పు' అంటాడు. దీనికి లాస్య చూడు నందు.. అంటూ 'తులసిని మోసం చేసి నేను డబ్బును నీ బిజినెస్ కోసం ఇచ్చాను' అని నిజం చెప్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X