Intinti Gruhalakshmi Today Episode: ప్రేమ్‌ను ఓడించాలని లాస్య ప్లాన్.. దగ్గు వచ్చేలా మందు కలపడంతో!
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా చూసేయండి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూ 20 లక్షల గురించి ఆలోచిస్తూ ఉండగా.. అతడిని తన ఫ్రెండ్ నిర్వహించబోయే మ్యూజిక్ కాంపిటీషన్‌కు తీసుకెళ్లాలని లాస్య అనుకుంటుంది. ఇక, ఆ పోటీ నిర్వహిస్తోన్న ఆమె తులసికి ఫోన్ చేసి ప్రేమ్ గురించి అడుగుతుంది.
దీంతో తానే అతడిని తీసుకొస్తానని హామీ ఇస్తుంది. ఆ తర్వాత అంకిత కూడా తులసికి కొన్ని మాటలు చెప్పడంతో తులసి నేరుగా ప్రేమ్ ఇంటికి వెళ్తుంది. అక్కడ అతడిని ప్రోత్సహించి పోటీలో ఉండేటట్లు చేస్తుంది. ఇక, ఉదయాన్నే పోటీలకు వెళ్లగా లాస్య, నందూ వచ్చి ప్రేమ్‌ను అవమానిస్తారు.

ప్రేమ్‌ను ఓడించేందుకు లాస్య ప్లాన్
ప్రేమ్‌ను సింగింగ్ కాంపిటీషన్‌లో ఓడించేందుకు లాస్య ఓ కన్నింగ్ ప్లాన్ వేస్తుంది. ఈ విషయాన్ని భాగ్యకు చెబుతుంది. అప్పుడామె 'మొన్నే తులసక్కతో చీవాట్లు తిన్నావు సరిపోలేదా. మళ్లీ ఈ ప్లాన్లు గట్రా ఎందుకు' అని అడుగుతుంది. అప్పుడు లాస్య 'ఆ ప్రేమ్‌ను గెలిపించాలని తులసి కలలు కంటుంది. కానీ, నేనుండగా దాన్ని జరగనివ్వను' అంటూ ఏదో మందు తీసుకొచ్చినట్లు చూపిస్తుంది. 'ఇది ఆ ప్రేమ్ తాగగానే దగ్గడం మొదలు పెడతాడు' అని చెప్తుంది. దీంతో భాగ్య భయపడుతూనే ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరూ పోటీ జరిగే హాల్‌లోకి వెళ్లిపోతారు.

ప్రేమ్‌కు ఆ జ్యూస్ పంపించిన లాస్య
పాటల పోటీ ప్రారంభం అవుతుంది. అప్పుడు లాస్య అక్కడే సర్వ్ చేస్తోన్న వెయిటర్‌ను పిలిచి జ్యూస్ గ్లాస్ ఇచ్చి రెడ్ షర్ట్ వేసుకున్న వ్యక్తి (ప్రేమ్)కి ఇవ్వమని చెబుతుంది. అంతేకాదు, మా అమ్మ ఇచ్చిందని చెప్పు అని అంటుంది. దీంతో సరే అని చెప్పి ప్రేమ్‌కు జ్యూస్ అందిస్తాడు. దీంతో ఆ జ్యూస్ తాగుతాడు. అప్పుడు లాస్య ప్లాన్ సక్సెస్ అయినట్టే అని అనుకుంటుంది. ఆ తర్వాత సింగింగ్ కాంపిటీషన్ మొదలు పెడతారు. అయితే, ఇందులో విజేతను నిర్ణయించేది అక్కడున్న ఆడియెన్సే అని నిర్వహకులు చెబుతారు. దీంతో లాస్య మరింత సంతోషిస్తుంది.

ప్రేమ్‌కు సమస్య.. తులసి సహాయం
పోటీ ప్రారంభం అవగానే యాంకర్ అందరు పార్టిసిపెంట్స్ రావాలని చెబుతుంది. ఆ తర్వాత ఒక్కొక్కరిని పిలుస్తుంది. ఫస్ట్ పార్టిసిపెంట్ రక్షిత్ వచ్చి పాట పాడటం స్టార్ట్ చేస్తాడు. మగువ పాట పాడుతాడు. అప్పుడు అతడు బాగా పాడాడని.. తనే విన్నర్ అని నందూ అంటాడు. మరోవైపు సాధన అనే అమ్మాయి కూడా ఏదో ఒక రాగం పాట పాడుతుంది. ఇంతలో ప్రేమ్‌కు దగ్గు స్టార్ట్ అవుతుంది. అప్పుడు తులసి అక్కడికి వెళ్లి ఏమైందని అడుగుతుంది. దీంతో గొంతులో గరగరగా ఉంది. మంటగా ఉంది. పాడటం కష్టం అవుతుందేమో అంటాడు ప్రేమ్. దీంతో తులసి 'ఏం కాదు.. దాన్ని పట్టించుకోకు.. నువ్వు గెలవాలి.. వేడి నీళ్లు తాగు.. తగ్గుతుంది' అని అంటుంది. తర్వాత ఒక లవంగం ఇచ్చి గొంతులో పెట్టుకో. గొంతు నొప్పి తగ్గుతుంది అని చెబుతుంది.

