Intinti Gruhalakshmi: దివ్య కోరిక తీర్చిన విక్రమ్.. రాజ్యలక్ష్మికి షాకిచ్చేలా.. లాస్యకు కూడా దెబ్బే

భారతదేశంలోని చాలా ఇండస్ట్రీల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. దివ్య, విక్రమ్ కలిసి నిప్పుల గుండంలో నడవడానికి పయనం అవుతారు. అప్పుడు తులసి వాళ్లను ఆపి పసుపు నీళ్లతో స్నానం చేయిస్తుంది. దీంతో వాళ్లు గుండంలో నాలుగైదు రౌండ్లు వేస్తారు. ఆ తర్వాత దివ్య కళ్లు తిరిగి కింద పడిపోతుంది. దీంతో తులసికి కోపం వచ్చి లాస్య జుట్టు పట్టుకుని ఆమెకు వార్నింగ్ ఇస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత దివ్యతో మాట్లాడి వెళ్లిపోతుంటే.. విక్రమ్ తులసిని ఉండమంటాడు. కానీ, అతడికి కొన్ని సూచనలు చెప్పి వెళ్లిపోతుంది. ఇక, నందూ లాస్యపై.. దివ్యపై లాస్య పగను పెంచుకుని మాట్లాడతారు.

Intinti Gruhalakshmi

రాజ్యలక్ష్మి ఇంటికి తులసి, నందూ: కెఫే ఓపెనింగ్‌కు పిలిచేందుకు తులసి, నందూ కలిసి రాజ్యలక్ష్మి ఇంటికి వస్తారు. అది చూసిన బసవయ్య 'అక్కా.. ఎవరు వస్తున్నారో చూశావా? మొగుడు పెళ్లాలు కానీ మొగుడు పెళ్లాలు వస్తున్నారు' అని చూపిస్తాడు. దీంతో రాజ్యలక్ష్మి 'వీళ్లేంటి చెప్పాపెట్టకుండా వచ్చేస్తున్నారు' అనగా.. 'అవును అక్కా.. ఇదేదో వాళ్ల అత్తారిల్లు అన్నట్టుగా కూతురి అత్తారింటికి రోజూ వస్తున్నారేంటి' అంటాడు. ఇక తులసి పలకరించగా.. 'ఇంతకు ముందు వరకూ బాగా డల్‌గా ఉంది.. మీరు అడుగుపెట్టగానే మొహం వెలిగిపోతుంది' అని బసవయ్య వెటకారంగా అంటాడు.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లా వచ్చేసి: బసవయ్య మాటలకు రాజ్యలక్ష్మి 'అబ్బా ఊరుకో తమ్ముడూ.. నా ప్రేమ గురించి వాళ్లకు తెలియదా ఏంటీ.. కొత్తగా చెప్పాలా' అంటుంది. ఇంతలో దివ్య పరుగున వచ్చి తులసిని హత్తుకుంటుంది. అప్పుడు బసవయ్య 'పాపం.. మిమ్మల్ని చూసి యాభై వేల సెకన్లు అయినట్టు ఉంది.. అందుకే దిగులు పెట్టేసుకుంది' అని అంటాడు. దీంతో రాజ్యలక్ష్మి 'తల్లీ కూతుళ్ల బంధం అంటే ఆ మాత్రం ఉంటుందిలే అంటుంది. ఇంతలో తులసి నీరసం తగ్గిందా అని అడగ్గా 'మెట్ల మీద నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లా వచ్చింది కదా' అని అంటాడు.

Intinti Gruhalakshmi

నీ కడుపులో మంట ఏంటి అంటూ: అప్పుడే విక్రమ్ వాళ్ల తాతయ్య వచ్చి 'తల్లి ప్రేమ గురించి మీ అక్కా తమ్ముళ్లే చెప్పాలి. అమ్మానాన్నల్ని నిలబెట్టే మాట్లాడుతున్నావేంటి' అని అంటాడు. అంతలోనే లాస్య ఎంట్రీ ఇస్తుంది. అది చూసిన బసవయ్య 'ఆహా.. ఒక భర్త ఇద్దరు మాజీ పెళ్లాలు.. కథ ఇప్పడు కదా రసవత్తరంగా మారేది' అంటాడు. అప్పుడు లాస్య 'చుట్టాలు వచ్చినట్టు ఉన్నారూ'.. అని అంటుంది. దీనికి నందూ 'అవును నీ కడుపులో మంట ఏంటి' అని అనగా విక్రమ్ తాత 'కొంతమందికి ఓ జబ్బు ఉంటుంది.. నలుగురూ ఓ చోటకి చేరి నవ్వుకుంటే అస్సలు తట్టుకోలేరు' అంటాడు.

