Intinti Gruhalakshmi Today Episode: వాళ్ల ఇంటికెళ్లి షాకిచ్చిన తులసి.. అందరి ముందే ప్రేమ్‌కు అవమానం
మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా చూసేయండి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూను తులసి మళ్లీ బుట్టలో వేసుకుంటుందని లాస్యను భాగ్య ఎంతగానో రెచ్చగొడుతుంది. అనంతరం అంకిత చిన్న ఆస్పత్రిలో ఉద్యోగంలో జాయిన్ అవుతుంది. ఈ విషయం చెప్పగానే తులసి.. ఆమెను అభితో కలిసి మాట్లాడమంటుంది. దీనికి ఇష్టం లేకుండానే ఒప్పుకున్న అంకిత.. ఆ తర్వాత అభితో మాట్లాడుతుంది. ఆ సమయంలో ఇద్దరికీ గొడవ జరుగుతుంది. ఇక, ప్రేమ్ పాటలు రాయడానికి ప్రయత్నించినా సరిగా రావు. దీంతో అతడు అసహనం వ్యక్తం చేస్తాడు. ఈ విషయాన్ని శృతి.. తులసికి చెప్పడంతో షాకవుతుంది.

నందూను కూడా ఒప్పించిన లాస్య
జరిగిన దానిని తలుచుకుంటూ నందూ తనలో తాను రగిలిపోతూ ఉంటాడు. దీంతో లాస్య అతడికి కొన్ని మాటలు చెబుతుంది. ‘నువ్వు ఈ నాలుగు గోడల మధ్యన ఉంటే జరిగిందే గుర్తుకు వస్తుంది. కాసేపు అలా బయటకు వెళ్లొస్తే అంతా సర్ధుకుంటుంది. రేపు సంజన సింగింగ్ కాంపిటిషన్ ఏర్పాటు చేసింది. మనం తప్పకుండా వెళ్లాలి' అని నందూతో చెబుతుంది. కానీ, దీనికి నందూ మాత్రం ‘నాకు మూడ్ లేదు. నేను ఎక్కడికీ రాలేను' అని అంటాడు. అప్పుడు లాస్య ‘ఏం కాదు.. ఎప్పుడూ అలాగే అంటావు. సరదాగా వెళ్దాం నందూ' అంటూ అతడిని ఒప్పిస్తుంది.

ప్రేమ్ బాధ్యత తీసుకున్న తులసి
కాంపిటీషన్‌కు సమయం దగ్గర పడుతున్నా ప్రేమ్‌కు మాత్రం పాట రాయడం అస్సలు కుదరదు. ఇలా రాత్రి అయిపోతుంది. కానీ, అతడు పాట రాయలేకపోతాడు. మరోవైపు తులసి కూడా ఇదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఆమెను సంజన ఫోన్ చేస్తుంది. ‘మీ వాడు ఇంకా నాకు ఫోన్ చేయలేదు.. కాంపిటీషన్ గురించి నాతో ఏమీ మాట్లాడలేదు. మీవాడు కాంపిటిషన్‌కు ప్రిపేర్ అవుతున్నాడు కదా' అని అడుగుతుంది. దీంతో తులసి ‘ప్రిపేర్ అవుతున్నాడు. వాడి బాధ్యత నాది. వాడిని నేనే తీసుకొస్తా' అంటుంది. దీంతో ఆమె ఫోన్ పెట్టేస్తుంది.

తులసికి నిజాలు చెప్పిన అంకిత
ఆ తర్వాత తులసి.. ప్రేమ్ డైరీని తీసి చదువుకుంటూ ఉంటుంది. అప్పుడామె ‘ఇవన్నీ నువ్వు రాసిన పాటలేరా. నీలోని సత్తా అది. ఈరోజు ఎందుకురా నువ్వు పాట రాయలేకపోతున్నావు. నేను లేనని దిగులు పడుతున్నావా' అని అనుకుంటుంది. ఇంతలో అంకిత వచ్చి ‘అవును ఆంటీ. ప్రేమ్ ఇంతకుముందులా యాక్టివ్‌గా, హుషారుగా ఉండాలంటే మీరు తనకు దగ్గరవ్వాల్సిందే.. తప్పదు. అభిని నేను కలవకపోవడంలో నాది మొండితనం అని మీరు అంటున్నారు. ప్రేమ్ విషయంలో మీరు కూడా అదే చేస్తున్నారు' అంటూ తులసికి కొన్ని నిజాలను చెబుతుంది.

