Intinti Gruhalakshmi: దివ్యకు 3 లక్షలు టెస్ట్.. తులసి కొత్త ఐడియా.. లాస్య ప్లాన్‌తో కొత్త చిక్కులు

చాలా సంవత్సరాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. కెఫేను రీఓపెన్ చేయాలని అనుకున్న నందూ, తులసి.. దివ్య వాళ్లను పిలిచేందుకు రాజ్యలక్ష్మి ఇంటికి వస్తారు. అప్పుడు వాళ్లను బసవయ్యతో పాటు అందరూ అవమానించేలా మాట్లాడతారు. అంతేకాదు, లాస్య కూడా ఎంట్రీ ఇచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. ఇక, విషయం చెప్పగానే సంజయ్ వచ్చి విక్రమ్ రావడం కుదరదు అంటాడు. కానీ, విక్రమ్ వచ్చి నేను వెళ్తా అంటాడు. ఆ తర్వాత అందరూ అక్కడకు వెళ్తారు. అప్పుడు దివ్య, విక్రమ్ కలిసి కెఫేన్ ఓపెన్ చేస్తారు. తర్వాత దివ్య చిన్న కోరిక కోరగా తులసి మందలిస్తుంది.

Intinti Gruhalakshmi:

నా కూతురితో గెంటిస్తాను: కెఫె ఓపెనింగ్‌కు వచ్చిన లాస్యను అనసూయ 'పిలవని పేరంటానికి నువ్వెందుకు వచ్చావే? నీతో విడాకులు తర్వాత నా కొడుక్కి కలిసి వచ్చిందే' అంటుంది. దీంతో లాస్య 'అసలు కలిసి వచ్చింది నాకు. రాజ్యలక్ష్మి దగ్గర ఉద్యోగం వచ్చింది. అయినా నీ కొడుక్కి ఏం కలిసి వచ్చిందో ముందు ముందు మీకే తెలుస్తోంది. కథ ఇప్పుడే కదా మొదలైంది' అని అంటుంది. అప్పుడు తులసి 'ఔను తెలుస్తుంది. నీ స్వార్ధంతో నంద గోపాల్ జీవితంలో నుంచి వెళ్లిపోయావు. అలాగే రాజ్యలక్ష్మి ఇంట్లో నుంచి నా కూతురుతోనే గెంటిస్తాను' అని చాలెంజ్ విసురుతుంది.

Intinti Gruhalakshmi:

అడుక్కోవడానికి రెడీగానే: తులసి మాటలకు లాస్య 'అదో పిల్లకాకి. అది నన్నేం చేస్తుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి నాకు ఇవ్వాల్సిన భరణం గురించి ఎలా సంపాదించుకోవాలో ఆలోచించుకోండి. నందూతో ఉంటే నాకు ఓ రూ. 20 వేలు ఖర్చు అయ్యేదేమో. ఇప్పుడు నెల నెల నాకు యాభై వేలు ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఎవరి స్వయంకృపరాధం తులసీ' అని ప్రశ్నిస్తుంది. ఇంతలోనే నందూ అక్కడకు వస్తాడు. దీంతో అనసూయ 'రేయ్ నందూ చూశావా ఇది ఏమంటుందో. భరణం తీసుకోవడం హక్కు అనుకుంటుంది. కానీ అడుక్కోవడం అని తెలుసుకోలేకపోతుంది' అంటుంది.

Intinti Gruhalakshmi:

లాస్యను ఎగతాలి చేస్తూ: ఆ తర్వాత అనసూయ 'కెఫే ఇలా తెరిచారో లేదో.. అడుక్కోవడానికి రెడీ అయిపోయారు ముష్టివాళ్లు' అని అంటుంది. ఆ మాటలను విని నందూ తెగ నవ్వేసుకుంటాడు. అది చూసిన పరంధామయ్య 'అదేంట్రా అలా నవ్వుతున్నావు? లాస్య మన అతిథి. అలా కూర్చుని నీకు ఏం కావాలో అడుక్కో అమ్మా' అని ఎగతాళి చేస్తాడు. దీనికామె 'ఇప్పుడు కాదు.. మీ జుట్టు నా చేతికి చిక్కినప్పుడు అప్పుడు చెప్తాను' అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక, కెఫేకు వచ్చిన పని పూర్తి కావడంతో రాజ్యలక్ష్మి, విక్రమ్, దివ్యలు కూడా ఇంటికి తిరిగి బయల్దేరతారు.

