Intinti Gruhalakshmi: అడ్డంగా దొరికిపోయిన దివ్య.. ఆ పని చేస్తూ విక్రమ్ కంటపడి.. అసలు దొంగ ఎవరంటే!
మిగిలిన భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. కెఫే రీఓపెనింగ్‌కు వచ్చిన లాస్యను పరందామయ్య, అనసూయ వాళ్లు బాగా అవమానిస్తారు. దీంతో లాస్యలో కోపం రెట్టింపు అవుతుంది. తర్వాత రాజ్యలక్ష్మిని మూడు లక్షల రూపాయలు ఇవ్వమని అడుగుతుంది.
అవి తీసుకుని దివ్య జీవితాన్ని నాశనం చేస్తానని హామీ ఇస్తుంది. అందుకు తగ్గట్లుగానే ఆ డబ్బును తీసుకొచ్చి రాజ్యలక్ష్మికి ఇవ్వబోతుండగా.. ఆమె దివ్యకు ఇవ్వమని చెబుతుంది. విక్రమ్ ఎంత చెప్పినా వినకుండా ఆ డబ్బును దివ్యకు అందిస్తారు. ఇక, తులసి వాళ్లు తృణ ధాన్యాలతో ఫుడ్ చేయాలని ప్లాన్ చేస్తారు.
చేప చిక్కింది అనుకుని హ్యాపీ: నందూకు దివ్య ఫోన్ చేసి ఇద్దరూ కలిసి వెంటనే ఇంటికి రండి అని చెబుతుంది. కానీ, వాళ్లు రేపు ఉదయాన్నే వస్తాం అని చెప్పినా వినిపించుకోదు. దీంతో చేసేదేం లేక నందూ, తులసి కలిసి రాత్రి సమయంలోనే దివ్య వాళ్ల ఇంటికి వస్తారు.
అప్పుడు దివ్య వాళ్లను ఎవరూ చూడకుండా తన గదిలోకి తీసుకు వెళ్తుంది. అప్పుడు తులసి 'ఏంటమ్మా.. ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు ఏమైంది? ఇంత సీక్రెట్‌గా ఎందుకు తీసుకుని వచ్చావు' అని అంటుంది. వాళ్లు అలా వెళ్లేది చూసిన రాజ్యలక్ష్మి, లాస్య 'చేప చిక్కింది' అని అనుకుంటారు.
వీక్‌నెస్‌పై దెబ్బ కొట్టాను అని: తులసి వాళ్లు వచ్చేది చూసిన రాజ్యలక్ష్మి 'వాళ్లను అంత ఈజీగా ఎలా ఉచ్చులో పడేశావు లాస్యా ' అని అడుగుతుంది. దీనికామె 'లైఫ్‌లో నా లెక్కలు తప్పింది ఒకే ఒక్కసారి. అది నందూతో విడాకులు. కానీ దానివల్ల నాకంటే ఎక్కువ నష్టపోయింది నందూనే. కుక్క పిల్లలా మళ్లీ నా దగ్గరకు పరుగెత్తుకుని వచ్చేట్టు చేస్తాను. నేను ఆడించే నాటకానికి పైన తెర లేచింది.
ఆ తులసి, దివ్యది ఒకటే మెంటాలిటీ. ఎవరైనా కష్టంలో ఉన్నారంటే వెంటనే రంగంలోకి దూకేస్తారు. అస్సలు ఆలోచించరు. అదే వాళ్ల వీక్‌నెస్. దానిపైనే దెబ్బ కొట్టాను. వాళ్ల నాన్న కష్టంలో ఉన్నాడని హింట్ ఇచ్చా. వెంటనే ఇంటికి పిలిపించేసింది. ఇప్పటి వరకూ మనం అనుకున్నట్టే జరిగింది. ఇక కథ మనమే నడపించాలి' అంటుంది. దీంతో రాజ్యలక్ష్మి బసవయ్యను వెళ్లమంటుంది.
తల్లిదండ్రులకు డబ్బు ఇచ్చి: తులసితో దివ్య 'తండ్రి సమస్యలో ఉంటే కొడుకు సాయం తీసుకుంటే తప్పా ఒప్పా? నాకు సమాధానం కావాలి. కొడుకైనా కూతురైనా ఒకటా కదా' అనగా తులసి 'కొడుకైనా కూతురైనా ఒకటే' అని అంటుంది. దాంతో దివ్య ఒక్క నిమిషం ఉండండి అంటూ లోపలికి వెళ్లి డబ్బు కట్టలు తీసుకుని వచ్చి తులసి చేతిలో పెడుతుంది. అంతలోనే బసవయ్య.. విక్రమ్‌ను తీసుకుని వస్తాడు. అంతేకాదు, 'నీకు తెలియకుండా నీ వెనుక ఏం జరగుతుందో లైవ్‌లో చూపిస్తా అల్లుడూ. ఇంటి దొంగల్ని చూపిస్తా రా అల్లుడూ రా' అని విక్రమ్‌తో అంటాడు.