ప్రేమ్ ఇంటికి చేరుకున్న తులసి
అంతేకాదు, అంకిత మాట్లాడుతూ.. ‘మీరు ఇక్కడ బాధపడుతుంటే ప్రేమ్ అక్కడ బాధపడుతున్నాడు. మీరిద్దరూ సంతోషంగా లేరు ఆంటి. మీకు చెప్పేంత వయసు కానీ.. అనుభవం కానీ.. నాకు లేవు ఆంటి. ప్రేమ్‌కు ఎప్పటికీ బలమే మీరు.. బలహీనత మాత్రం కాదు. ఈ టైమ్‌లో మీరు ప్రేమ్ పక్కన ఉండటం ఎంతో అవసరం ఆంటి. ఆలోచించుకోండి' అని చెబుతుంది. దీంతో తులసి ప్రేమ్ పక్కనే ఉండి వాడిలో ధైర్యం నింపాలి అని అనుకుంటుంది. ఆ వెంటనే అతడి ఇంటికి వెళ్తుంది. అప్పుడు ప్రేమ్‌తో ‘నా కొడుకు గెలిచాకే వద్దామనుకున్నా. నా బిడ్డ ఎవరి కంటే తక్కువ కాదు అని లోకమంతా గర్వపడేలా అరిచి చెబుదామనుకున్నా. నా బిడ్డ నన్ను ఎక్కడ మోసం చేస్తాడో అని టెన్షన్ పడుతున్నా' అని అంటుంది.

నీ కొడుకును కాదు అన్న ప్రేమ్
ఆ తర్వాత తులసి ‘అమ్మంటే నీకిష్టం.. ప్రాణం.. ప్రపంచం.. అది నాకు తెలుసురా.. ఇష్టమైన మనిషి కోసం.. ఆ మనిషి ఇష్టమైన పని చేస్తేనే నీ ఇష్టానికి అర్థం. అమ్మ దూరంగా ఉంచిందన్న భయంతో నీ శక్తిని నువ్వు మరిచిపోవడం కాదు. కష్టం వస్తే కుమిలిపోవడం కాదు చేయాల్సింది. కష్టాన్ని ధైర్యంగా దాటాలి' అంటుంది. అప్పుడు ప్రేమ్.. అమ్మ.. ఒక్కసారి నీ భుజం మీద తలపెట్టుకోవచ్చా. నీ దగ్గరికి రావచ్చా అని అడుగుతాడు. దీంతో రా నాన్న అంటుంది. ఆ వెంటనే తల్లి దగ్గరికి వెళ్లి గట్టిగా హత్తుకుంటాడు. అంతేకాదు, ‘నీ మాటను నెరవేర్చుతాను. నీ కలను గెలిపిస్తాను. అలా కాకపోతే నేను నీ కొడుకునే కాదు' అంటాడు. ఆ తర్వాత ప్రేమ్‌కు తులసి గిటార్‌ను ఇచ్చి ప్రోత్సహిస్తుంది.

కాంపిటీషన్ దగ్గరకు వాళ్లు కూడా
పాటల పోటీలు ప్రారంభం అవుతాయి. అందరూ అక్కడికి వెళ్తారు. కాంపిటిషన్‌కు అభి కూడా వస్తాడు. దీంతో పరందామయ్య వీడు ఎందుకు వచ్చాడు. నువ్వు పిలిచావా అని అంకితను అడుగుతాడు. అప్పుడు అభి ‘కంగ్రాట్స్‌రా ప్రేమ్. అదృష్టవంతుడివి. నీకు ఇష్టమైన మామ్ నీ పక్కన ఉంది. కొందరు దురదృష్టవంతులు' అంటూ వెళ్లిపోతాడు. అందరూ లోపలికి వెళ్లబోతుండగా.. అక్కడికి నందూ, లాస్య, భాగ్య కూడా వస్తారు. తులసి వాళ్లను చూసి లాస్య షాక్ అవుతుంది. అనంతరం నేరుగా తులసి వాళ్ల దగ్గరకు వాళ్లు వస్తారు. అప్పుడు కొట్టి పంపేసిన కొడుకును మళ్లీ కలిశావు అంటూ తులసిని లాస్య నిందిస్తుంది. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాదన జరుగుతుంది. ఇక, లాస్య.. ప్రేమ్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతుంది.
Recommended Video


ప్రేమ్‌ను అవమానించిన నందూ
లాస్య మాటలకు తులసికి కోపం వస్తుంది. ఆ సమయంలో తన కొడుకును ఎంతగానో పొగుడుతుంది. దీంతో నందూ వచ్చి ‘ఇలా పనికి రాని పొగడ్తలతో వాడిని ఎటూ పనికి రాని వాడిని చేసింది. కూని రాగాలు తీసే ప్రతి ఒక్కడూ సింగర్ కాదు. నా మాట వినబట్టే అభి డాక్టర్ అయ్యాడు. రేపు దివ్య కూడా డాక్టర్ కాబోతుంది. వీడు నా మాట వినకపోవడం వల్లే ఇలా తయారయ్యాడు' అంటూ అవమానిస్తాడు. అప్పుడు ప్రేమ్ తండ్రి మీదకు కోపంతో దూసుకు వస్తాడు. దీంతో తులసి ఆపి.. మాటలతో కాదు చేతలతో సమాధానం చెప్పమంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