వచ్చిన పని చూసుకుని వెళ్లండి: లాస్య మాటలతో కోపం తెచ్చుకున్న దివ్య 'వచ్చిన పని చూసుకుని వెళ్లండి లాస్య ఆంటీ.. మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు' అని అంటుంది. దీనికి ప్రసన్న 'ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు.. మీ అత్తయ్య చెప్పాలి. నీకు బొత్తిగా మంచి చెడు తెలియడం లేదు. పక్కనే ఉన్నారు కదా.. మీ కూతురికి మంచి చెడు చెప్పాలి కదా' అంటుంది. దీంతో లాస్య 'మీ చుట్టాలు నేను ఇక్కడ ఉన్నందుకు హర్ట్ అయినట్టు ఉన్నారు.. సారీ రాజ్యలక్ష్మి గారూ' అని అంటుంది. దీనికి తులసి.. 'నీ ఉద్యోగం హాస్పిటల్‌లో ఈ ఇంట్లో నీకేం పని? అని నేను అడిగానా' అని అంటుంది.

Intinti Gruhalakshmi

మళ్లీ మళ్లీ మళ్లీ పెళ్లి అని అర్థం: లాస్యతో నందూ వాళ్లు గొడవ పడిన తర్వాత తులసి 'ఏం లేదు వదినగారూ.. మా కెఫే రీ ఓపెన్ చేయాలని అనుకుంటున్నాం.. పిలవడానికి వచ్చాను' అని అంటుంది. దీనికామె 'రీఓపెనా? అదేంటి' అనగా బసవయ్య 'ఏం లేదు అక్కా.. మొదటి సారి తాళి కడుతుంటే దాన్ని పెళ్లి అంటారు.. రెండో సారి తాళి కడుతుంటే మళ్లీ పెళ్లి అంటారు. మరి మూడోసారి కూడా తాళి కట్టాల్సి వస్తే దాన్ని మళ్లీ మళ్లీ మళ్లీ పెళ్లి అంటారు. ఆల్రెడీ వాళ్ల కేఫ్ ఎప్పుడో మూసేశారు.. ఇప్పుడు మళ్లీ తెరుస్తున్నారు. అంతేకదా అన్నయ్య గారూ' అంటాడు. దీంతో నందూ.. లాస్య వైపు చూస్తూ 'మా కెఫేలో ఒకప్పుడు ఓ దెయ్యం తిరుగుతూ ఉండేది. ఇప్పుడు దాన్ని తరిమేసి పీడ వదిలించుకున్నాం. ఇప్పుడు కొత్త పేరుతో కొత్త లుక్‌తో రీ ఓపెన్ చేస్తున్నాం' అని అంటాడు.

రావడం కుదరదు.. అది నాఇష్టం: ఆ తర్వాత తులసి 'కెఫే ఓపెనింగ్ దివ్య, అల్లుడి గారి చేతుల మీదుగా జరపాలని అనుకుంటున్నాం' అని చెప్తుంది. దీంతో సంజయ్ వచ్చి 'అన్నయ్య రావడం కుదరదు. మా అన్నయ్య రేంజ్ ఏంటి? రాజ్యలక్ష్మి హాస్పిటల్స్ ఓనర్.. అలాంటి మా అన్నయ్యతో ఆఫ్ట్రాల్ కేఫ్‌ని ఓపెన్ చేయిస్తారా? అది మా పరువుకి సంబంధించిన విషయం. మా పరువు తగ్గించుకోలేం' అంటాడు. అలా రాజ్యలక్ష్మి వాళ్లు తులసి వాళ్లపై గొడవ చేస్తుంటారు. అంతలోనే విక్రమ్ అక్కడకు వచ్చి 'నేను వస్తాను. అయినా నా ఇష్టాన్ని మీరెలా చెప్తారు' అంటూ సొంత వాళ్లపైనే ఫైర్ అవుతాడు.

Intinti Gruhalakshmi

కెఫే రీఓపెన్.. దివ్య మాటలతో: తర్వాతి రోజు ఉదయాన్నే 'తులసి కిచెన్' పేరిట నందూ వాళ్లు కెఫేను రీఓపెన్ చేయించేందుకు సిద్ధం అవుతుంటారు. అప్పుడు వాళ్లు కోరుకున్నట్లుగానే విక్రమ్ రిబ్బన్ కట్ చేయబోగా.. దివ్య వచ్చి అందుకుంటుంది. అలా ఇద్దరూ కెఫేను స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత దివ్య 'ఈరోజు నేను, విక్రమ్ కలిసి మా అమ్మానాన్న దగ్గర ఆర్డర్ తీసుకుంటాడు' అంటుంది. దీంతో రాజ్యలక్ష్మి వాళ్లకు కోపం వస్తుంది. అంతలో లాస్య వచ్చి మరింత రెచ్చగొడుతుంది. దీంతో తులసి కల్పించుకుని సర్ధి చెబుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X