For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi June 10th Episode: డాక్టర్ చెప్పిన మాటలు వినేసిన అభి.. నందూ లాస్యకు మరో షాక్

  |

  ఎంతో కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో రన్ అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

   బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి తన కొత్త వ్యాపారాన్ని ఇంటి సభ్యుల మధ్య ఘనంగా ప్రారంభించింది. నందూ తన స్నేహితుడు ఇచ్చిన డబ్బులతో ఉద్యోగులకు జీతాలు ఇచ్చేశాడు. ఆ తర్వాత తాగి వచ్చి ఇంట్లో రచ్చ చేశాడు. ఈ క్రమంలోనే తనను తానే మోసం చేసుకుంటున్నా అని చెప్పాడు. ఇక, గర్భవతిగా ఉన్న అంకిత ఫోన్ మాట్లాడుతూ కళ్లు తిరిగి కింద పడిపోయింది.

  డాక్టర్ చెప్పిన మాటల వినేసిన అభి

  డాక్టర్ చెప్పిన మాటల వినేసిన అభి

  అంకిత అబార్షన్ గురించి డాక్టర్ చెబుతున్న మాటలతో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. ఇప్పటికే చాలా సమయం అయిందని.. ఇంకా ఆలస్యం అయితే అబార్షన్ చేయడం కష్టం అవుతుందని డాక్టర్ సలహా ఇస్తుంది. ఏదైనా త్వరగా నిర్ణయించుకోమని చెబుతుంది. అప్పుడు ఈ మాటను వింటాడు అభి. అయితే, అసలు ఆమె ప్రెగ్నెంట్ అన్న మేటర్‌ను మాత్రం అతడు గ్రహించలేదు.

   ప్రేమ్ లవ్ బయటపెట్టిన రాములమ్మ

  ప్రేమ్ లవ్ బయటపెట్టిన రాములమ్మ

  పని మనిషి రాములమ్మ.. శృతి మధ్య ప్రేమకు సంబంధించిన ఆసక్తికరమైన సంభాషణ జరుగుతుంది. ఆ సమయంలో ప్రేమ్.. శృతిని ప్రేమిస్తున్నాడని రాములమ్మ అంటుంది. అంతేకాదు, మీకోసం అలా చేస్తున్నాడు.. ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఆమెను ఆలోచనలో పడేస్తుంది. ఆ తర్వాత శృతిని కూడా మనసులో మాట చెప్పమని అడుగుతుంది. కానీ, ఆమె మాత్రం సంకోచిస్తుంది.

  నందూని వదిలించుకోమన్న మాధవి

  నందూని వదిలించుకోమన్న మాధవి

  ఇంట్లో పని చేయిస్తున్న తులసి దగ్గరకు అంజలి వస్తుంది. రావడం రావడమే ఆమెను మెచ్చుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మాట్లాడుతుండగా.. అక్కడకు మాధవి, మోహన్ వస్తారు. ఇకనైనా నందూని వదిలేయమని వాళ్లిద్దరూ ఆమెకు సలహా ఇస్తారు. కానీ, తులసి మాత్రం అందుకు నిరాకరిస్తుంది. సమయం వచ్చినప్పుడు నిర్ణయం చెబుతా అనడంతో వాళ్లు వెళ్లిపోతారు.

   నందూ, లాస్యకు మరో భారీ ఝలక్

  నందూ, లాస్యకు మరో భారీ ఝలక్

  నందూ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టు విజయవంతంగా పూర్తవుతుంది. దీంతో ఈ డీల్ ఇచ్చిన బిజినెస్‌మ్యాన్ ఫోన్ చేసి నందూను మెచ్చుకుంటాడు. ఆ తర్వాత డబ్బుల విషయాన్నిసెటిల్ చేసుకుందాం అంటాడు. అయితే, ఆ కాంట్రాక్టులో భాగస్వామిగా ఉన్న తులసి సంతకం ఉంటేనే ఈ డీల్ క్లోజ్ చేస్తానని కండీషన్ పెడతాడు. దీంతో నందూ, లాస్యకు మరో భారీ షాక్ తగులుతుంది.

   లాస్య, నందూ మధ్య మరోసారి గొడవ

  లాస్య, నందూ మధ్య మరోసారి గొడవ


  కాంట్రాక్టు పేపర్లో తులసి పేరు ఉండడంపై లాస్య అసహనం వ్యక్తం చేస్తుంది. అంతేకాదు, ‘ఆమె ఇప్పటికీ నీ భార్య గానే ఉంది. నేను నీ పక్కన ఉన్నా ఉపయోగం లేదు. నాకు ఎప్పుడూ ఇలాగే జరుగుతుంది' అంటూ నందూతో గొడవకు దిగుతుంది. అప్పుడు అతడు ‘ఏదైనా రిలేషన్ ఉన్న వాళ్లనే అగ్రిమెంట్‌లో యాడ్ చేయమన్నారు. అందుకే లాస్య పేరు పెట్టా' అని సర్ధి చెబుతాడు.

  లాస్య చెత్త ఐడియా.. నందూ మాత్రం

  లాస్య చెత్త ఐడియా.. నందూ మాత్రం


  గొడవ తర్వాత తులసి దగ్గర నుంచి సంతకం పెట్టించుకోవడం ఎలా అంటూ ఆలోచిస్తున్న నందూకు.. ఫోర్జరీ చేయమంటూ సలహా ఇస్తుంది లాస్య. దీనిపై అతడు కోప్పడతాడు. అంతేకాదు, అదే జరిగితే కేసులు అవుతాయని.. ఆ తర్వాత ఉన్నదంతా పోగొట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తాడు. దీంతో అక్కడికి వెళ్లి తులసితో సంతకం చేయించుకుందాం అని ఇద్దరూ డిసైడ్ అవుతారు.

  English summary
  Intinti Gruhalakshmi Episode 342: Abhi listened Doctor Words. Then Madhavi and Mohan Gave A Suggestion to Tulasi. After That.. Contractor Told Shocking News To Nandu and Lasya.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X