డబ్బు లైట్ తీసుకున్న విక్రమ్: విక్రమ్‌ను తీసుకు వచ్చిన బసవయ్య.. దివ్య దగ్గర ఉన్న నందూ, తులసిలను చూపించి.. 'మీ అత్తమామలు రాత్రి పూట ఇంటికి వచ్చారు. నీకు తెలియకుండా దివ్య వాళ్ల అమ్మనాన్నలకు డబ్బులివ్వడానికి పిలిపించింది. చూడు ఏం చేస్తుందో' అంటాడు.
అతడు చెప్పినట్లే అప్పుడే దివ్య తన తల్లి చేతిలో డబ్బులు పెడుతుంటుంది. అది చూసిన విక్రమ్.. 'అందులో తప్పేం ఉంది మామయ్యా? వాళ్ల అమ్మా నాన్నలకే కదా డబ్బులు ఇస్తున్నది. వాళ్లేం పరాయి వాళ్లేం కాదు కదా' అని లైట్ తీసుకుంటాడు. తర్వాత మామపై సీరియస్ అవుతూ వెళ్లిపోతాడు.
డబ్బులను తీసుకోని నందూ: ఆ డబ్బు ఇస్తూ.. 'కొడుకు కూతురు సమానమే అని అన్నారు కదా.. మీరు సమస్యలో ఉంటే కూతురిగా సాయం చేయాల్సిన బాధత నాపై ఉంది.. ఈ డబ్బుని కేఫ్‌కి పెట్టుబడిగా వాడుకోండి' అని అంటుంది. కానీ, నందూ వాళ్లు మాత్రం అది తీసుకోడానికి ఇష్టపడరు.
అంతేకాదు, తులసి 'నువ్వు ఈ ఇంటి కోడలివి.. ఇలా సొంత నిర్ణయాలు తీసుకోకూడదు.. మా అవసరం నీ కాపురాన్ని కూల్చకూడదు' అని చెప్తుంది. నందూ 'ఇవి ఆంక్షలు కాదు జాగ్రత్తలు.. నీకు మాపై ఎంత ప్రేమ ఉందో నీపై కూడా మాకు అంతే ప్రేమ ఉంది. ఎవరివల్లా మాట పడకూడదు' అంటాడు.
దివ్యను దోషిగా చూపించేలా: ఇక, ఉదయాన్నే లాస్య తన ప్లాన్ అమలు చేస్తుంది. ఆమె వచ్చి దివ్యను డబ్బు తీసుకు రమ్మంటుంది. కానీ, అందులో లక్ష రూపాయలు తక్కువగా ఉంటాయి. దీంతో దివ్య ఈ డబ్బు ఎవరో తీశారని, కేసు పెడదామని అంటుంది. కానీ, అప్పటికే ఆ డబ్బులు నొక్కేసిన బసవయ్య యాక్టింగ్ షురూ చూస్తాడు.
మమ్మల్నే నిందిస్తుంది అంటూ దివ్యపై దొంగతనం అంటగడతాడు. తర్వాత సంజయ్ కూడా అదే అంటాడు. అప్పుడు ఆ డబ్బును తులసి వాళ్లకు ఇచ్చిందన్న విషయాన్ని బసవయ్య అంటాడు. ఇది విక్రమ్‌కు కూడా తెలుసని అంటాడు. దీంతో విక్రమ్ దివ్యపై అసహనం వ్యక్తం చేస్తాడు. అవన్నీ చూసి తట్టుకోలేకపోయిన దివ్య తనకు ఆ డబ్బు గురించి తెలియనది ఏడుస్తూ వెళ్లిపోతుంది.
తులసి ఇంటికొచ్చిన లాస్య: పరందామయ్య, అనసూయ ఎప్పటి లాగే ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ కనిపిస్తారు. అంతలోనే అక్కడకు తులసి రావడంతో భర్తపై అనసూయ కంప్లైంట్ చేస్తుంది. అనంతరం అక్కడకు లాస్య వస్తుంది. దీంతో అనసూయ 'ఎంత వద్దన్నా మా ఇంటిని పట్టుకుని వేలాడుతున్నావు సిగ్గు లేదా' అంటుంది. దీంతో లాస్య 'త్వరలోనే మీరు మీ కెఫేను కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఇంకా ఇంకా కష్టాలు రాబోతున్నాయి సిద్దంగా ఉండండి' అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











