Intinti Gruhalakshmi Today Episode: అడ్డంగా దొరికిపోయిన శృతి.. ప్రేమ్‌కు తెలియని అసలు నిజం
తరాలు మారుతూనే ఉన్నప్పటికీ తెలుగు బుల్లితెపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుంది. సుదీర్ఘ కాలంలో ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. స్పాన్సర్‌షిప్ డబ్బుల కోసం ఓ కంపెనీకి వెళ్లిన ప్రేమ్‌కు నిరాశే ఎదురవుతుంది. అలాగే, డబ్బు కోసం వెళ్లిన శృతిని మప్పీ లహరి అవమానించేలా మాట్లాడతాడు. ఆస్తిని అభి పేరు మీద కాకుండా అంకిత పేరు మీద రాయించడంతో అతడు తన తల్లితో గొడవ పడేందుకు వెళ్తాడు.
అక్కడ తులసిపై తన మాటలతో విరుచుకు పడతాడు. కానీ, తులసి మాత్రం ఏమీ అనకుండా కామ్‌గానే ఉంటుంది. అక్కడి నుంచి అభి నేరుగా తన తండ్రి ఇంటికెళ్తాడు. ఆస్తి అంకిత పేరు మీదున్నా.. మీకు డబ్బులు ఇస్తానని వాళ్లకు హామీ ఇస్తాడు.

నిరాశగా ప్రేమ్.. శృతికి చెప్పుడంతో
కంపెనీలో స్పాన్సర్‌షిప్ దొరకకపోవడంతో ప్రేమ్ నిరాశగా వెనుదిరుగుతాడు. అప్పుడు 'నా కన్నవాళ్లకే నా మీద నమ్మకం లేదు. ఇక వేరే వాళ్లు ఎలా నమ్ముతారు' అని అనుకుంటాడు. తర్వాత డబ్బులు ఎవరిని అడగాలి అని టెన్షన్ పడుతుంటాడు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న అతడికి శృతి ఫోన్ చేస్తుంది. అప్పుడామె 'కంపెనీకి వెళ్లిన పని ఏమైంది ప్రేమ్.. అల్బమ్స్ కోసం షూరిటీ ఇస్తా అని వాళ్లు చెప్పారా' అని అడుగుతుంది. దీంతో ప్రేమ్ 'షూరిటీ ఇవ్వమంటే ఇవ్వరన్నారు. అంతేకాదు ఎవరైనా రిఫరెన్స్ ఉంటే సంతకం పెడతారట' అని చెబుతాడు.

నిజం తెలుస్తుందని శృతి భయం
నిరాశగా వస్తున్న ప్రేమ్‌తో శృతి మరి ఇప్పుడేం చేస్తావ్ అని అడుగుతుంది. దీనికతడు 'మా బాస్ దగ్గరికి వెళ్తున్న.. ఆయన్నే కాళ్లు పట్టుకొని డబ్బులు అడుగుతా' అంటాడు. దీంతో శృతి భయపడిపోతుంది. తాను కూడా అక్కడే పని చేస్తున్నానన్న విషయం తెలిసిపోతుందని టెన్షన్ పడుతుంటుంది. అప్పుడు ప్రేమ్‌తో 'ప్రేమ్ నువ్వు డబ్బులు అడగడానికి రావొద్దు. అలా చేస్తే అడక్కుండా ఆల్బమ్ చేస్తున్నావని కోప్పడతాడు' అని భయపెడుతుంది. దీంతో ప్రేమ్ లిరిక్స్ రాశాను అవి ఇచ్చేందుకొస్తా అంటాడు. అప్పుడు శృతి ఇంత తప్పుదు అన్నట్లు దాక్కుంటుంది.

తులసిని కలిసి మాట్టాడిన అంకిత
రోడ్డు పక్కన కారులో వేచి చూస్తున్న అంకిత.. తులసిని కలుస్తుంది. స్కూటీ మీద వెళ్తుండగా ఆమెను ఆపి 'క్షమించండి ఆంటి.. ఇలా రోడ్డు మీద ఆపాను. మిమ్మల్ని వదిలేస్తే మా అంత దురదృష్టవంతులు ఉండరు. ఇష్టమైన వాళ్లను ఎవ్వరూ కావాలని దూరం పెట్టరు. ఎందుకంటే.. దానంత కష్టం ఇంకొకటి ఉండదు. మీరు మనసును చంపుకొని అలా చేస్తున్నారంటే.. మీ వాళ్ల మంచి కోసమే మీరు చెడ్డ అనిపించుకుంటున్నారని తెలుసు.
అత్తింటి గడప తొక్కొద్దంటూ మీరు అన్నప్పుడు నేను కూడా తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ, నేను ఎంత పొరపాటుగా ఆలోచించానో తర్వాత తెలుసుకున్నాను ఆంటి. కన్నీళ్లతో కాళ్లు కడుగుదామనిపించింది' అంటూ ఎమోషనల్ అవుతుంది.

