Intinti Gruhalakshmi Today Episode: నిజం తెలిసి తల్లితో అభి గొడవ.. నందూకు డబ్బులు ఇస్తానని హామీ

ఎన్నో భాషల్లో సీరియళ్లు వస్తున్నా.. తెలుగు బుల్లితెపై ప్రసారం అవుతోన్న వాటికి మాత్రమే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుంది. సుదీర్ఘ కాలంలో ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఆస్తిని అభి పేరు మీద రాయించమని గాయత్రి చెప్పినా.. శరత్ మాత్రం దానికి భిన్నంగా అంకిత పేరు మీదనే వాటిని రాయిస్తాడు. ఇది చూసిన అభి, గాయత్రి ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు గాయత్రి భర్తతో గొడవకు దిగుతుంది. దీంతో తనకు ఈ సలహా ఇచ్చింది తులసే అని శరత్ వాళ్లందరికీ వివరిస్తాడు. అప్పుడు గాయత్రి తులసిని నిందిస్తూ మాట్లాడుతుంది. కానీ, శరత్ మాత్రం తులసికి సపోర్ట్ చేస్తాడు. ఇక, ప్రేమ్ తన ఆల్బమ్‌కు స్పాన్సర్ చేయాలని ఓ కంపెనీకి వెళ్లగా.. అక్కడ మాత్రం అతడికి నిరాశే ఎదురవుతుంది.

డబ్బు కోసం ప్రేమ్, శృతి తంటాలు

డబ్బు కోసం ప్రేమ్, శృతి తంటాలు

తన ఆల్బమ్‌కు కావాల్సిన 5 లక్షల రూపాయల కోసం ప్రేమ్ ఓ కంపెనీకి వెళ్తాడు. అక్కడ తాను మప్పీ లహరి దగ్గర పని చేస్తున్నా అని చెప్తాడు. దీంతో సదరు కంపెనీ మేనేజర్ ఒకసారి ఆయనతో ఫోన్ చేయించమని ప్రేమ్‌కు సలహా ఇస్తాడు. ఆ తర్వాత స్వయంగా ఆయనే మప్పీ లహరికి ఫోన్ చేస్తాడు. కానీ, ఆయనకు ఫోన్ చేస్తే తనను జాబ్‌లో నుంచి తీసేస్తారని ప్రేమ్ బ్రతిమాలడంతో కాల్ కట్ చేస్తాడు. మరోవైపు, శృతి.. మప్పీ లహరి దగ్గరకు వెళ్లి 5 లక్షలు అప్పు అడుగుతుంది. కానీ, ఆయన మాత్రం డబ్బులు లేవని సమాధానం చెప్పి పంపించేస్తాడు.

రీల్స్ చూసి తులసి షాక్.. అభి రాక

రీల్స్ చూసి తులసి షాక్.. అభి రాక


పరందామయ్య చేసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూసి తులసి నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు. ఆ సమయంలో తులసి తన కూతురు చాలా గొప్ప టాలెంట్ ఉన్న అమ్మాయి అంటుంది. దీనికి పరందామయ్య ‘అయితే, నీ కొడుకులు దేనికీ పనికిరాని వాళ్లా' అంటాడు. అప్పుడామె ‘అలా అని కాదు. నా చిన్న కొడుకు గొప్ప సింగర్. మ్యూజిక్ డైరెక్టర్' అంటూ అతడి గురించి చెప్తుంది. ఆ తర్వాత అభి పేరు ఎత్తగానే స్వయంగా అతడే అక్కడకు వచ్చి ‘అభి చేతకాని వాడు. పెద్ద దద్దమ్మ' అంటూ కోపంగా తన తల్లితో మాట్లాడతాడు.

తులసిపై నిందలు వేసిన కొడుకు

తులసిపై నిందలు వేసిన కొడుకు

కోపంగా వచ్చిన అభి ‘నేను పాపిష్టివాడిని అమ్మ. నువ్వే కదా.. ఊరంతా తిరిగి అందరికీ నా గురించి గొప్పగా పబ్లిషిటీ ఇస్తున్నావు' అంటాడు. అప్పుడు అనసూయ ‘ఏం జరిగింది అమ్మా? వాడు ఎందుకు అంతలా బాధపడుతున్నాడు' అని అడుగుతుంది. అప్పుడు అభి ‘ఇంట్లో వాళ్లకు నువ్వు చెప్పలేదా? నీ కోడలు ఏం చేసిందో తెలుసా నానమ్మ? నన్ను ఎదగమని ఇంట్లో నుంచి బయటికి పంపించి.. నా కాళ్లు పట్టుకొని కిందికి లాగింది. ఇక నుంచి నిన్ను నమ్మను. నీ డ్రామాలు ఇక ఆపు మామ్. నిన్నటి వరకు అత్తారింట్లో నన్ను నెత్తిన పెట్టుకొని కూర్చున్నారు' అంటాడు.

