For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi June 11th Episode: తులసి కాళ్ల దగ్గరకొచ్చిన నందూ.. దిమ్మ తిరిగే మాటలతో అవమానం

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో రన్ అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూను వదిలించుకోమని మాధవి, మోహన్.. తులసికి హితభోద చేస్తారు. కానీ, ఆమె మాత్రం దీనికి ఒప్పుకోదు. ఆ తర్వాత కాంట్రాక్టర్ అగ్రిమెంట్ పేపర్లపై తులసి సంతకం ఉంటేనే మనీ సెటిల్‌మెంట్ చేస్తానని నందూకు షాకిస్తాడు. దీంతో లాస్య.. నందూతో గొడవకు దిగుతుంది. అనంతరం తులసితో సంతకం పెట్టించుకుందామని నిర్ణయిస్తారు.

   తులిసి ఇంటికి వచ్చిన లాస్యకు షాక్

  తులిసి ఇంటికి వచ్చిన లాస్యకు షాక్

  క్లయింట్ చెప్పిన దాని ప్రకారం సంతకం కోసం తులిసి ఇంటికి వస్తుంది లాస్య. అలా వచ్చిన ఆమెకు ఆదిలోనే భారీ షాక్ తగులుతుంది. కోపంతో రగిపోతోన్న తులసి.. లాస్యను ఘోరంగా అవమానిస్తుంది. అదే సమయంలో సంతకం పెట్టనంటే పెట్టనని తేల్చి చెబుతుంది. ‘నా భర్తకు నాకు మధ్యలో నువ్వు ఎవరు? ఇక్కడి నుంచి వెళ్లిపో' అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతుందామె.

   నందూని రెచ్చగొట్టి పంపించిన లాస్య

  నందూని రెచ్చగొట్టి పంపించిన లాస్య

  తులసి ఇంట్లో జరిగిన అవమానం తట్టుకోలేని లాస్య.. వెంటనే తన ఇంటికి తిరిగి వస్తుంది. రావడం రావడమే నందూను ఆమె మీదకు రెచ్చగొట్టే ప్రయత్నాలు ప్రారంభిస్తుంది. ‘నువ్వు పంపినా సంతకం పెట్టనని చెప్పేసింది. అవసరం అని అడిగితే గొంతెమ్మ కోరికలు కోరేలా ఉంది. అక్కడకు నువ్వు వెళితే తప్ప పని జరిగేలా లేదు నందూ' అంటూ అతడిని తులసి ఇంటికి పంపిస్తుంది.

  అభి నుంచి తప్పించుకున్న అంకిత

  అభి నుంచి తప్పించుకున్న అంకిత

  మరోపక్క అంకిత ఆరోగ్య పరిస్థితిపై దిగులు చెందుతున్న అభి.. అత్తగారి దగ్గరకు వచ్చి కంగారు పడతాడు. ఆ తర్వాత డాక్టర్ ఇచ్చిన మందుల చీటిని చూస్తానని లోపలికి వెళ్తాడు. అంతలో అక్కడకు వచ్చిన అంకిత ‘ఎంత పని చేశావ్ మామ్.. ఆ చీటీ చూస్తూ నేను ప్రెగ్నెంట్ అని తెలిసిపోతుంది కదా' అంటూ కంగారున లోపలికి వెళ్తుంది. అభికి అబద్ధం చెప్పి ఇంటి నుంచి పంపుతుంది.

  తులసి కోసం ఇంటికి వచ్చిన నందూ

  తులసి కోసం ఇంటికి వచ్చిన నందూ

  లాస్యను పంపిస్తే పని జరగకపోయే సరికి నందూనే సంతకం కోసం తులసి దగ్గరకు వస్తాడు. వస్తూనే గట్టిగా కేకలు వేస్తాడు. దీంతో ఇంట్లో ఉన్న వాళ్లంతా బయటకు వస్తారు. ఆ సమయంలో తులసి ఎందుకు వచ్చారు అంటూ ప్రశ్నిస్తుంది. అప్పుడు నందూ ‘కొంచెం కూడా మర్యాద లేకుండా ఎందుకొచ్చావు అంటావా? స్థానబలం ఉందని రెచ్చిపోతున్నావా' అంటూ ఫైర్ అవుతాడు.

   దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన తులసి

  దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన తులసి

  తనపై కోప్పడుతున్న నందూను ‘అసలు ఇప్పుడెందుకు వచ్చారు? వేరే మార్గం లేకనే నా దగ్గరకు వచ్చారని నాకు తెలుసు. అసలు ఇప్పుడు మీరు నా భర్తగా వచ్చారా? వేరే విధంగా వచ్చారా? భార్యగా నా సంతకం కావాలంటే.. నన్ను అది అని ఒప్పుకుంటనే ఇప్పుడు సంతకం చేస్తాను' అంటూ అతడికి దిమ్మతిరిగేలా సమాధానం చెబుతుంది. దీంతో నందూ తెల్లముఖం వేసేస్తాడు.

  అత్తగారిపై ఒంటి కాలిపై లేనిన తులసి

  అత్తగారిపై ఒంటి కాలిపై లేనిన తులసి

  నందూ.. తులసి మధ్య భీకరమైన మాటల యుద్ధం జరుగుతుండగా.. అనసూయ మధ్యలోకి వచ్చి తన కొడుకుకు సపోర్టుగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు తులసి ‘మీరు నోరు అదుపులో పెట్టుకోండి అత్తయ్య. ఎప్పుడూ కొడుకు బాగుండాలని కోరుకునే మీరు.. కోడలి గురించి పట్టించుకున్నారా? అసలు మీకు మాట్లాడే అర్హతే లేదు' అంటూ ఆమె నోరు మూయించింది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 343: Lasya Went Tulasi House for Sign. But She Did Not Signed on The Agreement. Then Nandhu Came With Contract Papers.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X