Intinti Gruhalakshmi:

దెబ్బ మీద దెబ్బ కొట్టాలి: లాస్యతో కలిసి కారులో వెళ్తున్న సమయంలో రాజ్యలక్ష్మి 'మనం చేయాల్సిన పని చేయలేకపోతున్నాం. పరుగు పందెంలో మనం వెనుక బడుతున్నాం. ఆ దివ్య విక్రమ్‌కు దగ్గర అవుతుంది. సమయం ఇచ్చే కొద్దీ శత్రువు బలపడతాడు. అది మనిద్దరికీ ప్రమాదం' అని అంటుంది. దీంతో లాస్య 'నీ టెన్షన్ నాకు అర్ధమైంది. ఇక నుంచి డోస్ పెంచుదాం. దెబ్బ మీద దెబ్బ కొడదాం. అర్జెంట్‌గా మూడు లక్షలు రెడీ చేసుకో' అని అంటుంది. దీంతో రాజ్యలక్ష్మి 'డబ్బుతో ముడిపెట్టకుండా ఐడియా చెప్పలేవా? అది మనకి కలిసి రాలేదు' అని అంటుంది.

డబ్బుకు మించి లేదుగా:రాజ్యలక్ష్మి మాటతో లాస్య 'ధనం మూలం ఇదం జగత్.. ఈ లోకంలో ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. బంధాలు కలపాలన్నా.. బంధాలు తెంపాలన్నా.. డబ్బుకు మించిన ఆయుధం లేదు' అంటుంది. దీంతో రాజ్యలక్ష్మి 'అది సర్లే కానీ ఆ డబ్బుతో ఏం చేయబోతున్నావు' అని అడగ్గా.. 'ఈ డబ్బుతో విక్రమ్, దివ్యల మధ్య చిచ్చపెట్టబోతున్నాను. ఈ దెబ్బ వడదెబ్బలా తులసి, దివ్యలకు కూడా తగిలి పుట్టింటి బంధం పాప్‌కార్న్‌లా పేలుతుంది' అంటుంది. దీంతో రాజ్యలక్ష్మి అదే జరిగితే పది లక్షలు అయినా ఇస్తాను అంటుంది. దీనికి లాస్య 'అగ్గిపుల్ల చాలు రాజ్యలక్ష్మి గడ్డివాము తగలబెట్టడానికీ. ఆ దివ్య మూడు ముళ్ల బంధం ముక్కలు కావడానికి మూడు లక్షలు చాలు' అని అంటుంది. దీంతో రాజ్యలక్ష్మి ఓకే అంటుంది.

తులసి కొత్త ఐడియాతో: కెఫేలో తులసి 'నాకో అద్భుతమైన ఐడియా వచ్చింది. దెబ్బకి సేల్స్ పెరిగిపోతాయి. రెగ్యులర్ ఐటమ్స్‌ను ఆపేసి.. కస్టమర్స్ ఆరోగ్యంపై శ్రద్ధపెడదాం. మనం ట్రెండ్‌ను మార్చేద్దాం.. పిజ్జా బర్గర్‌లు మానేసి.. తృణధాన్యాలతో తయాచేసే వంటల్ని పరిచయం చేద్దాం. వాటిలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి.. రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాలు ఉన్నాయని తెలియజేద్దాం' అని చెప్తుంది. కానీ, నందూకు అది నచ్చదు. అప్పుడే ఓ కస్టమర్ వచ్చి ఐడియా బాగుందని చెప్తుంది. దీంతో నందూ కూడా తులసికి జై కొట్టి.. వెంటనే ప్రారంభించేద్దాం అని చెబుతాడు.

దివ్యకే డబ్బు ఇవ్వాలి: రాజ్యలక్ష్మి ఇచ్చిన డబ్బును ఆస్పత్రిలో నుంచి తీసుకు వచ్చానని లాస్య తెస్తుంది. అప్పుడామె దాన్ని రాజ్యలక్ష్మికి అందించబోతుండగా.. ఇకపై డబ్బు దివ్యకే ఇవ్వాలని అంటుంది. విక్రమ్ ఎంత వద్దని చెప్పినా వినకుండా దివ్యకు ఆ మూడు లక్షల రూపాయలను ఇస్తారు. దీంతో వాటిని జాగ్రత్తగా పెట్టమని విక్రమ్ దివ్యకు చెప్తాడు. తర్వాత నందూ ఫొటోను చూస్తూ లాస్య ముద్దులాడుతుంటుంది. అది చూసిన దివ్యకు కోపం వస్తుంది. అప్పుడామె 'నీకు శోభనమే కాలేదు.. నా ఫీలింగ్స్ ఎలా తెలుస్తాయి' అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X