ఆటలో అరటి పండును చేసింది

ఆటలో అరటి పండును చేసింది

అభి తన కోపాన్ని చూపిస్తూ... ‘కలిసి వచ్చిన ఆస్తి నా పేరు మీదికి ట్రాన్స్ ఫర్ అవుతుందని భావించాను. కానీ, నీ కోడలు శకునిలా వచ్చి నా లైఫ్‌ను నాశనం చేసింది. రేపు నీ జీవితం కూడా అంతే అని దివ్య. నేను డాడీని కలవడం మమ్మీకి నచ్చలేదు. డాడీకి దగ్గరైతే.. నేను తన మాట వినను అనే ఉద్దేశంతో నన్ను తొక్కేసింది. ఆటలో అరటిపండును చేసింది. అంకిత దగ్గరైతే.. తన ఆటలు సాగుతాయి. అందుకే అంకిత పేరు మీద ఆస్తి పెట్టేలా చేసింది. మామ్ గురించి నాకు డాడ్ ముందే చెప్పినా నేనే నమ్మలేదు. కానీ, ఇప్పుడు నమ్మాల్సి వస్తోంది' అని ఫైర్ అవుతాడు.

జీవితంలో నీ ముఖం చూడనని

జీవితంలో నీ ముఖం చూడనని

తులసి సైలెంట్‌గా ఉండడంతో అభి ‘ఇంట్లో ప్రతివాళ్లు తన మాటే వినాలి. చేయాల్సిందంతా చేసి నానమ్మ, తాతయ్య దగ్గర మంచిగా ఉండటం కోసమా ఈ వేషాలు. కొద్దిరోజులు ఆగు మామ్.. నేనేంటో నిరుపిస్తాను. తలెత్తుకొని నీ ముందు నిలబడతాను. జీవితంలో నీ ముఖం కూడా చూడను. డాడ్ అలా ప్రవర్తించడానికి కారణం ఎవరో.. ఆ తప్పు ఎందుకు చేశాడో ఇప్పుడు తెలుస్తోంది మామ్. దోషివి నువ్వే' అంటూ అభి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో తులసి ఘోరంగా బాధపడుతుంది. అంతేకాదు చివరకు అభి కూడా నన్ను అర్థం చేసుకోలేదు అంటుంది.

నందూ ముందే తులసిపై కోపం

నందూ ముందే తులసిపై కోపం

మరోవైపు ఆస్తి.. అంకిత పేరు మీదకు మారిందని తెలుసుకొని లాస్యకు తీవ్రంగా కోపం వస్తుంది. అప్పుడామె ఇదంతా తులసే చేసింది అని అంటుంది. దీనికి నందూ పాపం ఇప్పుడు అభి పరిస్థితి ఏంటి అని అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అభి.. ‘సిగ్గుగా అనిపిస్తోంది డాడ్. నా ఆత్మాభిమానం చచ్చిపోయింది. మామ్ అంటే చిరాకు వేస్తోంది' అంటాడు. దీంతో నందూ ఏంట్రా ఈ మాటలు అంటాడు. అప్పుడు అభి ‘తను ఏం చేసినా నా మంచి కోసమేనట. నేను బాగుపడటం కోసమేనట. ఇలాంటి పచ్చి అబద్ధాలు నేను ఎలా నమ్ముతానని అనుకుంటోంది' అంటాడు.

Recommended Video

Ante Sundaraniki Movie Genuine Review *Reviews | Telugu Filmibeat
డబ్బులు ఇస్తానని అభి ప్రామిస్

డబ్బులు ఇస్తానని అభి ప్రామిస్

ఆ తర్వాత అభి ‘ఆవిడను బెదిరించి కూడా ఏంటి లాభం. ఆస్తి నా పేరు మీద రాయనందుకు నాకు బాధ లేదు. నాకు అవమానం జరిగింది. ఆస్తి నా పేరు మీద ఉన్నా.. అంకిత పేరు మీద ఉన్నా నాకు ఏం నష్టం లేదు. కానీ, నేను అంత చేతగాని వాడినని అనుకుంటోంది. అంకిత పేరు మీద ఉన్నా నా పేరు మీద ఉన్నట్టే కదా. మీ బిజినెస్ కోసం డబ్బు నేను ఇస్తాను. తీసుకొచ్చే బాధ్యత నాది' అంటాడు. దీంతో నందూ ‘మా కారణంగా మీ ఇద్దరి మధ్య గొడవలు రాకూడదు. మేమంటే తనకు ఇష్టం లేదు కదా ఎలా ఇస్తుంది' అని అంటాడు. అప్పుడు లాస్య ‘ఆ సంగతి అభికి తెలియదా.. తెలియకుండానే మనకు మాటిచ్చాడా? తను చేతగాని వాడు కాదు' అని రెచ్చగొడుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X