తులసికి థ్యాంక్స్ చెప్పిన అంకిత
అంకిత మాటలకు తులసి 'మగవాళ్ల కంటే ఆడవాళ్లకు దేవుడు ఒకింత ఓర్పు ఎక్కువ ఇచ్చింది ఇలాంటి భారం మోయడానికే అమ్మ. ఇక చాలు.. నా వల్ల కాదు అని ఆడవాళ్లు అనుకుంటే దేవుడి సృష్టికే అర్థం ఉండదు. గుడిలో దేవుడు భక్తుల కష్టాలను ఓపికగా వినాల్సిందే. అలాగే.. ఇంట్లో ఆడవాళ్లు కూడా ఇంట్లో కష్టాలను ఓపికతో భరించాల్సిందే.
నా మీద కోపం పెట్టుకోకుండా.. నన్ను చూడటానికి వచ్చినందుకు థాంక్స్' అంటుంది. అప్పుడు అంకిత 'ఆంటి.. నేను మీకు థాంక్స్ చెప్పడానికి వచ్చాను. ఆస్తిని అభి పేరు మీద కాకుండా.. నా పేరు మీదికి చేసేలా చేశారు అందుకు థాంక్స్' అంటుంది. దీనికి తులసి రేపు అభి ఇంత కంటే ఎక్కువ క్షోభ అనుభవించాల్సి వస్తుంది అంటుంది.

నేను ఓడాను.. ఇప్పుడలా అవదు
తులసి మాటలకు అంకిత 'అవును ఆంటి.. ఒక విధంగా అభిని సేవ్ చేశారు. నాకు, అభికి మధ్య గొడవలు రాకుండా చేసి నా కాపురాన్ని నిలబెట్టారు' అంటుంది. దీనికి తులసి 'నువ్వు తెలివైన దానివి కాబట్టి నన్ను అర్థం చేసుకున్నావు కానీ.. నా కొడుకు మాత్రం నన్ను అర్థం చేసుకోవడం లేదు' అంటుంది. దీంతో అంకిత మళ్లీ అభి మీ దగ్గరవుతాడు ఆంటి అంటుంది. దీనికి తులసి 'లాస్య మాయ నుంచి బయటపడి నా భర్త కూడా నేనేంటో తెలుసుకుంటాడని అనుకున్నా. లాస్యనే గెలిచింది.
నా భర్తను నేను ఓడిపోయాను. వదులుకున్నాను. చూద్దాం.. నా కొడుకు విషయంలో ఏం జరుగుతుందో. అలాగని నేను నిరాశ పడటం లేదు అంకిత. చివరి వరకు యుద్ధం చేస్తాను. అప్పట్లో కూడా యుద్ధం చేశాను. కానీ.. దేవుడి మీద ఎక్కువ భారం వేశాను. ఇప్పుడు అలా కాదు అంకిత. నా యుద్ధాన్ని నేనే గెలుస్తాను. నన్ను నేను నమ్ముకునేలా దేవుడు వరమిచ్చాడు. అది చాలు' అంటుంది.

పాటను మప్పీ లహరికి ఇచ్చేస్తూ
ప్రేమ్.. లిరిక్స్ రాసిన పేపర్ పట్టుకుని మప్పీ లహరి ఇంటికి వస్తాడు. వెళ్లడమే నమస్తే సార్ అంటాడు. నేను రమ్మన్నానా అంటాడు దీంతో నేనే వచ్చాను సార్ అంటాడు. ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. దీంతో ప్రేమ్ 'మీరు చెప్పిన పాట రాసుకొచ్చాను సార్. ఈరోజు ఇవ్వమని చెప్పారు తీసుకొచ్చాను' అంటాడు.
అప్పుడాయన 'చెప్పిన సమయానికి రాసుకొచ్చావు. అసలే కుర్రాడివి ఆ మాత్రం స్పీడ్ ఉండాలిలే' అంటూ పాట చదివి అదిరిపోయింది అంటాడు. అదేంటి నిలబడే ఉన్నావు కూర్చో అంటాడు. కాఫీ తాగుతావా అనగా వద్దంటూ వెళ్లిపోతాడు.

శృతిని చూసిన అంకిత, తులసి
తులసి, అంకిత రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుండగా.. శృతి ఓ ఇంట్లో పని చేస్తూ కనిపిస్తుంది. అప్పుడామెను పిలిచిన తులసి ఏంటని ప్రశ్నిస్తుంది. దీనికి శృతి 'ఏ పని దొరకనప్పుడు ఏం చేస్తాం. బతకాలి అనుకున్నప్పుడు ఏదో ఒక పని చేయాలి కదా ఆంటి. కళ్ల ముందు మనకు అవకాశాలు ఉంటే.. ఏదైనా అవకాశాన్ని ఎంచుకోవచ్చు. అసలు అవకాశమే లేనప్పుడు రాజీపడాల్సిందే ఆంటి' అంటుంది.
దీనికి తులసి ఒక్క మాట నాతో చెప్పాల్సింది కదా అంటుంది. అప్పుడు శృతి 'మీరు చెప్పే అవకాశం ఇస్తే కదా ఆంటి. ప్రేమ్ మీతో మాట్లాడటానికి ట్రై చేసినా దూరం పెట్టారు. అమ్మ కల నెరవేర్చాలని ప్రేమ్ పడరాని కష్టాలు పడుతున్నాడు. తప్పని సరి పరిస్థితుల్లో నేను పనిమనిషిగా మారాను కానీ.. ఇష్టంతో కాదు' అంటుంది. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