తులసి రివర్స్ ప్లాన్‌కు లాస్య బుక్
పోటీలో భాగంగా ప్రేమ్‌ను పాట పడేందుకు రమ్మని పిలుస్తారు. ఆ సమయంలో అతడు దగ్గుకుంటూనే స్టేజ్ పైకి వెళ్తాడు కానీ.. పాట మాత్రం బాగానే పాడటం స్టార్ట్ చేస్తాడు. తర్వాత బాగా పాడుతాడు. దీంతో అందరూ చప్పట్లు కొడతారు. అప్పుడు లాస్య దగ్గు ఏమైంది అని అనుకుంటుంది. ఇంతలో ఆమెకే దగ్గు వస్తుంది. దీంతో బయటికి వెళ్లిపోయి తెగ దగ్గుతూ ఉంటుంది. అప్పుడామె వెనకాలే వెళ్లిన భాగ్య ఏమైంది అని అడుగుతుంది. అంతేకాదు, 'ఆ ప్రేమ్‌కు దగ్గు తెప్పిస్తా అని నా ముందు ఏదేదో చేసి.. ఇప్పుడు నువ్వు తెచ్చుకున్నావేంటి' అని అడుగుతుంది.

లాస్యకు ఓ రేంజ్ షాకిచ్చిన తులసి
భాగ్య మాట్లాడుతున్నప్పుడే తులసి అక్కడకు వచ్చి 'తను తెచ్చుకోలేదు.. నేనే తెప్పించాను. ఎందుకిలా నన్ను గెలిగించుకుంటున్నావు. నువ్వు ప్రేమ్‌కు ప్రత్యేకంగా జ్యూస్ పంపిస్తున్నప్పుడే నేను చూసి.. నువ్వు ఇచ్చిన గ్లాస్‌ను మార్చాను. నువ్వు ప్రేమ్‌కు పంపించిన గ్లాస్ ఏం చేశానో తెలుసా?' అంటూ ఆ గ్లాస్‌ను తులసి మార్చినట్లు చెబుతుంది. అప్పుడు భాగ్య అంటే లాస్య మందు కలిపిన గ్లాస్ మొత్తం తాగేసిందా అని అడుగుతుంది. దీనికి తులసి 'అవును.. తను తీసుకున్న గోతిలో తనే పడింది' అంటూ పక్కనే ఉన్న తులసి చెట్టుకు ఉన్న రెండు తులసి ఆకులను తెంపి వాటిని నోట్లో వేసుకో అంటుంది. అంతేకాదు, ప్రేమ్ గెలుపు కళ్లారా చూద్దువు గానీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక, లాస్యకు దగ్గు కొంచెం తగ్గుతుంది.

ప్రేమ్‌ను ఓడించాలని మరో ప్లాన్‌తో
దగ్గు తెప్పించబోయి బోల్తా పడ్డ లాస్య.. అక్కడితో ఆగదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమ్‌ను గెలవనివ్వను అని అనుకుంటుంది. మరోవైపు సెమీ ఫైనల్స్‌లో రక్షిత్, ప్రేమ్ ఇద్దరే మిగులుతారు. దీంతో ప్రేమ్‌ను తులసి మోటివేట్ చేస్తుంది. 'ఇప్పుడు నీ టైమ్ వచ్చింది. నీ జీవితాన్ని మలుపు తిప్పే క్షణాలు ఎప్పుడు నువ్వు సొంతం చేసుకుంటావా అని ఎదురు చూస్తున్నాయి. నువ్వు ఈరోజు గెలిచి ఈ తల్లిని కూడా గెలిపించాలి. ఈ తల్లి నీపై పెట్టుకున్న నమ్మకాన్ని గెలిపించాలి. నిన్ను హేళన చేసిన వాళ్ల నోళ్లను ఈ ఒక్క గెలుపుతో మూయించాలి' అని చైతన్య పరుస్తుంది.

పోటీలో లాస్యపై ఫైర్ అయిన నందూ
మరోవైపు లాస్య, భాగ్య ఇద్దరూ అక్కడున్న ప్రేక్షకులకు ఏదో చెబుతుంటారు. వాళ్లు వచ్చాక.. నందూ ఆడియెన్స్‌తో ఏం మాట్లాడారు అని అడుగుతాడు. అప్పుడామె రక్షిత్‌కు ఓటేయమని అడిగాం అని అంటుంది. దీంతో నందూ 'నీకు ఇష్టం లేకపోతే నువ్వు ప్రేమ్‌కు ఓటేయకు. ఎందుకు ఇలా ప్రచారం చేస్తున్నావు.
ఎవరు మంచిగా పాడితే వాళ్లే గెలుస్తారు' అని అక్కడే ఫైర్ అవుతాడు. అప్పుడు లాస్య నువ్వు, అభి కూడా రక్షిత్ కే ఓటేయాలి అని అంటుంది. తర్వాత ఫైనల్స్ స్టార్ట్ అవుతాయి. రక్షిత్ వెళ్లి ఒకే ఒక లోకం నువ్వే అనే పాట పాడుతాడు. బాగా పాడటంతో అందరూ చప్పట్లు కొడతారు. తర్వాత ప్రేమ్ పాడటం స్టార్ట్ చేస్తాడు. అమ్మను మించి దైవం ఉన్నదా అనే పాట పాడుతాడు. పాట అయిపోగానే అందరూ చప్పట్లు కొడతారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











